News June 13, 2024

రోహిత్, నేను ఒకే స్కూల్: హర్మీత్ సింగ్

image

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, తాను ఒకే స్కూల్ అని యూఎస్ఏ ప్లేయర్ హర్మీత్ సింగ్ చెప్పారు. తాను పాఠశాలలో చేరే సమయానికి హిట్ మ్యాన్ పట్టభద్రుడయ్యాడని తెలిపారు. ఫస్ట్ క్లాస్ అరంగేట్ర మ్యాచులో రోహిత్ కూడా ఉన్నాడని పేర్కొన్నారు. ముంబై ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతుండటం ఆనందంగా ఉందని చెప్పారు. ఇండియా తరఫున U-19లో శాంసన్, కుల్‌దీప్ యాదవ్, అక్షర్‌తో కలిసి ఆడినట్లు పేర్కొన్నారు.

News June 13, 2024

అమెరికా స్టూడెంట్ వీసా ప్రక్రియ షురూ

image

అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థుల కోసం విద్యార్థి వీసాను అందించే ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ప్రధాన నగరాల్లోని కేంద్రాల్లో ఇంటర్వ్యూలకు విద్యార్థులు బారులు తీరారు. గతేడాది రికార్డు స్థాయిలో లక్షా 40 వేల మందికి స్టూడెంట్ వీసాలను జారీ చేసింది. మరే దేశానికి ఈ స్థాయిలో వీసాలు ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా అంతకంటే ఎక్కువే ఉండొచ్చని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది.

News June 13, 2024

ఆమె కోసం హత్య చేసిన హీరో.. ఎవరీ పవిత్ర గౌడ?

image

హీరోయిన్‌ పవిత్ర గౌడ కోసం కన్నడ హీరో దర్శన్ హత్యారోపణలతో జైలుకెళ్లడం కన్నడనాట కలకలం రేపుతోంది. దీంతో ఎవరీ పవిత్ర గౌడ అంటూ నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. 2016లో ‘54321’తో ఆమె సినిమాల్లోకి వచ్చారు. తమ బంధానికి పదేళ్లంటూ కొన్నాళ్ల క్రితం ఇన్‌స్టాలో ఆమె షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అయింది. దర్శన్ అసలు భార్యకు అన్యాయం జరుగుతోందని బాధపడిన ఓ ఫ్యాన్ పవిత్రను హెచ్చరించడం, హత్యకు గురికావడం జరిగాయి.

News June 13, 2024

DEC 31 కల్లా టీచర్ పోస్టుల భర్తీకి ఆదేశాలు

image

మెగా డీఎస్సీలో భాగంగా ప్రకటించిన 16,347 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. డిసెంబర్ 31 నాటికల్లా టీచర్ పోస్టులు భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను సీఎస్ ఆదేశించారు. కాగా ఈరోజు సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు మెగా డీఎస్సీపై సంతకం చేసిన విషయం తెలిసిందే.

News June 13, 2024

విడాకుల వార్తలకు హార్దిక్ చెక్ పెట్టినట్లేనా?

image

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య తన భార్య నటాషా నుంచి విడిపోయేందుకు సిద్ధమయ్యారని వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లుగా తెలుస్తోంది. పాండ్యను ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం పాంటింగ్ ‘ఎలా ఉన్నారు? మీ ఫ్యామిలీ ఎలా ఉంది?’ అని ప్రశ్నించారు. దానికి హార్దిక్ స్పందిస్తూ ‘ఆల్ గుడ్. ఆల్ స్వీట్(బాగానే ఉందనే ఉద్దేశంతో)’ అని బదులిచ్చారు. ఇటీవల నటాషా సైతం ఫొటోలను ఇన్‌స్టాలో రీస్టోర్ చేశారని వార్తలు వచ్చాయి.

News June 13, 2024

అన్న క్యాంటీన్లు మళ్లీ వస్తున్నాయ్!

image

ఏపీ CMగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు అన్నక్యాంటీన్లను పునరుద్ధరించే ఫైల్‌పైనా సంతకం చేశారు. రూ.5కే అల్పాహారం, భోజనం అందించే ఈ క్యాంటీన్లకు గత TDP హయాంలో మంచి ఆదరణే లభించింది. వీటిని మళ్లీ తెస్తుండటంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో APలో 183 క్యాంటీన్లు నడిచాయి. సగటున రోజుకు 2.50 లక్షల మంది భోజనం చేసేవారు. ఈసారి క్యాంటీన్ల సంఖ్య ఏ మేరకు పెంచుతారు? బడ్జెట్ ఎంత కేటాయిస్తారనేది చూడాలి.

News June 13, 2024

జమ్మూకశ్మీర్‌లో జాతీయ గీతాలాపన తప్పనిసరి: విద్యాశాఖ

image

జమ్మూకశ్మీర్‌లోని అన్ని పాఠశాలల్లోనూ రోజూ ఉదయం అసెంబ్లీ సమయంలో కచ్చితంగా జాతీయగీతాన్ని ఆలపించాలని అక్కడి విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సర్క్యులర్ జారీ చేశారు. ఉదయం అసెంబ్లీల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక సమగ్రత, ఐకమత్యం అలవడతాయని అందులో వివరించారు. అవసరమైతే ప్రత్యేక అతిథుల్ని ఆహ్వానించి విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంచాలని సూచించారు.

News June 13, 2024

నెదర్లాండ్స్ టార్గెట్ 160 రన్స్

image

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు రాణించారు. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 రన్స్ చేశారు. ఆ జట్టు సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్(64) హాఫ్ సెంచరీతో రాణించారు. ఓపెనర్ తంజిద్ హసన్(35), మహ్మదుల్లా(25) ఫరవాలేదనిపించారు. నెదర్లాండ్స్ గెలవాలంటే 160 రన్స్ చేయాలి. ఇందులో ఏ జట్టు గెలిస్తే దానికి సూపర్8 అవకాశాలు మెరుగవుతాయి.

News June 13, 2024

బక్రీద్‌కు గోవధ జరగకుండా చూడండి: హైకోర్టు

image

బక్రీద్ వేళ గోవధ జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గోవుల తరలింపును అడ్డుకోవాలని పోలీసులను ఆదేశించింది. అక్రమంగా గోవులను చంపిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. జంతువధ చట్టం అమలులో ఉన్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. బక్రీద్ వేళ గోవధను అడ్డుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు ఇలా స్పందించింది.

News June 13, 2024

ఈరోజూ మంత్రుల శాఖల ప్రకటన లేనట్లేనా?

image

AP: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో అందరి దృష్టి మంత్రి వర్గ కూర్పుపై పడింది. ఎవరికి ఏ శాఖలు ఇస్తారనే ఉత్కంఠ నిన్నటి నుంచి కొనసాగుతోంది. బుధవారం రాత్రే శాఖలు ప్రకటిస్తారని చాలామంది భావించారు. కానీ ప్రకటించలేదు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. తాజా పరిస్థితి చూస్తుంటే ఈరోజు కూడా అందరూ ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేలా కనిపించడం లేదు.