News March 20, 2024

పిఠాపురంలో జనసేనకు షాక్

image

AP: పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో జనసేన పార్టీకి గట్టి షాక్ తగలనుంది. జనసేన తరఫున 2019 ఎన్నికల్లో పోటీ చేసిన మాకినీడు శేషుకుమారి ఇవాళ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. గత కొంతకాలంగా జనసేనకు దూరంగా ఉంటున్న ఆమె.. వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని తాజాగా నిర్ణయించుకున్నారు. అయితే ఆమె వెళ్లినా తమకు ఇబ్బంది లేదని.. పవన్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని జనసైనికులు చెబుతున్నారు.

News March 20, 2024

ఘోర ప్రమాదం.. 14 మంది మృతి

image

ఉత్తర చైనాలోని ఓ ఎక్స్‌ప్రెస్ వే టన్నెల్‌లో బస్సు ప్రమాదానికి గురై 14 మంది ప్రాణాలు కోల్పోగా 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు అదుపు తప్పి టన్నెల్ గోడకు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా సమయంలో బస్సులో 51 మంది ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన ఈ ఘటనపై అధికారులు నేడు ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

News March 20, 2024

IPL: అత్యధిక సిక్సులు కొట్టింది ఎవరంటే?

image

ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధిక సిక్సులు (357) బాదిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రోహిత్ శర్మ (257), ఏబీ డివిలియర్స్ (251), ఎంఎస్ ధోనీ (239), విరాట్ కోహ్లీ (234) ఉన్నారు. ఇక ఎక్కువ మ్యాచులు ఆడిన ఆటగాళ్ల లిస్టులో ధోనీ (250) తొలి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత వరుసగా రోహిత్ (243), దినేశ్ కార్తీక్ (242), కోహ్లీ (237), జడేజా (226), ధవన్ (217), రైనా (205) ఉన్నారు.

News March 20, 2024

క్యాంపస్ సెలక్షన్లలో యువతుల జోరు!

image

క్యాంపస్ సెలక్షన్లలో గత ఏడాది వనితల హవా సాగినట్లు హైర్‌ప్రో సంస్థ వెల్లడించింది. సెలక్ట్ అయిన ప్రతీ ముగ్గురు అభ్యర్థుల్లో ఒక అమ్మాయి ఉందని తెలిపింది. 2023లో సంస్థలు ఎంపిక చేసిన ఫ్రెషర్లలో 40% మంది యువతులే ఉన్నట్లు పేర్కొంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 5% ఎక్కువ. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, రీసెర్చ్ & డెవలప్మెంట్ రంగాలకు సంబంధించిన నియామకాల్లో ఎక్కువ మంది మహిళలు పాల్గొన్నట్లు తెలిపింది.

News March 20, 2024

గ్రూప్-1 అభ్యర్థులకు BIG ALERT

image

AP: గ్రూప్-1 ప్రైమరీ కీపై APPSC అభ్యంతరాల స్వీకరణ గడువు రేపటితో ముగియనుంది. నిన్నటి నుంచి అధికారులు అబ్జెక్షన్స్ స్వీకరిస్తుండగా.. రేపు సాయంత్రంలోగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే పంపాలని సూచించారు. పోస్ట్, వాట్సాప్, SMS, ఫోన్ ద్వారా వచ్చే అభ్యంతరాలను స్వీకరించబోమని తెలిపారు. ప్రైమరీ <>కీలో <<>>మీకు ఎన్ని మార్కులు వచ్చాయో చెక్ చేసుకున్నారా?

News March 20, 2024

కారు.. లేదు ఆ జోరు, మార్చాలి గేరు..?

image

TG: ఓవైపు లోక్‌సభ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ రంగంలోకి దిగాయి. కానీ మళ్లీ చక్రం తిప్పుతామన్న ధీమాతో ఉన్న బీఆర్ఎస్ మాత్రం పత్తా లేదు. ఇప్పటికి 11మంది ఎంపీ అభ్యర్థుల్ని మాత్రమే గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. పలువురు అగ్రనేతలు పార్టీ వీడటం, ఇటు కవితను ఈడీ అరెస్టు చేయడం కారణాల వల్లో ఏమో కానీ.. కేసీఆర్ నుంచి క్షేత్రస్థాయి వరకు పార్టీలో జోరు కనిపించడం లేదు.

News March 20, 2024

కవిత పిటిషన్‌పై ఎల్లుండి సుప్రీంకోర్టులో విచారణ

image

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై ఎల్లుండి విచారణ జరగనుంది. తనను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందంటూ ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేశ్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన బెంచ్ దీనిపై విచారించనుంది. కవిత తన పిటిషన్‌లో ఈడీని ప్రతివాదిగా చేర్చారు.

News March 20, 2024

యువకులు సంతోషంగా ఉన్న దేశం ఇదే!

image

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్-2024 ప్రకారం లిథువేనియాలో అత్యంత సంతోషకరమైన యువకులు (30 ఏళ్లలోపు) ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత ఇజ్రాయెల్, సెర్బియా, ఐస్‌లాండ్, డెన్మార్క్ ఉన్నాయి. మొత్తం 143 దేశాల్లో భారత్ 27వ స్థానంలో నిలిచింది. అయితే, ప్రపంచంలోని సంతోషకరమైన దేశాల జాబితాలో ఇండియా 126వ ర్యాంకులో ఉంది.

News March 20, 2024

ఫోన్ మాట్లాడుతూ రైలెక్కితే.. జైలుకే

image

ఫోన్ చూస్తూ, మాట్లాడుతూ రైలు ఎక్కినా, దిగినా జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధిస్తామని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే రైల్వే ట్రాక్‌పై సెల్ఫీలు తీసుకున్నా జైలు శిక్ష తప్పదని చెబుతున్నారు. పట్టాల వెంబడి రీల్స్, షార్ట్ ఫిల్మ్‌లు, ప్రీ వెడ్డింగ్ షూట్‌లు, ఫొటోగ్రఫీలు తీసుకుంటే కటకటాల్లోకి వెళ్లాల్సిందేనని పేర్కొంటున్నారు. నిషేధ ఆజ్ఞలను పాటించాలని అధికారులు కోరుతున్నారు.

News March 20, 2024

ఏప్రిల్ 1 నుంచి టెన్త్ జవాబుపత్రాల వాల్యుయేషన్

image

AP: టెన్త్ జవాబుపత్రాల వాల్యుయేషన్ ఏప్రిల్ 1 నుంచి చేపట్టనున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఆ రోజు నుంచి ఎనిమిది రోజులపాటు నిరంతరాయంగా మూల్యాంకనం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. మంగళవారం జరిగిన రెండో భాష పరీక్షకు 97.05% మంది హాజరయ్యారు. ఈ నెల 30వ తేదీతో టెన్త్ పరీక్షలు ముగియనున్నాయి.