News June 6, 2024

గెలిచిన అభ్యర్థుల జాబితాతో EC గెజిట్ నోటిఫికేషన్

image

AP: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితాతో కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నియోజకవర్గం, విజయం సాధించిన అభ్యర్థి, పార్టీ వివరాలను అందులో పొందుపర్చింది. కాగా సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం తర్వాత నూతన అసెంబ్లీ కొలువుదీరనుంది.

News June 6, 2024

EVMలపై అనుమానాలున్నాయి.. జగన్‌తో వైసీపీ నేతలు

image

AP: ఈవీఎంలపై అనుమానాలున్నాయని, పరిశీలన చేయాలని వైసీపీ నేతలు పార్టీ అధినేత జగన్‌కు సూచించారు. ఎన్నికల తీరుపై పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. కొందరు అధికారులు ఈసీతో కుమ్మక్కవ్వడంతోనే సీట్లు తగ్గాయని నేతలు ఆరోపించారు. మరోవైపు పార్టీ శ్రేణులకు అండగా నిలబడాలని జగన్ నేతలను ఆదేశించారు. ఈ నెల 10 నుంచి తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని YCP సెంట్రల్ ఆఫీసుగా మార్చాలని నిర్ణయించారు.

News June 6, 2024

మీరు మారారు సార్!

image

ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో ట్రోలింగ్‌కు గురైన హార్దిక్‌పై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో సూపర్ బౌలింగ్ (4-1-27-3) వేసిన అతడు మంచి లయ మీద కనిపించారు. వైవిధ్యమైన బంతులతో బ్యాటర్లను బెంబేలెత్తించారు. ఈ ప్రదర్శనతో ఐపీఎల్ సమయంలో ఎగతాళి చేసిన వారే ‘మీరు మారారు సార్’ అంటూ ప్రశంసిస్తున్నారు. హార్దిక్.. టోర్నీ మొత్తం ఇదే ఫామ్ కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదని పోస్టులు పెడుతున్నారు.

News June 6, 2024

BIG BREAKING: 40 మంది సలహాదారుల తొలగింపు

image

AP: ఏపీ ప్రభుత్వం 40 మంది సలహాదారులను తొలగించింది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే ఈ తొలగింపు ఆదేశాలు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. కాగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు 20 మంది సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేశారు. చేయని వారిని తొలగిస్తూ తాజాగా సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

News June 6, 2024

ఏకపక్షంగా మెజారిటీ ప్రకటించారు: రాకేశ్ రెడ్డి

image

TG: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్‌లో మూడో రౌండ్ మరోసారి లెక్కించాలని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక అభ్యర్థికి మేలు చేసే విధంగా కౌంటింగ్ జరుగుతోందని ఆరోపించారు. మూడో రౌండ్‌లో లెక్కలు తారుమారు చేశారని, రిటర్నింగ్ అధికారిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏకపక్షంగా మెజార్టీ ప్రకటించారని అన్నారు.

News June 6, 2024

ఎన్నికల కోడ్ ఎత్తివేత

image

దేశంలో ఎలక్షన్ కోడ్ ముగిసింది. ఈ ఏడాది మార్చి 16వ తేదీన అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని CEC ఎత్తివేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ముగియడంతో కోడ్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ కోడ్ తొలగినట్లయింది.

News June 6, 2024

TTD ఛైర్మన్‌గా నాగబాబు అని ప్రచారం.. స్పందించిన మెగా బ్రదర్

image

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఛైర్మన్‌గా జనసేన నేత నాగబాబును నియమిస్తారని వార్తలు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ ప్రచారాన్ని నాగబాబు ఖండించారు. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. పార్టీ లేదా తన నుంచి అధికారిక ప్రకటన వస్తేనే నమ్మాలని ట్వీట్ చేశారు.

News June 6, 2024

మోదీపై కాంగ్రెస్ సెటైరికల్ ట్వీట్

image

ప్రధాని మోదీపై కాంగ్రెస్ సెటైరికల్ పోస్ట్ చేసింది. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన టీడీపీ చీఫ్ చంద్రబాబు, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తమ డిమాండ్లతో మోదీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారనే అర్థం వచ్చేలా ఓ సెటైరికల్ ఫొటోను పోస్ట్ చేసింది. అందులో మోదీకి మనశ్శాంతి లేకుండా చంద్రబాబు, నితీశ్ ఆయన చేతులను లాగుతున్నట్లు ఉంది. కాగా ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 293, ఇండియాకు 234 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే.

News June 6, 2024

NDAతో కలిసే ప్రసక్తే లేదు: ఉద్ధవ్

image

తాము ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నామనే వార్తలు అవాస్తవమని శివసేన-యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ఎట్టి పరిస్థితిల్లోనూ ఎన్డీఏతో చేతులు కలపమని ఆయన స్పష్టం చేశారు. ఇండియా కూటమిలోనే కొనసాగుతామని తేల్చి చెప్పారు. కాగా మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన-యూబీటీ, ఎన్సీపీ-శరద్ కలిసి ఎన్నికల్లో పోటీ చేసి 30 సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ 13, శివసేన-యూబీటీ 9, ఎన్సీపీ-శరద్ 8 స్థానాల్లో గెలిచాయి.

News June 6, 2024

వైసీపీ కార్యాలయాన్ని మార్చాలని జగన్ నిర్ణయం

image

AP: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని వేరే చోటుకు మార్చాలని జగన్ నిర్ణయించారు. తాడేపల్లిలో తన నివాసం పక్కనున్న క్యాంప్ ఆఫీసును పార్టీ కార్యాలయంగా మార్చాలని సూచించారు. ఈ నెల 10 నుంచి కొత్త భవనంలో పార్టీ కార్యకలాపాలు జరపాలని జగన్ వైసీపీ ముఖ్య నేతలను ఆదేశించారు.