News June 10, 2024

అది పులి కాదు.. పిల్లి: పోలీసులు

image

నిన్న రాష్ట్రపతి భవన్‌లో MPల ప్రమాణ స్వీకారోత్సవం సమయంలో వెనకాల <<13413583>>చిరుత పులి<<>> సంచరిస్తున్నట్లు వైరల్ అయిన వీడియోపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. అది సాధారణ పిల్లి అని వెల్లడించారు. న్యూస్ ఛానెల్‌లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అది క్రూర జంతువుగా ప్రచారం చేశారని, అందులో నిజం లేదని స్పష్టం చేశారు.

News June 10, 2024

మాజీ సీఎంలకు కీలక శాఖలు

image

మోదీ 3.0లో మాజీ సీఎంలకు కీలక శాఖలను కేటాయించారు.
*రాజ్‌నాథ్ సింగ్- రక్షణ శాఖ,
*శివరాజ్ సింగ్ చౌహాన్‌- వ్యవసాయం-రైతు సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి
*మనోహర్ లాల్ ఖట్టర్‌- గృహ, పట్టణ వ్యవహారాలు, విద్యుత్ శాఖ
*సర్బానంద సోనోవాల్‌- ఓడరేవులు-షిప్పింగ్, జలరవాణా
*జితన్ రామ్ మాంఝీ- సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
*కుమారస్వామి- భారీ పరిశ్రమలు, ఉక్కు మంత్రిత్వ శాఖ.

News June 10, 2024

‘కల్కి’ ట్రైలర్‌పై నాగ్ అశ్విన్ స్పెషల్ నోట్

image

‘కల్కి’ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రేక్షకులను ఉద్దేశించి ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశారు. ‘ఈరోజును చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. కానీ ఇది తెలుగు ప్రేక్షకులుగా, భారతీయులుగా, సినీ ప్రేమికులుగా మనం గర్వించేలా ఉంటుందని ఆశిస్తున్నా. మా టీమ్ మొత్తం కల్కి ప్రపంచాన్ని మీతో పంచుకోవడానికి ఎదురుచూస్తోంది’ అని నాగ్ పేర్కొన్నారు. మరి ట్రైలర్ ఎలా ఉందో కామెంట్ చేయండి.

News June 10, 2024

రూ.2లక్షల రుణమాఫీ.. సీఎం కీలక ఆదేశాలు

image

TG: రూ.2లక్షల రైతు రుణమాఫీపై విధివిధానాలు రూపొందించాలని CM రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలి. పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలి. కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా చూడాలి. AUG 15లోగా రుణమాఫీ చేసి తీరాలి’ అని రుణమాఫీ, వ్యవసాయ శాఖపై సమీక్షలో CM స్పష్టం చేశారు.

News June 10, 2024

BJP అధ్యక్ష రేసులో ఉంది వీరేనా?

image

BJP జాతీయాధ్యక్షుడు <<13412351>>జేపీ నడ్డా<<>> కేబినెట్‌లోకి వెళ్లడంతో ఆ బాధ్యతలు ఎవరు చేపడతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ రేసులో ఐదుగురు ఉన్నట్లు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుత జనరల్ సెక్రటరీలు సునీల్ బన్సల్(UP), వినోద్ తావ్డే(మహారాష్ట్ర), BL సంతోశ్(కర్ణాటక), లోక్‌సభ స్పీకర్ బాధ్యతలు నిర్వర్తించిన ఓం బిర్లా(రాజస్థాన్), BJP సీనియర్ లీడర్ ఓం మాథుర్(రాజస్థాన్)లు ఉన్నట్లు తెలుస్తోంది.

News June 10, 2024

T20WC: పీకల్లోతు కష్టాల్లో సౌతాఫ్రికా

image

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. సఫారీ జట్టు 5.3 ఓవర్లకే 25 రన్స్ మాత్రమే చేసి కీలకమైన 4 వికెట్లు కోల్పోయింది. డికాక్(18), హెన్రిక్స్(0), మార్క్‌రమ్(4), స్టబ్స్(0) తీవ్రంగా నిరాశపరిచారు. క్రీజులో క్లాసెన్(0), మిల్లర్(2) ఉన్నారు.

News June 10, 2024

ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు

image

AP: ఈ నెల 12న విజయవాడ కేసరపల్లి IT పార్కు వద్ద జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం ఉ.8.20 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి ఉ.10.40 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకుని, ఉ.11 గంటల నుంచి మ.12.30 గంటల వరకు కార్యక్రమంలో పాల్గొంటారు. మ.12.45 గంటలకు విమానంలో భువనేశ్వర్ పర్యటనకు బయల్దేరి వెళ్తారు.

News June 10, 2024

రాజకీయాలకు కేశినేని గుడ్ బై.. TDP కౌంటర్

image

AP: విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పడంపై టీడీపీ స్పందించింది. కృష్ణా జిల్లాలో 60శాతం టీడీపీని ఖాళీ చేస్తామంటూ గతంలో కేశినేని నాని చేసిన పోస్టుకు Xలో రిప్లై ఇచ్చింది. ‘ప్రజల నుంచి పుట్టిన తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయడం, శవాల మీద పుట్టిన వైసీపీ వల్ల కాదు’ అని ట్వీట్ చేసింది.

News June 10, 2024

BREAKING: కిషన్‌రెడ్డికి బొగ్గు గనుల శాఖ

image

తెలంగాణ బీజేపీ చీఫ్, సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డికి బొగ్గు గనుల శాఖను కేటాయించారు. ఆయన 2019లో హోంశాఖ సహాయమంత్రిగా, ఆ తర్వాత పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. తాజా ఎన్నికల్లో మరోసారి ఎంపీగా గెలిచి కీలకశాఖ పొందారు. ఈ ఎన్నికల్లో BJPకి 8 MP సీట్లు రావడంలో కీలకంగా మారిన కిషన్‌రెడ్డి ఏకంగా కేబినెట్‌లో చోటు సాధించారు.

News June 10, 2024

మోదీ వద్ద ఉన్న శాఖలు ఇవే..

image

* వ్యక్తిగత, ప్రజా ఫిర్యాదులు-పెన్షన్లు
* డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ
* డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్
* అన్ని ముఖ్యమైన పాలసీ వ్యవహారాలు
* ఇతరులెవ్వరికీ కేటాయించని శాఖలు