News June 4, 2024

యర్రగొండపాలెంలో టీడీపీ ముందంజ

image

AP: యర్రగొండపాలెం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు ముందంజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ వెనుకంజలో ఉన్నారు. పర్చూరులో ఏలూరి సాంబశివరావు లీడింగ్‌లో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి యడం బాలాజీ వెనుకంజలో ఉన్నారు.

News June 4, 2024

ఆధిక్యంలోకి వచ్చిన మోదీ

image

యూపీ వారణాసిలో బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోదీ ఆధిక్యంలోకి వచ్చారు. తొలుత 6వేలకు పైగా ఓట్లతో వెనుకబడ్డ మోదీ.. ఇప్పుడు ఆధిక్యంలోకి వచ్చారు. అక్కడ కాంగ్రెస్ నుంచి అజయ్ పోటీ చేస్తున్నారు.

News June 4, 2024

కడప అసెంబ్లీ: టీడీపీకి 10వేల ఓట్ల లీడింగ్

image

కడప అసెంబ్లీలో 10వేల ఓట్ల మెజార్టీలో టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి కొనసాగుతున్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఓటమి దిశగా సాగుతున్నారు. ప్రొద్దుటూరు, రాయచోటిలో టీడీపీ అభ్యర్థులు వరదరాజులరెడ్డి, రాంప్రసాద్ రెడ్డి లీడింగులోకి వచ్చారు.

News June 4, 2024

ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న కూటమి జోరు

image

AP: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఉత్తరాంధ్రలో కూటమి జోరు కొనసాగుతోంది. గాజువాక, విశాఖ తూర్పు, విజయనగరం, ఎచ్చెర్ల, పాతపట్నం, బొబ్బిలి, రాజాం, చీపురుపల్లిలో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు అనకాపల్లి, విజయనగరం, విశాఖ లోక్‌సభ ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుండటం.. ఆయా పార్టీల శ్రేణుల్లో జోష్ నింపింది.

News June 4, 2024

మళ్లీ ‘ఇతరులు’కు గిరాకీ

image

ప్రస్తుత ఓట్ల లెక్కింపును బట్టి ‘ఇతరులు’ కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. గత రెండు దఫాల్లో థంపింగ్ మెజార్టీ రావడంతో బీజేపీకి వారితో అవసరం పడలేదు. ఉదయం 10 గంటలకు ఏఐఏడీఎంకే 5, ఎంఐఎం 2, బీఎస్పీ 2, బీజేడీ ఒక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇండియా, ఎన్డీయే కూటములకు స్పష్టమైన మెజార్టీ రాకపోతే వీరికి గిరాకీ భారీగా పెరుగుతుంది. మాయావతి, పళనిస్వామి, అసదుద్దీన్ ఒవైసీకి ప్రాధాన్యం ఇవ్వక తప్పదు.

News June 4, 2024

కాకినాడ లోక్‌సభలో జనసేన లీడింగ్

image

AP: కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ కుమార్ ముందంజలో కొనసాగుతున్నారు. తన ప్రత్యర్థి చలమలశెట్టి సునీల్ కుమార్‌పై 3,400 ఓట్ల లీడ్‌తో కొనసాగుతున్నారు. రంపచోడవరంలో వైసీపీ అభ్యర్థి ధనలక్ష్మీ వెనుకంజలో ఉన్నారు. అనపర్తిలో బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 114 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.

News June 4, 2024

ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఆధిక్యంలో ఉన్నది వీరే!

image

AP: ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో టీడీపీ ఆధిక్యత కనబరుస్తోంది. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థులు కందుకూరులో ఇంటూరి, ఒంగోలులో దామచర్ల, కొండపిలో స్వామి, నెల్లూరు సిటీలో నారాయణ, ఉదయగిరిలో కాకర్ల సురేశ్ ముందంజలో కొనసాగుతున్నారు. అలాగే వైసీపీ అభ్యర్థులు దర్శిలో బూచేపల్లి, సర్వేపల్లిలో కాకాణి లీడింగ్‌లో ఉన్నారు.

News June 4, 2024

BREAKING: ఖాతా తెరిచిన BRS

image

మెదక్‌ పార్లమెంట్ స్థానంలో బీఆర్‌ఎస్ ఆధిక్యం సాధించింది. ఆ పార్టీ నుంచి పి.వెంకట్రామిరెడ్డి ముందంజలో ఉన్నారు. తొలుత వెనుకంజలో ఉన్నా ఆ తర్వాత లీడ్‌లోకి వచ్చారు.

News June 4, 2024

మంత్రులకు షాక్.. అందరూ వెనుకంజే

image

ఏపీలో కూటమి సునామీ సృష్టిస్తోంది. దాదాపు అందరు మంత్రులు వెనుకంజలో ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు వైసీపీ మంత్రులు, సీనియర్లకు షాక్ ఇస్తున్నారు. అటు పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ కూటమి హవా కొనసాగుతోంది. పలువురు వైసీపీ అభ్యర్థులు ఇప్పుడే కౌంటింగ్ కేంద్రాల నుంచి వెనుదిరుగుతున్నారు.

News June 4, 2024

కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ ముందంజ

image

కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేశ్ 855 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత వెనుకంజలో ఉన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్య నందిత మరణంతో ఉప ఎన్నిక జరిగింది.