News January 13, 2025

చంద్రబాబు వచ్చాకే ప్రతి ఇంటా సంక్రాంతి ఆనందాలు: టీడీపీ

image

AP: ఐదేళ్ల జగన్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం చేసి సంక్రాంతి ఆనందం లేకుండా చేశారని టీడీపీ Xలో విమర్శించింది. CBN పాలన ప్రారంభమయ్యాక తొలి సంక్రాంతికే ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరుస్తున్నాయని తెలిపింది. జగన్ విధ్వంసంతో ప్రతి రోజూ రాష్ట్రంలో అలజడిగా ఉండేదని, చంద్రబాబు ప్రజా సంక్షేమ పాలనతో రోజూ పండుగలా ఉందని పేర్కొంది. రైతులు, పేదలు, యువత ఎంతో సంతోషంగా ఉన్నారని, ఛార్జీలు పెంచలేదని రాసుకొచ్చింది.

News January 13, 2025

కౌశిక్ రెడ్డి అరెస్ట్ అత్యంత దుర్మార్గం: KTR

image

TG: పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పూటకో కేసు పెట్టి రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్ట్ చేయడం రేవంత్ సర్కార్‌కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ‘ప్రజల పక్షాన ప్రశ్నించిన కౌశిక్‌పై కేసులు పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా? చిల్లర చేష్టలతో BRS ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. కౌశిక్‌ను బేషరతుగా విడుదల చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

News January 13, 2025

కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు

image

TG: కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. దరఖాస్తులతోపాటు కులగణన సర్వే ఆధారంగా రూపొందించిన జాబితా క్షేత్రస్థాయి పరిశీలన బాధ్యతలను కలెక్టర్లు, GHMC కమిషనర్‌కు అప్పగించింది. MPDOలు, మున్సిపల్ కమిషనర్లు ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డుల్లో ప్రదర్శించి చర్చించిన తర్వాతే ఆమోదిస్తారు. కార్డుల్లో మార్పులకూ అవకాశం కల్పిస్తారు. ఈ నెల 26 నుంచి కొత్త కార్డులను జారీ చేస్తారు.

News January 13, 2025

సంక్రాంతి వేడుకల ఫొటోలను పంచుకున్న మోదీ

image

ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ఫొటోలను ప్రధాని మోదీ ట్విటర్‌లో పంచుకున్నారు. దేశవ్యాప్తంగా సంక్రాంతి, పొంగల్‌ను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారని చెప్పారు. ఈ పండగ భారతీయ వ్యవసాయ సంస్కృతిని ప్రతిబింబిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ శుభ సందర్భంగా ప్రజలు ఆనందంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు.

News January 13, 2025

GOOD NEWS: పీఎం కిసాన్ రూ.10,000లకు పెంపు?

image

పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు కేంద్రం ఏటా రూ.6,000 ఇస్తుండగా రూ.10,000లకు పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ మేరకు ప్రకటన ఉంటుందని సమాచారం. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ పెంపుపై మాట్లాడిన విషయం తెలిసిందే. కేంద్రం ఇచ్చే రూ.10వేలతో పాటు తాము మరో రూ.10వేలు కలిపి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని చెప్పారు.

News January 13, 2025

పసుపు బోర్డుతో ఉపయోగాలివే

image

కొత్త వంగడాల అభివృద్ధి నుంచి హార్వెస్ట్ మేనేజ్‌మెంట్, మార్కెట్ వరకు రైతులకు లబ్ధి కలుగుతుంది. పసుపు తవ్వకం, ఆరబెట్టడం, ఉడకబెట్టడం, డ్రై చేయడానికి అవసరమైన యంత్రాలను ప్రభుత్వం రాయితీపై అందిస్తుంది. పంట నాణ్యత, దిగుబడి పెంచేలా రైతులకు సహకారం ఉంటుంది. తెలంగాణవ్యాప్తంగా ప్రతి సీజన్‌లో దాదాపు 9 లక్షల క్వింటాళ్ల పసుపు దిగుబడి వస్తుంది. కాగా రేపు నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు <<15148521>>ప్రారంభోత్సవం<<>> జరగనుంది.

News January 13, 2025

కౌశిక్ అరెస్ట్.. కరీంనగర్‌కు బీఆర్ఎస్ లీగల్ టీమ్

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు 132, 115(2), 352, 292 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. కరీంనగర్‌కు తరలిస్తున్న ఆయనను జిల్లా జడ్జి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు కౌశిక్ అరెస్ట్ విషయం తెలియగానే బీఆర్ఎస్ లీగల్ టీమ్‌ కూడా కరీంనగర్ బయల్దేరింది.

News January 13, 2025

49 ఏళ్ల నటితో డేటింగ్ వార్తలు.. సింగర్ స్పందన ఇదే

image

ప్రముఖ నటి అమీషా పటేల్(49) పలు బ్రేకప్‌ల తర్వాత ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నారు. ఆమె ఇటీవల తనకంటే 20 ఏళ్ల చిన్నవాడైన సింగర్ నిర్వాన్ బిర్లాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వారిద్దరూ దుబాయ్‌లో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు వైరలయ్యాయి. ఆ రూమర్లను తాజాగా నిర్వాన్ ఖండించారు. ‘అమీషా మా ఫ్యామిలీ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి మా నాన్నకు ఆమె తెలుసు. మ్యూజిక్ ఆల్బమ్ కోసం మేం దుబాయ్ వెళ్లాం’ అని పేర్కొన్నారు.

News January 13, 2025

యువరాజ్ సింగ్ తండ్రిపై ఉమెన్స్ కమిషన్ సీరియస్

image

మహిళలను కించపరుస్తూ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలపై పంజాబ్ ఉమెన్స్ కమిషన్ ఆగ్రహించింది. ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యోగ్‌రాజ్ ‘మహిళల చేతికి పవర్ ఇస్తే అంతా సర్వనాశనం చేస్తారు. గతంలో ఇందిరా గాంధీ దేశాన్ని పాలించి అదే చేశారు. ఏ మహిళకైనా ఇంటి బాధ్యతలు అప్పగిస్తే అంతే సంగతి. అందుకే వారికి పవర్ ఇవ్వొద్దు. ప్రేమ, గౌరవమే ఇవ్వాలి’ అని అన్నారు.

News January 13, 2025

నిజామాబాద్‌లో రేపు జాతీయ పసుపు బోర్డు ప్రారంభం

image

TG: పండగ వేళ పసుపు రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. రేపు నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి పల్లె గంగారెడ్డిని ఛైర్మన్‌గా నియమించింది. ఆయన మూడేళ్లపాటు పదవిలో ఉంటారని పేర్కొంది. కాగా తాము అధికారంలోకి వస్తే నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని గతంలో బీజేపీ హామీ ఇచ్చింది.