News January 8, 2025

ఫార్ములా-ఈ కేసు: విచారణకు హాజరైన నిందితులు

image

TG: ఫార్ములా-ఈ కేసులో HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. పలు డాక్యుమెంట్లతో హాజరైన ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. రూ.45.71కోట్లు విదేశీ సంస్థకు బదిలీ చేసిన వ్యవహారంలో ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. మరోవైపు ఇదే వ్యవహారంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు.

News January 8, 2025

Stock Markets: O&G షేర్లు అదుర్స్.. మిగతావి బెదుర్స్

image

బెంచ్‌మార్క్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఒపెక్ కంట్రీస్ క్రూడాయిల్ సరఫరాను తగ్గించడం, బలహీనమైన US జాబ్‌డేటా నెగటివ్ సెంటిమెంటుకు దారితీసింది. నిఫ్టీ 23,644 (-62), సెన్సెక్స్ 77,986 (-218) వద్ద ట్రేడవుతున్నాయి. Oil & Gas మినహా అన్ని రంగాల షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. RIL, DRREDDY, ONGC, AXISBANK, BPCL టాప్ గెయినర్స్. TRENT టాప్ లూజర్.

News January 8, 2025

టాటా సుమో మళ్లీ వస్తోంది!

image

1990, 2000ల్లో విపరీతమైన ఆదరణ పొందిన టాటా సుమో మళ్లీ వచ్చే అవకాశముంది. ఈ సంవత్సరం టాటా మోటార్స్ ఈ వాహనాన్ని రీలాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని అలాగే ఉంచి ఆధునాతన ఫీచర్లతో ఈ SUVని రూపొందించనున్నట్లు సమాచారం. ధర రూ.10-15 లక్షలుగా నిర్ణయించే ఛాన్స్ ఉంది. కాగా టాటా సుమో తొలి మోడల్ 1994లో వచ్చింది.

News January 8, 2025

వారి ఎక్స్‌గ్రేషియా రూ.5లక్షలకు పెంపు

image

AP: ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారికి ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో రూ.4 లక్షలుగా ఉన్న పరిహారాన్ని రూ.5లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు చేనేత, చేతి వృత్తులు చేసుకునే వారు ముంపుబారిన పడితే ఇచ్చే సాయాన్ని రూ.10వేల నుంచి రూ.25వేలకు పెంచారు. అలాగే విపత్తుల వేళ నీట మునిగిన ద్విచక్రవాహనాలకు రూ.3వేలు, ఆటోలకు రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించింది.

News January 8, 2025

సీఎం ఒక ప్లేట్ భోజనం ఖర్చు ₹32,000: KTR

image

TG: నల్గొండలోని మహాత్మా గాంధీ వర్సిటీ కృష్ణవేణి హాస్టల్లో విద్యార్థులకు గొడ్డు కారం పెట్టారని వచ్చిన ఆరోపణలపై KTR స్పందించారు. ‘ముఖ్యమంత్రి ఒక ప్లేట్ భోజనం ఖర్చు ₹32,000 మాత్రమే. కానీ చదువుకునే పేద విద్యార్థులకు గొడ్డు కారం పెడతారు. వారెవ్వా ప్రజాపాలన. శభాష్ ఇందిరమ్మ రాజ్యం’ అని ట్వీట్ చేశారు. కాగా అల్పాహారంలో విద్యార్థినులకు గొడ్డు కారం పెట్టారని పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

News January 8, 2025

నేడు విశాఖకు మోదీ.. కట్టుదిట్టమైన భద్రత

image

AP: ప్రధాని మోదీ నేడు విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభ జరిగే ఆంధ్రా యూనివర్సిటీ పరిసరాలను SPG తమ ఆధీనంలోకి తీసుకుంది. 5వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. బందోబస్తు విధుల్లో 32 మంది IPS అధికారులు,18 మంది అడిషనల్ SPలు, 60 మంది DSPలు, 180 మంది CIలు, 400 మంది SIలు పాల్గొననున్నారు. ప్రధాని 3గంటల పాటు విశాఖలో పర్యటించనున్నారు.

News January 8, 2025

సీఎం చంద్రబాబుకు భద్రత పెంపు

image

AP: మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు భద్రత పెంచారు. స్పెషల్ సెక్యూరిటీ గ్రూపులో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో సీఎం భద్రతా వలయంలోకి కౌంటర్ యాక్షన్ బృందాన్ని జత చేశారు. సీఎంకు NSG, SSG, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా ఆరుగురు కమాండోలతో కౌంటర్ యాక్షన్ బృందం రక్షణ కల్పించనుంది. SPG ఆధ్వర్యంలో కౌంటర్ యాక్షన్ టీమ్‌కు శిక్షణ ఇస్తున్నారు.

News January 8, 2025

రాబోయే 5 రోజులు జాగ్రత్త!

image

TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాది జిల్లాల్లో పొగమంచు విపరీతంగా ఉంటోంది. రాబోయే 5 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని IMD తెలిపింది. సంగారెడ్డి, కొమురం భీమ్ జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు, HYD సహా ఇతర జిల్లాల్లో 7-9 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.

News January 8, 2025

విశాల్ ఆరోగ్యంపై నటి కుష్బూ క్లారిటీ

image

విశాల్ ఆరోగ్యంపై ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొన్న వేళ నటి కుష్బూ క్లారిటీ ఇచ్చారు. ‘11 ఏళ్ల తర్వాత తన ‘మదగజరాజు’ మూవీ రిలీజ్ అవుతుందని డెంగ్యూతో బాధపడుతున్నా విశాల్ ఈవెంట్‌కు వచ్చారు. 103డిగ్రీల టెంపరేచర్ కారణంగా వణికారు. ఈవెంట్ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లగా కోలుకుంటున్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. వ్యూస్ కోసం విశాల్ ఆరోగ్యంపై కొందరు తప్పుడు వార్తలు రాస్తున్నారు’ అని నటి అసహనం వ్యక్తం చేశారు.

News January 8, 2025

తిరుమల శ్రీవారి దర్శనానికి 8గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేనివారికి వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 8గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 62,566 మంది దర్శించుకోగా, 16,021 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.2కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. అటు, తిరుమల నుంచి మహాకుంభమేళా జరుగుతున్న యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు శ్రీవారి రథం బయల్దేరింది.