News January 13, 2025

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు: ఉత్తమ్

image

TG: ఖమ్మం(D) రఘునాథపాలెంలో మంచుకొండ ఎత్తిపోతల పథకానికి మంత్రులు భట్టి, తుమ్మల, కోమటిరెడ్డి, పొంగులేటి, ఉత్తమ్ శంకుస్థాపన చేశారు. ఉగాదిలోపే ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని, 27 చెరువుల కింద 2,400 ఎకరాలు ఆయకట్టులోకి రానుందని ఉత్తమ్ తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనేదే లక్ష్యమన్నారు. BRS ప్రభుత్వం ₹లక్ష కోట్లు వెచ్చించి లక్ష ఎకరాలను కూడా ఆయకట్టులోకి తీసుకురాలేదని విమర్శించారు.

News January 13, 2025

జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు అవాస్తవం: అశ్వినీ వైష్ణవ్

image

కొవిడ్ త‌రువాత భార‌త్ స‌హా ప‌లు దేశాల్లో 2024లో జ‌రిగిన‌ ఎన్నిక‌ల్లో అధికార పార్టీలు ఓడిపోయాయని Meta CEO జుక‌ర్‌బ‌ర్గ్ చేసిన వ్యాఖ్య‌లు అవాస్తవమని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ పేర్కొన్నారు. అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశ‌మైన భార‌త్‌లో 2024లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో 64 కోట్ల మంది ఓటేశార‌న్నారు. మోదీ నేతృత్వంలోని NDA ప్ర‌భుత్వంపై దేశ ప్ర‌జ‌లు మూడోసారి త‌మ విశ్వాసాన్ని వ్య‌క్తం చేశార‌ని పేర్కొన్నారు.

News January 13, 2025

కూటమి ప్రభుత్వంలో సంతోషంతో ప్రజలు: మంత్రి పార్థసారథి

image

AP: ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతలు నిరాశ, నిస్పృహలో ఉన్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. తమకు స్వేచ్ఛ లభించిందని వారు సంబరాలు చేసుకుంటున్నారన్నారు. రైతుల నుంచి కొన్న ధాన్యానికి వెంటనే డబ్బు చెల్లిస్తున్నామని, రోడ్లకు మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రం పారిశ్రామికంగా పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు.

News January 13, 2025

PHOTO GALLERY: మహాకుంభ మేళా

image

యూపీలోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభ మేళా అట్టహాసంగా జరుగుతోంది. దేశవిదేశాల నుంచి వస్తున్న కోట్లాది మంది ప్రజలు గంగ, యమునా, సరస్వతి కలిసే త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. అటు భారీగా తరలివస్తున్న భక్తుల సౌకర్యార్థం అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. మహాకుంభ మేళాకు సంబంధించిన కొన్ని ఫొటోలు మీ కోసం.

News January 13, 2025

భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

image

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. క్యుషు ప్రాంతంలో భూప్రకంపనలు రాగా రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రత నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల నేపాల్, టిబెట్ సరిహద్దులో సంభవించిన భూకంపం ధాటికి సుమారు 200 మంది మరణించిన విషయం తెలిసిందే.

News January 13, 2025

అప్పుడు జైలుకెళ్లిన వారికి రూ.20 వేల పెన్షన్

image

1975 నుంచి 1977 మ‌ధ్య దేశంలో ఎమర్జెన్సీ అమ‌లులో ఉన్న సమయంలో జైలుకెళ్లిన వారికి నెలవారీ రూ.20,000 పెన్షన్ మంజూరు చేస్తామ‌ని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. పెన్షన్‌తో పాటు వారి వైద్య ఖర్చులనూ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, జనవరి 1, 2025 నాటికి జీవించి ఉన్న వారందరికీ ఈ సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని తెలిపింది. జైలులో ఎన్ని రోజులు ఉన్నా స‌రే వారందరూ అర్హులే అని హోం శాఖ నోటిఫికేషన్ విడుద‌ల చేసింది.

News January 13, 2025

టెస్టు కెప్టెన్‌గా జైస్వాల్‌ను ప్రతిపాదించిన గంభీర్?

image

రోహిత్ తర్వాత టెస్టు కెప్టెన్ ఎవరనే దానిపై BCCI తీవ్ర కసరత్తు చేస్తోంది. నిన్న, ఈరోజు అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, కోచ్ గంభీర్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. బుమ్రాకు కెప్టెన్సీ ఇస్తే వర్క్‌లోడ్ ఎక్కువవుతుందని భావించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే సెలక్షన్ కమిటీ తెరపైకి పంత్ పేరును తీసుకొచ్చిందని సమాచారం. అయితే గంభీర్ అనూహ్యంగా జైస్వాల్ పేరును ప్రతిపాదించారట. మరి దీనిపై BCCI ఏమంటుందో చూడాలి.

News January 13, 2025

ఉక్రెయిన్‌తో యుద్ధంలో కేరళ వాసి మృతి

image

ఉక్రెయిన్‌తో యుద్ధంలో ర‌ష్యా త‌ర‌ఫున పోరాడుతున్న కేర‌ళ‌లోని త్రిసూర్‌ వాసి బినిల్(32) మృతి చెందారు. మ‌రొక‌రు గాయ‌ప‌డ్డారు. కొన్ని రోజుల క్రితం వీరు డ్రోన్ దాడిలో గాయ‌ప‌డిన‌ట్టు ఫ్యామిలీకి స‌మాచారం వ‌చ్చింది. బినిల్ భార్య మాస్కోలోని భార‌త ఎంబ‌సీని సంప్ర‌దించ‌గా ఆయన మృతిని వారు మౌఖికంగా అంగీక‌రించారు. తిరిగి ఇంటికి చేరుకొనేందుకు బాధితులిద్ద‌రూ గతంలో విఫ‌ల‌ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టు తెలుస్తోంది.

News January 13, 2025

బ్రాహ్మణులు నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష.. ఎక్కడంటే?

image

యువ బ్రాహ్మణ దంపతులకు MP ప్రభుత్వ ఆధ్వర్యంలోని పరశురామ్ కళ్యాణ్ బోర్డు ఆఫర్ ప్రకటించింది. నలుగురు పిల్లలను కంటే రూ.లక్ష బహుమతిగా ఇస్తామని ఆ బోర్డు అధ్యక్షుడు పండిత్ విష్ణు రాజోరియా వెల్లడించారు. ‘మనం కుటుంబాలపై దృష్టి పెట్టట్లేదు. యువత ఒక బిడ్డతోనే ఆగిపోతోంది. ఇది ఇబ్బందికరంగా మారుతోంది. భవిష్యత్ తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. అందుకే కనీసం నలుగురు పిల్లల్ని కనాలి’ అని పేర్కొన్నారు.

News January 13, 2025

ఇన్ఫోసిస్: వచ్చే నెలలో జీతాల పెంపు?

image

ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. వారికి ఫిబ్రవరిలో జీతాలు పెంచేందుకు కంపెనీ సిద్ధమైనట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. కన్సల్టెంట్లు, సీనియర్ ఇంజినీర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, సిస్టమ్ ఇంజినీర్లు తదితరులకు జనవరి 1 నుంచే ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. సంస్థలోని ఉన్నతోద్యోగులకు హైక్ లెటర్స్ మార్చిలో అందజేసే అవకాశం ఉందని పేర్కొంది. కంపెనీ చివరిసారిగా 2023 NOVలో <<15078700>>హైక్ ఇచ్చిన<<>> విషయం తెలిసిందే.