News June 4, 2024

కూటమికే పట్టంగట్టిన విశాఖ వాసులు

image

విశాఖ నగరంలో కూటమి హవా కొనసాగింది. విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణబాబు(TDP), విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ యాదవ్‌(JSP), విశాఖ వెస్ట్ నుంచి పీజీవీఆర్‌ నాయుడు (TDP), గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు (TDP) విజయం సాధించారు. భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు (TDP), విశాఖ నార్త్ నుంచి పి. విష్ణు కుమార్‌ రాజు (BJP) ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు విశాఖ స్థానంలో TDP అభ్యర్థి భరత్ భారీ ఆధిక్యంలో ఉన్నారు.

News June 4, 2024

విజయం దిశగా కర్ణాటక మాజీ సీఎం బొమ్మై!

image

కర్ణాటక మాజీ సీఎం, హవేరి బీజేపీ అభ్యర్థి బసవరాజు బొమ్మై 41,600 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి 94,822 (ధార్వాడ్), శోభా కరంద్లాజే (బెంగళూరు నార్త్) 2.25 లక్షల ఓట్ల లీడింగ్‌లో కొనసాగుతున్నారు. యడియూరప్ప కుమారుడు రాఘవేంద్ర (శివమొగ్గ) 2.37లక్షలు, తేజస్వి సూర్య (బెంగళూరు సౌత్) 2.46 లక్షల ఓట్లతో ముందంజలో ఉన్నారు.

News June 4, 2024

ఆదిలాబాద్‌లో BJP గెలుపు

image

ఆదిలాబాద్‌ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి G.నగేశ్ విజయం సాధించారు. ఆయన 78వేల ఓట్లకు పైగా మెజారిటీ సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు ఉన్నారు.

News June 4, 2024

మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ గెలుపు

image

మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. ఆమె 6వేలకు పైగా మెజారిటీ సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి చల్లా వంశీచంద్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేశారు.

News June 4, 2024

రాజకీయ చాణక్యుడు చంద్రబాబు

image

అపర చాణక్యుడిగా పేరొందిన చంద్రబాబు రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 28 ఏళ్ల వయసులో కాంగ్రెస్ తరఫున MLAగా గెలిచి మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. తదనంతరం TDPలో చేరి 1984, 94 సంక్షోభ సమయంలో కీలకంగా వ్యవహరించారు. 1995లో సీఎంగా బాధ్యతలు చేపట్టి 2004 వరకు కొనసాగారు. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ తొలి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజా ఎన్నికల్లో గెలుపుతో 4వసారి CMగా బాధ్యతలు చేపట్టనున్నారు.

News June 4, 2024

కూటమి సునామీలో కొట్టుకుపోయిన ‘వైసీపీ వారసులు’

image

AP: అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నేతల వారసులు ఓటమిపాలయ్యారు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన వీరు కూటమి సునామీలో కొట్టుకుపోయారు. తిరుపతిలో భూమన కుమారుడు అభినయ్‌రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డి, బందర్‌లో పేర్నినాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి, జీడీ నెల్లూరులో నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి పరాజయం చవిచూశారు. ఎక్కువ మంది మంత్రులు కూడా ఓటమి అంచున ఉన్నారు.

News June 4, 2024

కడపలో 25 ఏళ్ల తర్వాత టీడీపీ విజయం

image

AP: కడప అసెంబ్లీ స్థానంలో టీడీపీ దాదాపు 25 ఏళ్ల తర్వాత గెలిచింది. చివరిసారిగా 1999లో ఖలీల్ బాషా విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 09లో అహ్మదుల్లా(కాంగ్రెస్), 2014, 2019లో అంజాద్ బాషా(వైసీపీ) గెలిచారు. అలాగే ఒక ముస్లిమేతర వ్యక్తి అక్కడ గెలవడం 35 ఏళ్లలో ఇదే తొలిసారి. 1989లో శివానందరెడ్డి(INC) గెలవగా, ఇప్పుడు మాధవీరెడ్డి(టీడీపీ) సంచలన విజయం సాధించారు.

News June 4, 2024

PEDDIREDDY: ఒకే ఒక్కడు!

image

AP: ఎన్డీయే కూటమి గాలిలో వైసీపీ మంత్రులందరూ ఓటమి పాలయ్యారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం గెలుపొందారు. పుంగనూరు నుంచి ఆయన మరోసారి విజయం సాధించారు. కాగా పుంగనూరులో పెద్దిరెడ్డి బలమైన కేడర్ ఉండటం వల్ల ఇంత గాలిలోనూ ఆయన గెలిచి నిలిచారు. తన సహచర మంత్రులందరూ ఓటమి ఎదుర్కొన్నా తాను మాత్రం విజయం సాధించారు.

News June 4, 2024

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఓటమి

image

లోక్‌సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓడిపోయారు. అమేథీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ చేతిలో ఆమె లక్ష ఓట్ల పైచిలుకు తేడాతో పరాజయం పాలయ్యారు.

News June 4, 2024

టార్గెట్ PM పీఠం.. వ్యూహాలు రచిస్తున్న NDA, INDIA

image

హస్తినలో రాజకీయం పీక్స్‌కు చేరింది. ఒకవైపు జేపీ నడ్డా నివాసంలో కేంద్రమంత్రులు భేటీ కాగా.. మరోవైపు ఖర్గే ఇంట్లో కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. ఫలితాల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుండటంతో అధికారం చేపట్టేందుకు ఇరు వర్గాలు వ్యూహాలు రచిస్తున్నాయి. కాసేపట్లో రెండు కూటములు గెలిచే స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.