News June 5, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జూన్ 5, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4:20 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:41 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:15 గంటలకు
అసర్: సాయంత్రం 4:50 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:49 గంటలకు
ఇష: రాత్రి 8.10 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News June 5, 2024

శుభ ముహూర్తం

image

తేది: జూన్ 5, బుధవారం
బ.చతుర్దశి: రాత్రి 07.55 గంటలకు
కృత్తిక: రాత్రి 09:16 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం గం.11:40 నుంచి 12:31 వరకు
వర్జ్యం: ఉదయం గం.09.55 నుంచి 11.26 వరకు

News June 5, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 5, 2024

ఏపీలో పార్లమెంట్ ఎన్నికల తుది ఫలితం

image

ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో తుది ఫలితం వెలువడింది. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీడీపీ:16, వైసీపీ: 4, బీజేపీ: 3, జనసేన: 2 సీట్లను కైవసం చేసుకున్నాయి. గత ఎన్నికల్లో 22 సీట్లు గెలుచుకున్న వైసీపీ ఈసారి కూటమి సునామీలో తేలిపోయింది. కడప, రాజంపేట, తిరుపతి, అరకు లోక్‌సభ నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీ గెలుపొందింది.

News June 5, 2024

EVM లెక్కింపులో ఒక్క ఓటుతో గెలుపు.. పోస్టల్ బ్యాలెట్‌లో తారుమారు!

image

మహారాష్ట్రలోని ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన శివసేన అభ్యర్థి రవీంద్ర దత్తారం కేవలం 48 ఓట్లతో గెలుపొందారు. EVM ఓట్ల లెక్కింపు తర్వాత శివసేన అభ్యర్థి అమోల్ గజానన్ కీర్తికర్ కేవలం ఒక్క ఓటు ఆధిక్యంలో ఉన్నారు. అయితే, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన తర్వాత దత్తారం 48 ఓట్లు ఆధిక్యం సాధించి ఎంపీగా విజయం సాధించారు.

News June 4, 2024

మెజార్టీలో తండ్రిని మించిన తనయుడు

image

AP: గత ఎన్నికల్లో ఓటమి పాలైన నారా లోకేశ్ ఈసారి భారీ విజయం సాధించారు. తన తండ్రి చంద్రబాబు మెజార్టీని తలదన్నేలా.. ఏకంగా 90,160 మెజార్టీతో రికార్డు సృష్టించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. CBNకి 47,340 ఓట్ల మెజార్టీ దక్కింది. కుప్పంలో 1989లో CBN తొలిసారి గెలిచినప్పుడు అత్యధికంగా 71,607 మెజార్టీ సాధించారు. ఆ తర్వాత నుంచి మెజార్టీ తగ్గుతూ వస్తోంది. 2009 నుంచి ఆయన మెజార్టీ 45వేల మార్కు దగ్గరే ఉంటోంది.

News June 4, 2024

‘వై నాట్ 175’.. ఇప్పుడు 11

image

‘వై నాట్ 175’.. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే వైసీపీ అధినేత జగన్ ఈ స్లోగన్ అందుకున్నారు. 2019లో 151 సీట్లు గెలిచామని.. ఈసారి కుప్పంతో సహా రాష్ట్రంలోని 175కి 175 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కానీ రియాలిటీ జగన్ అంచనాలకు చాలా భిన్నంగా ఉంది. మొత్తం 175 సీట్లలో వైసీపీ కేవలం 11 స్థానాల్లోనే గెలిచింది. జగన్ ఆశించిన దాని కంటే ఫ్యాన్ పార్టీకి 164 సీట్లు తక్కువగా వచ్చాయి.

News June 4, 2024

నెల్లూరులో విజయసాయి రెడ్డి ఓటమి

image

AP: నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిపై 2,45,902 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. వేమిరెడ్డికి 7,66,202 ఓట్లు పోల్ కాగా.. విజయసాయికి 5,20,300 ఓట్లు పోల్ అయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి కొప్పుల రాజుకు 54,844 ఓట్లు పడ్డాయి.

News June 4, 2024

రేపు ఢిల్లీకి బాబు, పవన్!

image

AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయనతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా హస్తిన వెళ్లే అవకాశం ఉంది. వీరు బీజేపీ నిర్వహించే ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరవుతారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీల మద్దతును బీజేపీ కూడగట్టనుంది. అటు సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు.

News June 4, 2024

భేష్ పోలీస్!

image

పోలింగ్ రోజు, అనంతర గొడవలతో APలో కౌంటింగ్ రోజు ఎక్కడ ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. కానీ పోలీసులు కౌంటింగ్‌కు పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు. కేంద్ర బలగాలు, రిజర్వు పోలీసులూ వారం ముందే బందోబస్తుకు వెళ్లి అనేక చోట్ల మాక్ డ్రిల్స్, మార్చ్‌లతో తమ సామర్థ్యాలపై అవగాహన కల్పించారు. దీంతో ఘర్షణల ఆలోచన ఉన్నవారికి గట్టి మెసేజ్ వెళ్లింది. ఇది నేడు రచ్చ లేని క్లియర్ పిక్చర్ ఇచ్చింది. శభాష్ AP పోలీస్!