News June 12, 2024

గాయపడిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి

image

మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి గాయపడ్డారు. తన కుడికాలికి గాయం అయిందని, కోలుకుంటున్నానని ఆమె ఇన్‌స్టా స్టోరీలో ఓ ఫొటోను షేర్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి పవన్ చేరుకున్న రోజు ఆమె కాలికి పట్టీ కనిపించలేదని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. షూటింగ్‌లో గాయమైందా? లేక ఇంట్లోనేనా? అనే విషయం తెలియాల్సి ఉంది. గాయం కారణంగా ఆమె పవన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు.

News June 12, 2024

మెగా డీఎస్సీపైనే CM చంద్రబాబు తొలి సంతకం?

image

AP: నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఆయన మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేస్తారని తెలుస్తోంది. పెన్షన్ రూ.4వేలకు పెంచుతూ మూడో సంతకం చేస్తారట. 4వ సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై, 5వ సంతకం స్కిల్ సెన్సెస్‌పై ఉంటుందని తెలుస్తోంది.

News June 12, 2024

CMగా చూడాలనే మా కలకి పవన్‌ ఒక్క అడుగు దూరంలో ఉన్నారు: అంబటి

image

ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి క్రికెటర్ అంబటి రాయుడు అభినందనలు తెలిపారు. ‘పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా చూడాలనే మా కలకి ఆయన ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. జనసేనలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఇది గొప్పరోజు’ అని ఆయన ట్వీట్ చేశారు.

News June 12, 2024

సూపర్‌ఫాస్ట్‌గా పుంజుకున్నాయి..!

image

ఎన్నికల ఫలితాల ప్రభావం నుంచి స్టాక్ మార్కెట్లు శరవేగంగా కోలుకున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. జూన్ 4న 6% నష్టపోయిన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాతి మూడు సెషన్లలో ఆ నష్టాన్ని అధిగమించాయి. 5శాతం కంటే ఎక్కువ నష్టపోయి ఇంత త్వరగా కోలుకోవడం గత పదేళ్లలో ఇదే తొలిసారి. లోకల్ స్టాక్స్‌పైన ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

News June 12, 2024

చంద్రబాబు గారూ దాడులను ఆపండి: షర్మిల

image

AP: సీఎం చంద్రబాబుకు ఏపీసీసీ చీఫ్ YS షర్మిల బహిరంగ లేఖ రాశారు. ‘సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మీకు శుభాకాంక్షలు. ఐదేళ్ల విధ్వంస పాలనను గాడిలో పెట్టేందుకు ప్రజలు అధికారమిచ్చారు. వారం రోజులుగా వైసీపీ నేతలు, కార్యకర్తలు, వైఎస్సార్ విగ్రహాలపై జరుగుతున్న దాడులు నన్ను కలచివేశాయి. మీ అనుభవంతో పరిస్థితులను చక్కదిద్ది ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రజారంజక పాలన అందిస్తారని ఆశిస్తున్నా’ అని లేఖలో పేర్కొన్నారు.

News June 12, 2024

మంత్రులతో చంద్రబాబు భేటీ.. కాసేపట్లో శాఖలు ఖరారు

image

AP: ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. కేబినెట్‌లో చోటు కల్పించినందుకు CBNకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. మరి కాసేపట్లో మంత్రులకు శాఖలు ఖరారు కానున్నాయి. అటు పవన్ కళ్యాణ్‌కు ఏ శాఖ వస్తుంది? ఏపీ ఐటీ మంత్రి ఎవరనే దానిపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

News June 12, 2024

ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డ హెజ్బొల్లా

image

లెబనాన్‌కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. తన దళానికి చెందిన టాప్ కమాండర్‌ హజ్ అబూ తలేబ్‌ను ఇజ్రాయెల్ చంపడంతో ప్రతీకార దాడికి దిగింది. నార్త్ ఇజ్రాయెల్‌పై భారీ స్థాయిలో దాడులు చేపట్టింది. ప్రాణనష్టంపై సమాచారం అందలేదు. కాగా ఇజ్రాయెల్‌తో యుద్ధం చేస్తున్న హమాస్ మిలిటెంట్లకు హెజ్బొల్లా మద్దతు ప్రకటించింది. ఈ గ్రూప్‌కు ఇరాన్ సాయమందిస్తోంది.

News June 12, 2024

APలో రాక్షస పాలన: YCP నేత సుబ్బారెడ్డి

image

AP: జూన్ 4వ తేదీ సాయంత్రం నుంచి రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని YCP నేత YV సుబ్బారెడ్డి విమర్శించారు. ‘2014 నుంచి 19 వరకు CBN ఇలాంటి పాలనే చేశారు. ప్లాన్ ప్రకారం YCP కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తున్నారు. కొన్నిచోట్ల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పోలీసులు పట్టించుకోవడంలేదు. ఈ దాడులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. ఆ తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తాం’ అని YVS వెల్లడించారు.

News June 12, 2024

ఎమ్మెల్యే పదవికి అఖిలేశ్ రాజీనామా

image

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కన్నౌజ్ పార్లమెంటు స్థానం నుంచి గెలిచిన ఆయన ఎంపీగా కొనసాగుతానని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఫైజాబాద్ ఎంపీగా గెలుపొందిన పార్టీ సీనియర్ నేత అవధేశ్ ప్రసాద్ కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను శాసనసభ ముఖ్యకార్యదర్శి కార్యాలయానికి పంపారు. ఇటీవల యూపీలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో SP 37 స్థానాలు గెలుచుకుంది.

News June 12, 2024

మలయాళంలోకి సమంత ఎంట్రీ?

image

స్టార్ హీరోయిన్ సమంత మాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మమ్ముట్టి సరసన ఆమె నటిస్తారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో పోలీస్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కనున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన ఈ బ్యూటీ ఇప్పటివరకు మలయాళంలో సినిమా చేయలేదు.