News June 6, 2024

బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

రీజినల్ రూరల్ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-A ఆఫీసర్స్(స్కేల్-1,2&3), గ్రూప్ ‘B’ ఆఫీస్ అసిస్టెంట్(మల్టీపర్పస్) పోస్టులకు కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్(CRP) ద్వారా నియామకాలు చేపట్టనుంది. రేపటి నుంచి ఈ నెల 27 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రిలిమ్స్ ఆగస్టు/సెప్టెంబర్‌లో నిర్వహించనుంది. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామనేది వెల్లడించలేదు. మరిన్ని వివరాలకు <>వెబ్‌సైట్‌<<>>ను సంప్రదించండి.

News June 6, 2024

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు: AAP

image

కాంగ్రెస్‌తో పొత్తు లోక్‌సభ ఎన్నికలకే పరిమితమని ఆప్ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి పూర్తి మద్దతు ఇచ్చామని తెలిపారు. ఢిల్లీలోని 7 సీట్లనూ కోల్పోవడంపై స్పందిస్తూ.. ‘మా టాప్ లీడర్లు జైలులో ఉన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో పోటీ చేసినప్పటికీ బీజేపీ నేతల మెజార్టీని భారీగా తగ్గించాం’ అని పేర్కొన్నారు.

News June 6, 2024

ఆంధ్ర టు మధ్యప్రదేశ్?

image

తెలుగు ప్లేయర్ హనుమ విహారి మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్‌ ఆడనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆంధ్ర క్రికెట్‌ సంఘం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) పొందిన అతడు ఆ రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌‌తో జరిపిన చర్చలు ఫలించినట్లు సమాచారం. ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్సీ నుంచి తనను అర్ధంతరంగా తప్పించడంపై అసంతృప్తి వ్యక్తంచేసిన విహారి.. ఆంధ్రకు మళ్లీ ఆడబోనంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.

News June 6, 2024

దోస్త్ ఫేజ్-1లో 76,290 సీట్లు కేటాయింపు

image

TG: డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి దోస్త్ ఫేజ్-1లో 76,290 మంది విద్యార్థులకు సీట్లను కేటాయించారు. అత్యధికంగా కామర్స్ గ్రూపుల్లో 28,655, లైఫ్ సైన్సెస్ గ్రూపుల్లో 15,301, ఫిజికల్ సైన్సెస్ గ్రూపుల్లో 14,964, ఆర్ట్స్ గ్రూపుల్లో 7,766, డేటా సైన్స్ గ్రూపుల్లో 2,502, డీఫార్మసీ గ్రూపుల్లో 90, ఇతర గ్రూపుల్లో 7,012 మంది విద్యార్థులు సీట్లు పొందారు. ఈ నెల 8 నుంచి ఫస్టియర్ క్లాసులు ప్రారంభమవుతాయి.

News June 6, 2024

ఏపీ సీఎం ముఖ్యకార్యదర్శిగా IAS రవిచంద్ర?

image

AP: కాబోయే సీఎం చంద్రబాబు ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ముద్దాడ రవిచంద్రను ప్రభుత్వం నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. CMOలో మరి కొందరు అధికారుల నియామకంపై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రుల పేషీల్లోని పీఎస్‌లు, OSDలు ఈ నెల 11లోగా మాతృశాఖల్లో రిపోర్టు చేయాలని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది. కాగా ఇప్పటికే ప్రభుత్వ సలహాదారులను <<13392587>>తొలగించిన<<>> విషయం తెలిసిందే.

News June 6, 2024

నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు: చంద్రబాబు

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి నుంచి ఢిల్లీ బయలుదేరారు. ఈ సందర్భంగా గుంటూరు, విజయవాడలో పోలీస్ ట్రాఫిక్ ఆంక్షలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ఆపొద్దంటూ ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీసులు ప్రజా సేవకులుగా మారాలని సూచించారు. కాగా రేపు ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల ఎంపీల భేటీలో ఆయన పాల్గొననున్నారు.

News June 6, 2024

మోదీ ప్రమాణం.. మాల్దీవులు అధ్యక్షుడికి ఆహ్వానం!

image

ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారానికి మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు ఆహ్వానం అందినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. అలాగే భారత్ పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, మారిషస్, నేపాల్ దేశాల టాప్ లీడర్లకు ఆహ్వానాలు వెళ్లాయి. కాగా, జూన్ 9న ఢిల్లీలో మోదీ మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణం చేయబోతున్నారు. కొన్ని నెలల క్రితం మోదీపై ముయిజ్జు తీవ్ర ఆరోపణలు చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.

News June 6, 2024

‘క్లీంకార’ పుట్టిన వేళా విశేషం..!

image

మెగా ప్రిన్సెస్ కొణిదెల క్లీంకార జన్మించాక మెగాస్టార్ ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతున్నాయని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. అమ్మవారి పేరుతో మెగా ఇంట అడుగుపెట్టిన క్లీంకార.. కుంభవృష్టిగా వరాలనిస్తోందని ప్రశంసిస్తున్నారు. ఆస్కార్ స్టేజీపై తండ్రిని నిలబెట్టిందని, తాతయ్య చిరుకి పద్మ విభూషణ్ అవార్డును తెచ్చిపెట్టిందంటున్నారు. ఇప్పుడు చిన్న తాత పవన్‌ని మంత్రిని చేస్తోందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News June 6, 2024

అందరికీ థాంక్స్.. చిత్తశుద్ధితో అడుగు ముందుకేస్తా: పవన్

image

AP: ఎన్నికల్లో జనసేన విజయాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ Xలో ధన్యవాదాలు తెలిపారు. ఈ గెలుపు తమ అందరిపై బాధ్యతను మరింత పెంచిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ముందడుగు వేస్తామని హామీ ఇచ్చారు.

News June 6, 2024

వరల్డ్ కప్‌లోనూ మ్యాక్స్‌వెల్‌ది అదే కథ!

image

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ టీ20 వరల్డ్ కప్‌లో విఫలమవుతున్నారు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎదుర్కొన్న మొదటి బంతికే క్యాచ్ ఔటై గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరారు. గత 10 టీ20ల్లో ఆయనకిది ఐదో డకౌట్ కావడం విశేషం. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా మ్యాక్సీ ఘోరంగా విఫలమయ్యారు. 10 మ్యాచ్‌లు ఆడి కేవలం 52 పరుగులే చేశారు. ఇందులో నాలుగు డకౌట్లు కూడా ఉన్నాయి.