News June 4, 2024

చెదిరిన ‘400’ కల: సెన్సెక్స్ 4100 పాయింట్ల పతనం

image

‘ఆబ్కీ బార్ 400పార్’ కల చెదరడంతో స్టాక్ మార్కెట్లు రక్తమోడుతున్నాయి. దాంతో సూచీలు ఈ దశాబ్దంలోనే అతి ఘోర పతనం చవిచూస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 4100 పాయింట్ల మేర కుంగింది. ప్రస్తుతం 3283 పాయింట్ల నష్టంతో 73,191, నిఫ్టీ 1063 తగ్గి 22,200 వద్ద ఉన్నాయి. ఇన్వెస్టర్లు పానిక్ సెల్లింగుకు పాల్పడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలతో మార్కెట్ ఎంత పెరిగిందో రిజల్టుతో అంతకన్నా ఎక్కువే పడింది.

News June 4, 2024

ఖమ్మంలో 2 లక్షలు దాటిన ఆధిక్యం

image

TG: ఖమ్మంలో కాంగ్రెస్ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. 16వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి 2.16లక్షల ఓట్ల ఆధిక్యం సాధించారు. దీంతో గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.

News June 4, 2024

BIG BREAKING: 50వేలకు పైగా మెజారిటీతో టీడీపీకి తొలి గెలుపు!

image

ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఖాతా తెరిచింది. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. 50వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచినట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్డీయే కూటమి 160 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.

News June 4, 2024

పోటీ చేసిన స్థానాలు.. ఆధిక్యాలు..

image

AP: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి దిశగా వైసీపీ సాగుతోంది. మొత్తం 175 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం 22 చోట్ల ఆధిక్యంలో ఉంది. టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో 126 చోట్ల, జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 18 చోట్ల, బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 7 చోట్ల లీడింగులో ఉన్నాయి.

News June 4, 2024

హైదరాబాద్‌లోనూ గెలుస్తున్నాం: మాధవీలత

image

హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి మాధవీ లత ధీమా వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ 400లకు పైగా సీట్లు సాధిస్తుందని ఆమె అన్నారు. గత పదేళ్లలో మోదీ అద్భుతంగా పని చేశారని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఆ స్థానంలో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

2 చోట్ల పోటీ.. కేఏ పాల్‌కు ఎన్ని ఓట్లంటే?

image

AP: ‘పాల్ రావాలి-పాలన మారాలి’ అనే నినాదంతో ప్రచారం చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను ఓటర్లు పట్టించుకోలేదు. కుండ గుర్తుకు ఓటేయాలని 2 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆయనకు ఆశించిన ఓట్లు పడలేదు. గాజువాక MLA అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు ఇప్పటివరకు 394 ఓట్లు రాగా, విశాఖ MP అభ్యర్థిగా నిలిచిన పాల్‌కు 1190 ఓట్లు లభించాయి. దీంతో పాల్ కుండ పగిలిందని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

News June 4, 2024

దర్శిలో ఆధిక్యంలోకి వచ్చిన టీడీపీ అభ్యర్థి

image

AP: దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీ ఆధిక్యంలోకి వచ్చారు. 75 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో ఆమె ఉన్నారు. వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వెనుకంజలో కొనసాగుతున్నారు. కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుమాటి కావ్య కృష్ణారెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు.

News June 4, 2024

పురందీశ్వరికి లక్ష దాటిన మెజార్టీ

image

AP: రాజమండ్రి ఎంపీ స్థానంలో పురందీశ్వరి లక్ష ఓట్ల మెజార్టీని దాటారు. ప్రస్తుతం 1,15,566 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అనకాపల్లిలో సీఎం రమేశ్(BJP) 32 వేలు, నర్సాపురంలో శ్రీనివాసవర్మ(BJP) 58 వేల ఓట్ల లీడింగులో ఉన్నారు. ఇక కాకినాడలో జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్‌కు 32,241, మచిలీపట్నంలో బాలశౌరి(జనసేన) 25,364 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

శశిథరూర్‌ వెనుకంజ

image

కాంగ్రెస్ సీనియర్ నేత, సిట్టింగ్ ఎంపీ శశిథరూర్ తిరువనంతపురంలో విజయం కోసం చెమటోడుస్తున్నారు. ఆయనపై కేంద్రమంత్రి, బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ 4,948 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తిరువనంతపురంలో శశిథరూర్ మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఆయన 99,989 ఓట్లతో ఘన విజయం సాధించారు.

News June 4, 2024

ఉత్తరాంధ్రలో కూటమి సునామీ

image

ఉత్తరాంధ్రలో NDA కూటమి దూసుకెళ్తోంది. మొత్తం 34 అసెంబ్లీ స్థానాలకుగాను 30 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కేవలం నాలుగు స్థానాల్లోనే వైసీపీ ఆధిక్యంలో ఉంది. 2019 ఎన్నికల్లో 34 స్థానాలకుగాను 28 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ.. ఈసారి ఘోరంగా వెనుకబడింది. కేవలం పాడేరు, అరకు, సాలూరు, పాలకొండలో మాత్రమే వైసీపీ ఆధిక్యంలో ఉంది. అటు MP స్థానాల్లో అరకులో మాత్రమే YCP ఆధిక్యంలో ఉంది.