India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రిపబ్లిక్ డే నాటి నుంచి ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయడానికి అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పెళ్లి, విడాకులు, వారసత్వం విషయాల్లో అన్ని మతాలకు ఉమ్మడి చట్టం అమలు కోసమే UCC తెస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న జంటలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు సాక్షుల వీడియోలను రికార్డు చేయాల్సి ఉంటుంది. కామన్ పోర్టల్ ఉంటుంది.
మహా కుంభమేళాలో విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన NCP(SP) నేత, షోలాపూర్ మాజీ మేయర్ మహేశ్ కొతె గుండెపోటుతో మరణించారు. ఇవాళ ఉదయం త్రివేణి సంగమం వద్ద నదిలో పవిత్ర స్నానం చేసేందుకు వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుకు గురయ్యారు. గమనించి తోటి భక్తులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మహేశ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
హరియాణా BJP చీఫ్ మోహన్ లాల్ బడోలీపై హిమాచల్ పోలీసులు సామూహిక అత్యాచారం కేసు నమోదు చేశారు. HPలోని కసౌలిలో ఉన్న హోటల్‌లో July 3, 2023న మోహన్ లాల్, సింగర్ రాఖీ మిట్టల్ తనపై అత్యాచారం చేశారని ఢిల్లీకి చెందిన బాధితురాలు ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని, మ్యూజిక్ వీడియోలో అవకాశం ఇస్తానని నమ్మించిన వీరిద్దరూ దారుణానికి ఒడిగట్టారన్నారు. అయితే ఆమె ఎవరో తెలియదని మోహన్ లాల్ అన్నారు.
INDIA కూటమి కేవలం జాతీయ రాజకీయాలపై దృష్టిసారిస్తుందని, అసెంబ్లీ-స్థానిక ఎన్నికలపై కూటమిలో ఎలాంటి చర్చ లేదని NCP SP చీఫ్ శరద్ పవార్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా? కలిసి పోటీ చేయాలా? అనేది త్వరలో నిర్ణయిస్తామన్నారు. అయితే, ఒంటరిగా పోటీ చేయనున్నట్టు శివసేన UBT ఇప్పటికే ప్రకటించింది. స్థానిక ఎన్నికలు MVA పార్టీలకు జీవన్మరణ సమస్యగా పరిణమించాయి.
కేరళలో ఓ అథ్లెట్ బాలిక(18)పై ఐదేళ్లుగా 62 మంది కామాంధుల <<15126560>>లైంగిక వేధింపుల<<>> కేసు విచారణ వేగవంతమైంది. ఇప్పటి వరకు 44 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై 30 FIRలు నమోదు చేసినట్లు తెలిపారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. విదేశాల్లో ఉన్న ఇద్దరు మృగాళ్ల కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామని చెప్పారు. నిందితులెవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు.
త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టు ప్రదర్శనపైనే హెడ్ కోచ్ గంభీర్ పదవీకాలం పొడిగింపు ఆధారపడి ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. CT తర్వాత BCCI రివ్యూ నిర్వహించి నిర్ణయం తీసుకోనుందట. అందులోనూ భారత్ విఫలమైతే గంభీర్‌ను కోచ్‌గా తొలగించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. గతేడాది జులైలో గౌతీ కోచ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీమ్ ఇండియా 10 టెస్టుల్లో 6 ఓడిపోయింది. BGT సందర్భంగా చెలరేగిన వివాదాలు తెలిసినవే.
ఢిల్లీలో అవినీతి, ద్రవ్యోల్బణం పెరుగుతున్నా ప్రధాని మోదీ తరహాలో కేజ్రీవాల్ కూడా ప్రచారం, అబద్ధపు హామీల విధానాన్ని అనుసరిస్తున్నారని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ నేతలకు రాహుల్ దిశానిర్దేశం చేశారు. ఆప్‌పై శాయశక్తులా పోరాడాలని, వైఫల్యాలను ఎత్తిచూపాలని, అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలన్నారు. మరోవైపు 2020లో కాంగ్రెస్ ఢిల్లీలో ఒక్క సీటూ గెలవలేదు.
ESICలో 608 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2 ఉద్యోగాలకు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. MBBS పూర్తి చేసి, యూపీఎస్సీ నిర్వహించిన CMSE-2022&2023 ఉత్తీర్ణులైన వారు అర్హులు. వయసు 35 ఏళ్లు మించరాదు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. ఎంపికైన వారికి రూ.56,100-రూ.1,77,500 జీతం ఉంటుంది. పూర్తి వివరాలకు <
కేరళ, తమిళనాడు తీరాలకు కల్లక్కడల్(సముద్రంలో ఆకస్మిక మార్పులు) ముప్పు పొంచి ఉందని కేంద్ర సంస్థ INCOIS హెచ్చరించింది. హిందూ మహా సముద్రంలో బలమైన గాలుల కారణంగా రేపు రా.11.30 వరకు అలలు 1 మీటర్ వరకు ఎగిసి పడతాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంది. దీంతో రెండు రాష్ట్రాల అధికారులు చర్యలు చేపట్టారు. తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, పర్యాటకులు బీచ్‌లకు వెళ్లొద్దని సూచించింది.
దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు నిన్నటితో ముగియగా NTA మరో అవకాశం ఇచ్చింది. ఈ నెల 23 వరకు గడువును పొడిగించింది. ఆరో క్లాస్‌కు అభ్యర్థుల వయసు మార్చి 31, 2025 నాటికి 10-12ఏళ్లు, 9వ క్లాస్‌కు 13-15ఏళ్లు ఉండాలి. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఎగ్జామ్ ఉంటుంది. పూర్తి వివరాల కోసం <
Sorry, no posts matched your criteria.