News January 12, 2025

50% రాయితీపై పెట్రోల్.. వారికి మాత్రమే!

image

AP: స్వయం ఉపాధి పొందుతున్న లేదా ప్రైవేట్ జాబ్ చేస్తున్న దివ్యాంగులకు ప్రభుత్వం 50% సబ్సిడీపై పెట్రోల్, డీజిల్ అందించనుంది. లబ్ధిదారులు 3 టైర్ల మోటరైజ్డ్ వెహికల్స్ కలిగి ఉండాలి. సంక్షేమ శాఖ ఆఫీసుల్లో ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలి. 2HP వాహనాలకు నెలకు 15 లీటర్ల వరకు, అంతకన్నా ఎక్కువ సామర్థ్యమున్న వాహనాలకు నెలకు 25 లీటర్ల వరకు రాయితీ లభిస్తుంది. బిల్లులు సమర్పిస్తే బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేస్తారు.

News January 12, 2025

ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి

image

ఉత్తరాఖండ్‌లోని పౌడీ గర్వాల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దహల్‌చోరి సమీపంలో ఒక బస్సు నియంత్రణ కోల్పోయి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, ఫైర్ సర్వీస్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

News January 12, 2025

క్షమాపణ చెప్తే సరిపోతుందా?.. YS జగన్ ఫైర్

image

AP: తిరుమల తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన TTD ఛైర్మన్‌, EO, JEO, కలెక్టర్‌, SPపై కఠిన చర్యలు తీసుకోవాలని YS జగన్ డిమాండ్ చేశారు. వారిపై కేసులు పెట్టి దేవునిపై ఉన్న భక్తిని CM చాటుకోవాలన్నారు. ‘Dy.CM క్షమాపణలు చెప్పాలంటున్నారు. ఆరుగురు చనిపోతే ప్రాయశ్చిత్తంగా క్షమాపణ చెప్తే సరిపోతుందంటారా? CM, Dy.CM రాజకీయ డ్రామాలు ఆపేయాలి’ అని ట్వీట్ చేశారు.

News January 12, 2025

ఈ నెలలో ₹22,194 కోట్ల FPIల ఉపసంహరణ

image

దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(FPI) విక్రయాల పర్వం కొనసాగుతోంది. 2024 DECలో ₹15,446Cr వాటాలను కొనుగోలు చేయగా, ఈ నెల 10 నాటికి ఏకంగా ₹22,194Cr కోట్లను ఉపసంహరించుకున్నారు. US అధ్యక్షుడిగా ట్రంప్ ఈ నెల 20న ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన తీసుకునే నిర్ణయాలపై ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. అధిక ద్రవ్యోల్బణం, GDP వృద్ధి తగ్గుదల కూడా నిధుల తరలింపునకు ఓ కారణం.

News January 12, 2025

తెనాలిలో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం

image

AP: దివంగత నటుడు, సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం గుంటూరు జిల్లా తెనాలిలో ఏర్పాటైంది. దీన్ని మంత్రి నాదెండ్ల మనోహర్, నిర్మాత ఆదిశేషగిరిరావు ఆవిష్కరించారు. సినీ రంగానికి ఆయన టెక్నాలజీని పరిచయం చేసి ఎన్నో విజయాలు సాధించారని నాదెండ్ల చెప్పారు. తన జీవితంలో కృష్ణ విలువలతో జీవించారని కొనియాడారు.

News January 12, 2025

మాజీ ఎంపీ జగన్నాథం కన్నుమూత

image

TG: నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మరణించారు. 1951 మే 22న పాలమూరు జిల్లా ఇటిక్యాలలో జన్మించిన జగన్నాథం మెడిసిన్ చదివి కొంతకాలం డాక్టర్‌గా సేవలందించారు. 1996, 1999, 2004 ఎన్నికల్లో TDP, 2009లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. 2014లో BRS తరఫున పోటీ చేసి ఓడిన ఆయన 2024లో BSPలో చేరినా ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

News January 12, 2025

నెహ్రూ కంటే పటేల్, అంబేడ్కర్ PM పదవికి అర్హులు: ఖట్టర్

image

జవహర్‌లాల్ నెహ్రూ పొరపాటున దేశ ప్రధాని అయ్యారని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అభిప్రాయపడ్డారు. ఆయన కంటే సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేడ్కర్ ఆ పదవికి అర్హులని పేర్కొన్నారు. అంబేడ్కర్ వారసత్వాన్ని బీజేపీ కొనసాగించిందన్నారు. ఖట్టర్ వ్యాఖ్యలను హరియాణా మాజీ సీఎం భూపేందర్ హుడా తిప్పికొట్టారు. పొరపాటున సీఎం అయిన వ్యక్తులు ఇలా మాట్లాడకూడదని చురకలు అంటించారు.

News January 12, 2025

సంక్రాంతి పండుగకు ఏం చేయాలంటే?

image

సంక్రాంతి పండుగ రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి నదీ స్నానం చేయాలి. అనంతరం నూతన దుస్తులు ధరించి దేవుడి పూజ చేయాలి. మకర సంక్రాంతి రోజు సూర్య భగవానుడిని ఆరాధిస్తూ సూర్య మంత్రం జపించాలి. ఎవరైనా దానం కోసం వస్తే వారికి తోచినంత ధనం, దుస్తులు, ఆహారం, వస్తువులు ఇవ్వాలి. చలికాలం కాబట్టి అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేయొచ్చు. ఇంటి ముందు రథం రూపంలో ముగ్గు వేసుకుంటే మంచిది.

News January 12, 2025

యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు

image

AP: రాష్ట్రంలోని యువతకు ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. BCలకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది. ఇందులో సగం రాయితీ ఉంటుంది. జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు రూ.8 లక్షలు ఇవ్వనుంది. ఇందులో రూ.4 లక్షలు రాయితీ ఇస్తారు. EBCలకు కూడా స్వయం ఉపాధి పథకాలు అందిస్తోంది. ఇందులోనూ 50 శాతం రాయితీ ఇస్తోంది. MPDO ఆఫీస్‌లో అప్లై చేసుకోవాలి.

News January 12, 2025

రాహుల్ జీ.. గొప్ప మార్గంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నారు: KTR

image

TG: సంక్రాంతి తర్వాత మరింత మంది BRS MLAలు కాంగ్రెస్‌లో చేరతారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై KTR స్పందించారు. ‘ఓవైపు HYDలో జరిగే సంవిధాన్ బచావో(రాజ్యాంగాన్ని కాపాడండి) ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొంటారని అంటున్నారు. మరోవైపు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి BRS MLAలను చేర్చుకుంటామని TPCC చీఫ్ చెబుతున్నారు. రాహుల్ జీ.. మీరు గొప్ప మార్గంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నారు’ అని సెటైరికల్ ట్వీట్ చేశారు.