News December 18, 2024

IND vs AUS మ్యాచ్ డ్రా

image

బ్రిస్బేన్‌లో జరుగుతున్న IND vs AUS 3వ టెస్ట్ డ్రా అయింది. 5వ రోజు 2వ ఇన్నింగ్స్‌లో AUS 89-7 వద్ద డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లీడ్‌తో కలిపి భారత్ ముందు 275పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. IND బ్యాటింగ్ ప్రారంభమైన కాసేపటికి 8/0 వర్షం ప్రారంభమైంది. వర్షం తీవ్రత పెరగడం, బ్యాడ్ లైట్ కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. BGT 5టెస్టుల సిరీస్‌లో 1-1తో ఇరు జట్లు సమానంగా నిలిచాయి.

News December 18, 2024

త్వరలో ఫీజు బకాయిలు చెల్లిస్తాం: భట్టి

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బకాయిలపై ఇంజినీరింగ్, టెక్నికల్ కాలేజీల యజమానులు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తున్నామని, అసెంబ్లీ సమావేశాల తర్వాత దశల వారీగా చెల్లిస్తామన్నారు. ఉన్నత విద్యాసంస్థలు మనుగడ సాగించాలంటే బకాయిలు ఉండకూడదని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

News December 18, 2024

నిలిచిపోయిన TDP అధికారిక యూట్యూబ్ ఛానల్

image

AP: TDP అధికారిక యూట్యూబ్ ఛానల్ సేవలు నిలిచిపోయాయి. దీంతో పార్టీ వర్గాలు యూట్యూబ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాయి. ఉదయం నుంచి ఛానల్ ఆగిపోగా, ఓపెన్ చేసిన వారికి బ్లాక్ అయినట్లు మెసేజ్ వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో టీడీపీ టెక్నికల్ వింగ్ రంగంలోకి దిగింది. కాగా ఛానల్ హ్యాక్ అయిందా? లేక యూట్యూబ్ బ్లాక్ చేసిందా? అనేది తెలియాల్సి ఉంది.

News December 18, 2024

Good News: క్యాన్సర్ వ్యాక్సిన్ తయారుచేసిన రష్యా

image

క్యాన్సర్ బాధితులకు గుడ్‌న్యూస్. ఈ వ్యాధికి తాము సొంతంగా వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసినట్టు రష్యా ప్రకటించింది. ‘రష్యా సొంతంగా mRNA క్యాన్సర్ వ్యాక్సిన్ డెవలప్ చేసింది. పేషంట్లకు వీటిని ఫ్రీగా ఇవ్వనుంది. కణతి వృద్ధిని, దాని సమీపంలో మరో కణతి రాకుండా ఇది అణచివేస్తున్నట్టు ప్రీ క్లినికల్ ట్రయల్స్‌లో నిరూపితమైంది’ అని TASS తెలిపింది. 2025లో ఇది మార్కెట్లోకి వస్తుందని సమాచారం.

News December 18, 2024

శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం

image

TG: అసెంబ్లీలో BRS సభ్యుల తీరుపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. MLA వివేకానందకు నిబంధనలపై అవగాహన ఉందని, ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ముందు ఆలోచించాలని.. స్పీకర్‌కు ముందుగానే సమాచారం ఇవ్వాలని చెప్పారు. పదేళ్ల BRS పాలనలో ఆటో డ్రైవర్లకు ఏమీ చేయలేదని విమర్శించారు. ఆటో రిక్షాల పన్నులు పెంచారని, కొత్త వాటికి అనుమతులు ఇవ్వలేదని విమర్శించారు. వివేకానంద ఆరోపణలను వెనక్కి తీసుకోవాలన్నారు.

News December 18, 2024

ఉపవాసం చేసేవారికి వైద్యుల సూచనలు

image

చాలా మంది వారంలో రెండు, మూడు రోజులు ఉపవాసాలు ఉంటుంటారు. అలాంటి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు సూచించారు. వీరు 5:2 రూల్ పాటించాలంటున్నారు. అంటే వారంలో వరుసగా కాకుండా ఏవైనా 2 రోజులు ఫాస్టింగ్ ఉండొచ్చు. ఉపవాస సమయంలో 16-18 గంటలు ఏం తినకూడదు. ఆకలేస్తే బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, నిమ్మకాయ నీరు (చక్కెర లేకుండా), నీరు తాగాలి. టీ/కాఫీలో పాలు& చక్కెర వాడొద్దు. గరిష్ఠంగా 500 క్యాలరీలు తీసుకోవడం మంచిది.

News December 18, 2024

కిమ్ రాజ్యంలో డిప్లమాటిక్ ఆపరేషన్స్‌కు భారత్ సై

image

ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాలను భారత్ మళ్లీ పూర్తిస్థాయికి తీసుకెళ్తోంది. కొవిడ్ టైమ్‌లో మూసేసిన ఎంబసీని మళ్లీ తెరిచింది. అధికారులను అక్కడికి పంపించింది. కిమ్‌తో ఎలా ఉంటుందో తెలుసు కాబట్టే ముందుగా ఆఫీస్ మొత్తాన్ని జల్లెడ పట్టనుంది. నిఘాకు తావులేకుండా ఏర్పాట్లు చేయనుంది. మిసైళ్లు, న్యూక్లియర్ టెక్నాలజీలో కిమ్ రాజ్యం వృద్ధి సాధిస్తోంది. దీనిని పాక్‌కు చేరకుండా పావులు కదపడమే భారత్ టార్గెటని సమాచారం.

News December 18, 2024

ఆటో కార్మికులు ధైర్యాన్ని కోల్పోవద్దు: కేటీఆర్

image

TG: హామీ మేరకు ప్రభుత్వం ఆటో కార్మికులకు అండగా నిలవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 93 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఆటో కార్మికులు ధైర్యాన్ని కోల్పోవద్దని, BRS అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామన్నారు. అటు, శాసనసభలో BRS వాయిదా తీర్మానం ప్రతిపాదించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఖాకీ దుస్తులు ధరించి ఆటోల్లో శాసనసభకు చేరుకున్నారు.

News December 18, 2024

డింగా.. డింగా: ప్రజల్ని వణికిస్తున్న కొత్త రోగం!

image

ఉగాండాలో కొత్త రోగం పుట్టుకొచ్చింది. పేరు డింగా డింగా. అంటే డాన్స్ చేస్తున్నట్టు వణికిపోవడమని అర్థం. కొన్నిరోజులుగా వేధిస్తున్న ఈ వ్యాధితో అక్కడి ప్రభుత్వం తలపట్టుకుంది. ఎందువల్ల వస్తుందో, ఏ మందులు వాడాలో తెలియదు. 300+ కేసులు నమోదవ్వడంతో ప్రజలు భయపడుతున్నారు. రోగం వచ్చిందంటే చాలు నియంత్రణ లేకుండా ఒళ్లు ఊగిపోతుంది. జ్వరం, వీక్‌నెస్, పక్షవాతం వచ్చిన ఫీలింగ్ దీని లక్షణాలు. కొందరు నడవలేకపోతున్నారు.

News December 18, 2024

మొబీక్విక్ జాక్‌పాట్: 58% ప్రీమియంతో లిస్టైన షేర్లు

image

ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొబీక్విక్, విశాల్ మెగామార్ట్ షేర్లు NSE, BSEల్లో లిస్ట్ అయ్యాయి. IPO ధర రూ.279తో వచ్చిన మొబీక్విక్ షేర్లు BSEలో రూ.58.5% ప్రీమియంతో రూ.442, NSEలో 57.7% ప్రీమియంతో రూ.440 వద్ద నమోదయ్యాయి. ప్రస్తుతం రూ.72 లాభంతో రూ.512 వద్ద ట్రేడవుతున్నాయి. రూ.78 IPO ధరతో వచ్చిన విశాల్ షేర్లు NSEలో రూ.104 వద్ద లిస్టయ్యాయి. ఇప్పుడు 2.46% లాభంతో రూ.106 వద్ద చలిస్తున్నాయి.