News June 11, 2024

T20WC: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా

image

T20WCలో అత్యల్ప స్కోరు(114)ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా సౌతాఫ్రికా చరిత్ర సృష్టించింది. నిన్న బంగ్లాపై గెలుపుతో ఈ ఘనత సాధ్యమైంది. ఆ తర్వాతి స్థానాల్లో శ్రీలంక-120(vsకివీస్), ఇండియా-120(vsపాక్), అఫ్గాన్-124(vsవిండీస్), న్యూజిలాండ్-127(vs ఇండియా) ఉన్నాయి. అలాగే పొట్టి ఫార్మాట్‌లో బంగ్లాపై వరుసగా అత్యధిక మ్యాచ్‌లు(9) గెలిచిన రెండో జట్టుగా ప్రొటీస్ నిలిచింది. కివీస్ 10 గెలుపులతో తొలిస్థానంలో ఉంది.

News June 11, 2024

చంద్రబాబును CM అభ్యర్థిగా ప్రతిపాదించనున్న పవన్!

image

AP: కాసేపట్లో ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించే అవకాశం ఉంది. ఆయన ప్రతిపాదనను బీజేపీ ఎమ్మెల్యేలు బలపర్చనున్నట్లు సమాచారం. అనంతరం ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలంతా గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌కు పంపనున్నారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కూటమికి ఆయన ఆహ్వానం పంపనున్నారు. రేపు కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.

News June 11, 2024

విద్యార్థులకు GOOD NEWS: యథావిధిగా విద్యాకానుక కిట్లు

image

AP: ప్రభుత్వం మారడంతో ‘జగనన్న విద్యాకానుక’ కింద అందించే ఉచిత పుస్తకాలు, యూనిఫామ్‌లతో కూడిన కిట్స్ సంగతేంటనే ప్రశ్న తలెత్తింది. అయితే వీటిని యథావిధిగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్కూళ్లు ప్రారంభమయ్యే జూన్ 13 నుంచే పంపిణీ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. అటు గత ప్రభుత్వంలో విద్యాకానుకలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వాటిపై విచారణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

News June 11, 2024

క్షమాపణలు కోరిన పాక్ మాజీ క్రికెటర్

image

సిక్కులపై అనుచిత <<13417892>>వ్యాఖ్యలు<<>> చేసినందుకు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ క్షమాపణలు చెప్పారు. ‘నా కామెంట్స్ పట్ల తీవ్రంగా చింతిస్తున్నాను. హర్భజన్ సింగ్‌తో పాటు సిక్కులందరినీ క్షమాపణ కోరుతున్నా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. ఎవరినీ కించపరచడం నా ఉద్దేశం కాదు. దయచేసి నన్ను క్షమించండి’ అని ఆయన ట్వీట్ చేశారు.

News June 11, 2024

విమానాశ్రయాల ప్రాజెక్టులకు రెక్కలు!

image

AP: TDP MP రామ్మోహన్ నాయడు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కావడంతో రాష్ట్రంలోని విమానాశ్రయాల అభివృద్ధి ప్రాజెక్టులకు రెక్కలొచ్చాయి. విజయవాడ ఎయిర్‌పోర్ట్ సమీకృత టెర్మినల్‌ను త్వరగా పూర్తి చేసేందుకు అవకాశం ఏర్పడింది. విశాఖ సమీపంలోని భోగాపురం, నెల్లూరు(D) దగదర్తిలో ఎయిర్‌పోర్టులు నిర్మించాలని గతంలో చంద్రబాబు నిర్ణయించినా అధికారం కోల్పోవడంతో సాధ్యం కాలేదు. ఇప్పుడు వాటి ఏర్పాటుకు అవకాశం లభించింది.

News June 11, 2024

ఇంటర్‌లో 470కి 466 మార్కులు.. అకాల మరణం

image

TG: సరస్వతీ పుత్రుడు అకాల మరణం చెందాడు. ఇటీవల ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 470కి 466 మార్కులు సాధించిన శ్రీవత్సవ్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్‌తో మరణించాడు. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన సుతారి శ్రీవత్సవ్ (18) ఈ నెల 7న అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో పేరెంట్స్ ఆస్పత్రిలో చేర్చారు. బ్రెయిన్‌లో ఇన్ఫెక్షన్ వల్ల క్రమంగా గుండె, బ్రెయిన్, కిడ్నీలు పని చేయడం మందగించి నిన్న ప్రాణాలు వదిలాడు.

News June 11, 2024

‘కల్కి’ నుంచి మరో ట్రైలర్ సిద్ధం?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ నుంచి మరో ట్రైలర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదల వారానికి ముందు ఈ ట్రైలర్ రానున్నట్లు సమాచారం. దీని నిడివి 2.30 నిమిషాలు ఉన్నట్లు టాక్. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్, అమితాబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 27న మూవీ విడుదల కానుంది.

News June 11, 2024

పౌర విమానయానం అభివృద్ధి చెందేలా చూస్తాను: KRN

image

AP: తనకు పౌరవిమానయాన శాఖ కేటాయింపుపై శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. ‘విమానయాన శాఖ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, చంద్రబాబుకు నా కృతజ్ఞతలు. నా వంతుగా కృషి చేసి దేశంలో పౌర విమానయానం అభివృద్ధి చెందేలా చూస్తాను’ అని ట్వీట్ చేశారు. మోదీ, చంద్రబాబు ఫొటోలు, తండ్రి ఎర్రన్నాయుడు విగ్రహం ఉన్న ఫొటోను KRN షేర్ చేశారు.

News June 11, 2024

త్వరలో కొత్త రేషన్ కార్డులు.. సన్న బియ్యం: మంత్రి

image

TG: కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో విధివిధానాలు రూపొందించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే అర్హులందరికీ కార్డులు మంజూరు చేస్తామన్నారు. 3 నెలల తర్వాత రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చే ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.

News June 11, 2024

EPFO: కేవైసీ ఉంటే చెక్ అవసరం లేదు!

image

ఉద్యోగుల క్లెయిమ్‌లు తిరస్కరణకు గురికాకుండా ఈపీఎఫ్‌వో మరో వెసులుబాటు కల్పించింది. చందాదారుడి బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఈకేవైసీ పూర్తయితే క్లెయిమ్ సమయంలో చెక్, పాస్‌బుక్ కాపీలు జత చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈమేరకు క్లెయిమ్‌ దరఖాస్తు సమయంలో నోట్ కనిపిస్తుందని తెలిపింది. దీంతో ఈపీఎఫ్ క్లెయిమ్‌లు సత్వరం పరిష్కారం అవుతాయని సంస్థ భావిస్తోంది.