News June 4, 2024

UP: స్మృతి, రాజ్‌నాథ్ వెనుకంజ

image

ఉత్తర్ ప్రదేశ్‌లో పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. బీజేపీ అనూహ్యంగా వెనకబడింది. మొత్తం 80 స్థానాల్లో కేవలం 37లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. విపక్ష ఇండియా కూటమి ఏకంగా 41 స్థానాల్లో దూసుకుపోతోంది. అమేథీలో స్మృతి ఇరానీపై కిశోరీలాల్ ఆధిక్యం కనబరుస్తున్నారు. రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ దూసుకెళ్తున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం వెనుకంజలో ఉన్నారు.

News June 4, 2024

విశాఖలో కొనసాగుతున్న టీడీపీ ఆధిక్యం

image

AP: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విశాఖ జిల్లాలో టీడీపీ దూసుకెళ్తోంది. విశాఖ తూర్పులో టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు.. వైసీపీ అభ్యర్థి ఎం.వి.వి.సత్యనారాయణపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు గాజువాకలో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి, మంత్రి గుడివాడ అమర్నాథ్ వెనుకంజలో ఉన్నారు.

News June 4, 2024

గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూటమి హవా

image

➣సత్తెనపల్లిలో మంత్రి అంబటి వెనుకంజ ➣పెదకూరపాడులో TDP అభ్యర్థి భాష్యం ప్రవీణ్ 1500 ఓట్ల ఆధిక్యం ➣తెనాలిలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ 7885 ఓట్ల ఆధిక్యం ➣బాపట్లలో TDP అభ్యర్థి నరేంద్ర వర్మ 1394 ఓట్ల ఆధిక్యం ➣మైలవరంలో TDP అభ్యర్థి వసంత 1034 ఓట్ల ఆధిక్యం ➣విజయవాడ వెస్ట్‌లో BJP అభ్యర్థి సుజనా చౌదరి 2వేల ఓట్ల ఆధిక్యం ➣పెడన, నందిగామ అసెంబ్లీ, గుంటూరు, బాపట్ల MP స్థానాల్లో TDP ఆధిక్యం

News June 4, 2024

అరకు ఎంపీ స్థానంలో YCP ఆధిక్యం

image

AP: అరకు ఎంపీ స్థానానికి సంబంధించి వైసీపీ అభ్యర్థి తనుజారాణి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్‌లో కూటమి అభ్యర్థి గీతకు 2,566 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి తనూజ రాణికి 3,823 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి 1,357 ఓట్లు ఆధిక్యంతో ఉన్నారు. ఇండియా కూటమి అభ్యర్థి అప్పలనరస 866 ఓట్లతో తృతీయ స్థానంలో ఉన్నారు.

News June 4, 2024

BREAKING: యూపీలో బీజేపీ వెనుకంజ

image

కమలానికి కంచుకోటలా భావించే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వెనుకబడింది. అక్కడ 80 ఎంపీ స్థానాలుండగా 42 చోట్ల ఇండియా కూటమి అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. ఇది ఎవరూ ఊహించని పరిణామం.

News June 4, 2024

రాజంపేటలో మాజీ సీఎం లీడింగ్

image

✒ రాజంపేట ఎంపీ- కిరణ్ కుమార్ రెడ్డి(BJP) 3,000 ఓట్ల లీడింగ్
✒ ఉరవకొండ ఎమ్మెల్యే – పయ్యావుల కేశవ్(TDP) లీడింగ్
✒ రాయదుర్గం- కాల్వ శ్రీనివాసులు(TDP) లీడింగ్
✒ కడప ఎమ్మెల్యే- మాధవీరెడ్డి(TDP) 2,158 ఓట్ల లీడింగ్
✒ శింగనమల- బండారు శ్రావణి(TDP) ఆధిక్యం
✒ నంద్యాల- ఫరూఖ్(TDP) లీడింగ్

News June 4, 2024

మంత్రి పెద్దిరెడ్డి వెనుకంజ

image

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుకంజలో ఉన్నారు. అక్కడ టీడీపీ నుంచి చల్లా బాబు లీడింగులోకి వచ్చారు. రాజంపేటలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో ఉండగా.. పెద్దిరెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి వెనుకంజలో ఉన్నారు. రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

News June 4, 2024

BIG BREAKING: మ్యాజిక్ ఫిగర్ దాటిన కూటమి

image

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో NDA భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ 81 స్థానాల్లో, జనసేన 15, బీజేపీ 5 స్థానాల్లో, వైసీపీ 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అటు ఎంపీ స్థానాల్లో టీడీపీ 11, జనసేన 1, బీజేపీ 5, వైసీపీ 2 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.

News June 4, 2024

గన్నవరంలో వల్లభనేని వంశీ వెనుకంజ

image

AP: కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ వెనుకంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు లీడ్‌లో ఉన్నారు. బాపట్ల MP స్థానంలో TDP అభ్యర్థి కృష్ణప్రసాద్ లీడింగ్‌లో ఉన్నారు. అవనిగడ్డలో జనసేన నేత బుద్ధప్రసాద్ ముందంజలో ఉన్నారు. విజయవాడ సెంట్రల్‌ అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థి బోండా ఉమ లీడింగ్‌లో ఉన్నారు. ఇటు విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి లీడింగ్‌లో ఉన్నారు.

News June 4, 2024

మెదక్‌లో బీఆర్ఎస్‌కు షాక్

image

మెదక్‌లో BRSకు షాక్ తగిలేలా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముందంజలో ఉన్నారు. గతంలో ఈ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గతంలో గెలుపొందడంతో మరోసారి గెలుస్తామని బీఆర్ఎస్ ఆశించినా తొలి రౌండ్‌లో నిరాశే ఎదురైంది.