News June 13, 2024

అలా చేసి ఇంగ్లండ్‌ను ఇంటికి పంపండి: టిమ్ పైన్

image

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టిమ్ పైన్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీ20 వరల్డ్ కప్ నుంచి ఇంగ్లండ్‌ను బయటకు పంపించేందుకు స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫలితాలను తప్పకుండా తారుమారు చేయాలంటూ సూచించారు. తాను జోక్ చేయట్లేదని సీరియస్‌గానే ఈ కామెంట్స్ చేస్తున్నట్లు కుండబద్దలు కొట్టారు. తాను చెప్పినట్లు చేస్తే టోర్నీ నుంచి ఇంగ్లండ్ నిష్క్రమించి టైటిల్ గెలవడం ఆసీస్‌కు సులభమవుతుందని పైన్ చెప్పుకొచ్చారు.

News June 13, 2024

ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసిన TDP ఎంపీ

image

AP: కర్నూలు టీడీపీ ఎంపీ బస్తిపాటి నాగరాజు ఎంపీటీసీ పదవికి రాజీనామా చేశారు. జడ్పీ సీఈవో నర్సారెడ్డికి తన రాజీనామా లేఖను అందించారు. నాగరాజు 2021లో కర్నూలు జిల్లా పంచలింగాల నుంచి టీడీపీ ఎంపీటీసీగా గెలిచారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు చంద్రబాబు కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆయన వైసీపీ అభ్యర్థి రామయ్యపై లక్షకుపైగా మెజార్టీతో గెలుపొందారు. దీంతో తన ఎంపీటీసీ పదవికి నాగరాజు రాజీనామా చేశారు.

News June 13, 2024

అంబుజా చేతికి పెన్నా సిమెంట్

image

పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను రూ.10,422 కోట్లకు కొనుగోలు చేసినట్లు అదానీ గ్రూప్స్‌‌కు చెందిన అంబుజా సిమెంట్ ప్రకటించింది. పెన్నా అధినేత పి.ప్రతాప్ రెడ్డితో పాటు ఆయన కుటుంబం పేరిట ఉన్న 100% షేర్లను బదిలీ చేసుకుంటామని తెలిపింది. పెన్నాకు 14 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. కృష్ణపట్నం, జోధ్‌పుర్‌లో మరో 2 యూనిట్లు సిద్ధమవుతున్నాయి.

News June 13, 2024

ఆ అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాలి: CM

image

AP: తనను కలిసేందుకు వచ్చిన IPS, IASలతో CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో కొందరు అధికారుల తీరు తనను బాధించిందన్నారు. ఇలా వ్యవహరిస్తారని ఎప్పుడూ అనుకోలేదని, ఆ అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. శాఖలవారీగా మరోసారి సమావేశం అవుతానని చెప్పారు. మరోవైపు సచివాలయం నుంచి ఇంటికి చేరుకున్న సీఎం మంత్రులకు శాఖల కేటాయింపుపై కసరత్తు చేస్తున్నారు. ఇవాళ లేదా రేపు ప్రకటన చేసే అవకాశం ఉంది.

News June 13, 2024

సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి 2 రైళ్లలో దొంగతనం!

image

TG: ఖమ్మం జిల్లా చింతకాని వద్ద రైళ్లలో దోపిడీ ఘటన కలకలం రేపింది. నిన్న రాత్రి 2 రైళ్లలోని 8 బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి ఈ దొంగతనానికి పాల్పడినట్లు సమాచారం. ప్రయాణికుల ఆన్‌లైన్ ఫిర్యాదులతో ఈ దోపిడీ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై రైల్వే అధికారులు స్పందించాల్సి ఉంది.

News June 13, 2024

KCR ఫొటో తొలగించాలన్న ఆలోచన సరికాదు: సబిత

image

TG: తెలుగు పాఠ్యపుస్తకాలను వెనక్కి తీసుకొని KCR ఫొటో, గుర్తులు తొలగించాలన్న ఆలోచన సరికాదని విద్యాశాఖ మాజీ మంత్రి సబితారెడ్డి అన్నారు. జయలలిత బొమ్మలు ఉన్న బ్యాగులను స్టాలిన్, జగన్ ఫొటోలు ఉన్న కిట్లను చంద్రబాబు అనుమతించారని గుర్తుచేశారు. KCR పేరుందని చింపిన పేజీల వెనుక జాతీయగీతం, ప్రతిజ్ఞ ఉన్నా పట్టింపు లేదా అని మండిపడ్డారు. ఇప్పటికైనా హుందాగా ప్రవర్తించి పాలనపై దృష్టి పెట్టాలని సబిత హితవు పలికారు.

News June 13, 2024

పూల బొకేలు, శాలువాలు తీసుకురావొద్దు: పవన్

image

AP: ఈనెల 20 తర్వాత జనసేనాని, మంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించనున్నారు. త్వరలోనే జిల్లాలవారీగా అందరినీ కలుస్తానని చెప్పారు. తనను కలిసేందుకు వచ్చే వారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్, ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పర్యటించడం ఇదే తొలిసారి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

News June 13, 2024

అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’

image

విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం అర్ధరాత్రి నుంచి OTTలో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ శుక్రవారం(జూన్ 14) నుంచి చిత్రాన్ని ప్రసారం చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. కాగా కృష్ణ చైతన్య ఈ మూవీకి దర్శకత్వం వహించారు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటించగా అంజలి కీలక పాత్ర పోషించారు.

News June 13, 2024

23న సోనాక్షి పెళ్లి! వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇదే..

image

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన పెళ్లి తేదీని కన్ఫర్మ్ చేశారని ‘INDIA TODAY’ తెలిపింది. ఈనెల 23న ముంబైలోని బాస్టియన్‌లో రా.8 గంటలకు జహీర్ ఇక్బాల్‌ను సోనాక్షి వివాహం చేసుకోనున్నట్లు పేర్కొంది. వెడ్డింగ్ ఇన్విటేషన్ వినూత్నంగా మ్యాగజైన్ కవర్ పేజీ తరహాలో ఉందని వెల్లడించింది. కాగా ఇటీవల సోనాక్షి వివాహం వార్తలపై ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా స్పందించారు. పెళ్లి గురించి ఆమె తనకు ఇంకా చెప్పలేదన్నారు.

News June 13, 2024

రాష్ట్రంలో మరో అంతర్జాతీయ కంపెనీ కేంద్రం ఏర్పాటు

image

TG: మెడికల్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న ఒలింపస్ కార్పొరేషన్ రాష్ట్రంలో పరిశోధన కేంద్రాన్ని(R&D) ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. న్యూయార్క్‌లో ఆ సంస్థ అధికారులతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఒలింపస్‌కు పూర్తి సహాకారం ఉంటుందని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో స్థానికులకు ఉపాధితో పాటు వైద్య రంగంలో ఆవిష్కరణలకు దోహదపడుతుందని పేర్కొన్నారు.