News June 3, 2024

ట్రెండింగ్‌లో ఏపీ రిజల్ట్స్

image

ఏపీ ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడటంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు Xలో పోస్టులతో హోరెత్తిస్తున్నారు. #YSRCPWinningBig, #YSJaganAgain అని వైసీపీ, #HelloAP_ByeByeYCP, #JaganLosingBig అని టీడీపీ, జనసేన కార్యకర్తలు రిజల్ట్స్ హీట్ పెంచుతున్నారు.

News June 3, 2024

ఈనెల 17 లేదా 18న తెలంగాణలో సెలవు!

image

బక్రీద్ పండుగ సందర్భంగా ఈనెల 17న తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నెలవంక దర్శనం ఆధారంగా ముస్లింలు బక్రీద్‌ను జరుపుకుంటారు. ఈనెల 7న నెలవంక కనిపిస్తే జూన్ 17న, లేకపోతే 18న జరుపుకోనున్నారు. పండుగ జరుపుకునే రోజున (17or18) సెలవు ఉండనుంది.

News June 3, 2024

అక్టోబర్ 10న రజనీకాంత్vsఎన్టీఆర్?

image

రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘వెట్టయాన్’ సినిమా అక్టోబర్ 10న థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. ఈ విషయాన్ని రజనీయే స్వయంగా వెల్లడించారు. దీంతో అదే రోజు రిలీజ్ కానున్న ఎన్టీఆర్ ‘దేవర’కు ఈ మూవీ పోటీగా మారింది. అయితే దేవర రిలీజ్ డేట్ సెప్టెంబర్ 27కు మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ విడుదల తేదీ మారకుంటే అక్టోబర్ 10న బాక్స్ ఆఫీస్ వద్ద రజనీకాంత్, ఎన్టీఆర్ సినిమాల మధ్య పోటీ చూడవచ్చు.

News June 3, 2024

సింగరేణిలో 327 పోస్టులు.. రేపే లాస్ట్

image

సింగరేణిలో 327 పోస్టులకు రేపటితో దరఖాస్తు గడువు ముగియనుంది. పోస్టును బట్టి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. వయసు 30 ఏళ్లు మించరాదు. SC, ST, BC, దివ్యాంగులైన అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంది. ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ-1లో 98, T&S గ్రేడ్ సీ-24, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ-1లో 47, మేనేజ్‌మెంట్ ట్రైనీ ఈ2గ్రేడ్-42 తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వెబ్‌సైట్: <>scclmines.com<<>>

News June 3, 2024

యూజర్లకు వాట్సాప్ హెచ్చరిక

image

తమ సంస్థ నిబంధనలు ఉల్లంఘించే యూజర్ల ఖాతాలను నిషేధిస్తామని వాట్సాప్ మరోసారి హెచ్చరించింది. APR 1 నుంచి 30 వరకు దేశంలో 71 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసింది. వీటిలో అత్యధిక ఖాతాలను వినియోగదారుల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల ఆధారంగా తొలగించింది. 13 లక్షల అకౌంట్లను మాత్రం సంస్థ నిబంధనలు ఉల్లంఘించినందుకు నిషేధించింది. గతంలోనూ వాట్సాప్ కోట్ల సంఖ్యలో ఖాతాలను బ్యాన్ చేసింది.

News June 3, 2024

హనుమ విహారి ఇంట్రెస్టింగ్ ట్వీట్

image

రేపటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భారత క్రికెటర్, కాకినాడకు చెందిన హనుమ విహారి సైతం టెన్షన్ పడుతున్నట్లుగా ఉండే ‘ఫింగర్స్ క్రాస్డ్’ ఎమోజీని ట్వీట్ చేశారు. దీంతో ‘మనమే గెలుస్తున్నాం’ అంటూ YCP.. ‘హల్లో ఏపీ.. బై బై వైసీపీ’ అని TDP అభిమానులు ఆయన పోస్ట్ కింద కామెంట్స్ చేస్తున్నారు. కాగా మరో క్రికెటర్ అంబటి రాయుడు ఎన్నికల ముందు జనసేనలో చేరిన విషయం తెలిసిందే.

News June 3, 2024

లిక్కర్ స్కామ్‌లో 32వ నిందితురాలిగా కవిత: ఈడీ

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 6వ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను ED దాఖలు చేసింది. మొత్తం 36 మంది నిందితుల్లో MLC కవితను 32వ నిందితురాలిగా చేర్చింది. కవితతో పాటు ఇతర నిందితుల ఆస్తులు జప్తు చేయాలని కోరింది. ఆమె 9 ఫోన్లను ధ్వంసం చేశారని, AAPకు ₹100 కోట్లు చెల్లించేలా సౌత్ గ్రూప్‌తో కలిసి కుట్ర పన్నారని ఆరోపించింది. ఇలా మొత్తం ₹292.8cr విలువైన క్రైమ్ కార్యకలాపాల్లో ఆమె ఇన్వాల్వ్ అయ్యారని పేర్కొంది.

News June 3, 2024

ఒడిశా అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్

image

ఎన్నికల ఫలితాలు వెలువడే ముందు రోజు ఒడిశా అసెంబ్లీని గవర్నర్ రఘుబర్ దాస్ రద్దు చేశారు. ఇప్పటికే బీజేడీ ప్రభుత్వ పదవీకాలం పూర్తయింది. దీంతో అసెంబ్లీ రద్దుకు ఇవాళ ఉదయం కేబినెట్ ఆమోదం తెలపడంతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నవీన్ పట్నాయక్ చూస్తున్నారు.

News June 3, 2024

ఫలితాల తర్వాత ఇండియా కూటమి నేతల భేటీ!

image

రేపు ఫలితాల తర్వాత ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం వీరంతా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ అయిన విషయం తెలిసిందే. రేపు కూడా సమావేశం కావాలని నిర్ణయించిన నేతలు.. ఫలితాలపై చర్చించే అవకాశం ఉంది.

News June 3, 2024

BREAKING: టెట్ కీ విడుదల

image

TG: తెలంగాణ టెట్ ప్రిలిమినరీ కీ విడుదలైంది. నిన్నటితో టెట్ పరీక్షలు ముగియడంతో ఇవాళ పేపర్ల వారీగా కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల చేశారు. జూన్ 12న ఫలితాలు విడుదల కానున్నాయి. కీ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.