News June 6, 2024

CBN ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు

image

AP: అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఈ ఏర్పాట్లు పర్యవేక్షిస్తోంది. సినీ దర్శకుడు బోయపాటి శ్రీను ఆధ్వర్యంలో స్టేజీ ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. కాగా అధికారంలోకి వస్తే ప్రమాణస్వీకారం అమరావతిలోనే చేస్తానని చంద్రబాబు గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే.

News June 6, 2024

‘రానా నాయుడు’ సీజన్-2&3 ఫిక్స్!

image

కరణ్ అన్షుమాన్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’. అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ వెబ్ సిరీస్ నెక్స్ట్ సీజన్ గురించి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాగా, సీజన్ 2 &3లను నెట్‌ఫ్లిక్స్ కన్ఫర్మ్ చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వెంకీ ‘రానా నాయుడు’ సీజన్-2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

News June 6, 2024

ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ నేత ఆవేదన

image

లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాబోయే కాలమంతా తనకు గడ్డు కాలమేనని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరీ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో తప్ప ఇతర విషయాల్లో తనకు అవగాహన లేదని మీడియాతో చెప్పారు. కుటుంబ భవిష్యత్తు కోసం ఎలాంటి ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకోలేదని, కష్టాలను ఎలా అధిగమించాలో తెలియడం లేదన్నారు. కాగా బెంగాల్‌లోని బర్హంపూర్ నియోజకవర్గంలో టీఎంసీ నేత యూసుఫ్ పఠాన్ చేతిలో అధీర్ ఓడిపోయారు.

News June 6, 2024

టీ20 వరల్డ్ కప్‌లో 43 ఏళ్ల బౌలర్ సంచలనం

image

T20WCలో ఉగాండా బౌలర్ ఫ్రాంక్ ఎన్‌సుబుగా సంచలనం సృష్టించారు. 43 ఏళ్ల ఈ బౌలర్ పపువా న్యూగినియాతో మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ వేసి కేవలం 4 పరుగులే ఇచ్చారు. అందులో రెండు వికెట్లు, 20 డాట్ బాల్స్ ఉండటం విశేషం. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఇది అత్యుత్తమ ఎకానమీ (1.00). ఇదివరకు సౌతాఫ్రికా బౌలర్ బార్ట్‌మన్ పేరిట ఉన్న అత్యుత్తమ ఎకానమీ(2.25) రికార్డును ఫ్రాంక్ బద్దలు కొట్టారు. ఈ మ్యాచ్‌లో ఉగాండా గెలుపొందింది.

News June 6, 2024

మాకు ఆ ఆలోచన ఉంటే నువ్వు ఈ ట్వీట్ కూడా పెట్టేవాడివి కాదు: TDP

image

YCP కార్యకర్తలపై టీడీపీ దాడులు చేస్తోందన్న వైఎస్ జగన్ ట్వీట్‌పై టీడీపీ మండిపడింది. ‘నువ్వు మారవు.. నీ రాజకీయ బతుకే ఫేక్‌తో ముడిపడి ఉంది. దాడులు చేయాలనే ఆలోచనే మాకు ఉంటే నువ్వు ఈ ట్వీట్ కూడా పెట్టేవాడివి కాదు. మీ నేతలు రాష్ట్రాలు, దేశాలు దాటి పారిపోయేవారు కాదు. ఇప్పటికైనా నీ నీలి మందతో, నీలి వేషాలు వేయకుండా హుందాగా రాజకీయం చేయి. లేకపోతే ఆ పులివెందులను కూడా ప్రజలు మిగల్చరు’ అని రిప్లై ఇచ్చింది.

News June 6, 2024

వార్తల్లోకెక్కిన ప్రాంతాల్లో BJP ఓటమి

image

ఎన్నికలకు ముందు మణిపుర్, అయోధ్య, సందేశ్‌ఖాలీ యావత్ దేశం దృష్టిని ఆకర్షించాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం BJPకి మైలేజ్ ఇస్తుందని విశ్లేషణలూ వినిపించాయి. అయితే ఫలితం దానికి విరుద్ధంగా వచ్చింది. అయోధ్య ఉన్న ఫైజాబాద్‌ స్థానంలో BJPకి పరాభవం ఎదురైంది. బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో <<12759465>>బాధితులకు<<>> అండగా ఉంటామన్నా BJPని ప్రజలు విశ్వసించలేదు. తమను మోదీ విస్మరించారని <11204670>>మణిపుర్<<>> సైతం తిరస్కరించింది.

News June 6, 2024

ఎన్నికల నుంచి 6 జీవిత పాఠాలు: IFS అధికారి

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాల నుంచి ఆరు జీవిత పాఠాలు నేర్చుకోవచ్చని IFS అధికారి హిమాన్షు త్యాగీ ట్వీట్ చేశారు.
1.మీరు అత్యుత్తమంగా ఉన్నా నిరంతరం మెరుగుపరచుకోవాలి. 2.నియంత్రణలోని లేని అంశాలు ఉంటాయి. ఏం చేసినా కాలగమనాన్ని మార్చలేరు. 3.ఓడిపోయామని ప్రయత్నాన్ని వదలొద్దు. 4.కొన్ని సార్లు అకారణంగా, అనూహ్యంగా ఓటమి రావొచ్చు. 5.కఠిన సమయాల్లో ఇతరుల సాయంతో పోరాడాలి. 6.కాలానికి తగినట్లుగా మీ వ్యూహాలను మార్చుకోవాలి.

News June 6, 2024

షర్మిల కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టించారు: సుంకర పద్మశ్రీ

image

AP: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భ్రష్టు పట్టించారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ఆరోపించారు. ‘పార్టీ నుంచి వచ్చిన ఫండ్స్ దాచుకున్నారు. పార్టీ అభ్యర్థులకు కనీసం జెండాలు కూడా అందించలేదు. కార్యకర్తలను, నేతలను ఆమె గాలికొదిలేశారు. రాహుల్ గాంధీని చూసి ఆమెను ఏమనలేకపోయాం. కక్షపూరిత చర్యల కోసమే ఆమె రాష్ట్రానికి వచ్చినట్లు కనిపిస్తోంది’ అని మండిపడ్డారు.

News June 6, 2024

అప్పుడు ఆమంచి.. ఇప్పుడు కరణం

image

AP: చీరాలలో 2019లో జరిగిన సీన్ 2024లో రిపీట్ అయింది. ఇద్దరు నేతలు పార్టీ మారి ఓడిపోయారు. 2014లో ఇండిపెండెంట్‌గా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ ఆ తర్వాత TDPలో చేరిపోయారు. 2019 నాటికి TDPపై తీవ్ర విమర్శలు చేస్తూ YCP గూటికి చేరారు. ఆ ఎన్నికల్లో ఆమంచి ఓడిపోగా.. TDP నేత కరణం బలరాం గెలిచారు. ఆ తర్వాత తొలి నుంచి TDPకి అండగా ఉన్న బలరాం కూడా YCPకి మారారు. ఇప్పుడు ఆయన కుమారుడు వెంకటేశ్‌కూ చీరాలలో ఓటమి తప్పలేదు.

News June 6, 2024

ఛత్రపతి శివాజీ పట్టాభిషేకానికి 350 ఏళ్లు

image

ఛత్రపతిగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లేకి 1674 జూన్ 6న రాయగఢ్ కోటలో పట్టాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా మరాఠా సామ్రాజ్యానికి రాజుగా శివాజీ పట్టాభిషేకం జరిగింది ఈరోజేనంటూ ఆయన ఫాలోవర్స్ Xలో పోస్టులు పెడుతున్నారు. శివాజీ లౌకిక పాలకుడని, అన్ని మతాలకు అనుకూలంగా ఉండి, ప్రజలందరినీ సమానంగా చూసుకునేవారని గుర్తుచేసుకుంటున్నారు.