News June 3, 2024

జాగ్రత్త.. రేపు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News June 3, 2024

SBI అరుదైన ఘనత

image

ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరుదైన ఘనత సాధించింది. ఇవాళ SBI షేర్లు రాణించడంతో బ్యాంక్ మార్కెట్ విలువ రూ.8 లక్షల కోట్లు దాటింది. దీంతో ఈ ఘనత అందుకున్న తొలి ప్రభుత్వ రంగ సంస్థగా నిలిచింది. ఇవాళ SBI షేర్ 9.48 శాతం పెరిగింది. గత ఏడాది ఈ షేర్ విలువ 40శాతం పెరగడం గమనార్హం. ఎన్డీఏకు సానుకూలంగా ఫలితాలు వస్తాయనే ఎగ్జిట్ పోల్స్ అంచనాతో ఇవాళ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో దూసుకెళ్లింది.

News June 3, 2024

‘కల్కి’లో సీత?

image

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా ‘కల్కి 2898 AD’. ఈ మూవీలో ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి స్టార్లు భాగమయ్యారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్‌తో పాటు సీనియర్ నటి శోభన నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక పాత్రల్లో వీరిద్దరూ కనిపిస్తారని ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీనిపై మూవీ యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

News June 3, 2024

YCPకి 123 స్థానాలు వస్తాయి: పరిపూర్ణానంద

image

ఏపీలో జగన్ రెండోసారి సీఎం అవుతారని ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానంద అన్నారు. అసెంబ్లీ ఫలితాల్లో వైసీపీకి 123 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు. గ్రామీణ మహిళలు అధికశాతం YCPకే ఓట్లు వేశారన్నారు. దేశంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, మూడో సారి మోదీ ప్రధాని అవుతారని అంచనా వేశారు.

News June 3, 2024

ఎక్కడా విద్యుత్ కోతలు లేవు: తెలంగాణ కాంగ్రెస్

image

తెలంగాణలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ‘వర్షాకాలం దృష్ట్యా విద్యుత్ తీగలకు ఆనుకుని ఉండే చెట్ల కొమ్మలను తొలగించేందుకు, స్తంభాల మెయింటెనెన్స్ కోసం మాత్రమే విద్యుత్ నిలిపివేస్తున్నాం తప్ప కోతలు ఎక్కడా లేవు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా అనవసరంగా విద్యుత్ నిలిపివేసిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. BRS నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారు’ అని విమర్శించింది.

News June 3, 2024

అత్యధిక మెజారిటీ సాధించిన ఎంపీ ఎవరంటే?

image

దేశ చరిత్రలో లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన రికార్డు BJP MP ప్రీతమ్ ముండే పేరిట ఉంది. తండ్రి గోపినాథ్ మరణంతో 2014లో జరిగిన ఉపఎన్నికలో మహారాష్ట్ర బీడ్ నియోజకవర్గం నుంచి ప్రీతమ్ బరిలోకి దిగారు. ఈ స్థానంలో 6.96 లక్షల ఓట్ల మెజార్టీతో ఆమె విజయం సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో CR పాటిల్(నవసరి) 6.89 లక్షలు, సంజయ్ భాటియా(కర్నాల్) 6.56 లక్షల మెజారిటీతో ఉన్నారు.

News June 3, 2024

image

https://d29i5havsxvi1j.cloudfront.net/cd-timer/exitpolls-cd-timer.html

News June 3, 2024

బెంగళూరు రేవ్ పార్టీ నిర్వహణలో హేమ కీలక పాత్ర!

image

గతనెల 20న బెంగళూరు రేవ్ పార్టీ నిర్వహణలో నటి హేమ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ఐదుగురితో కలిసి ఆమె రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు నిర్ధారించారు. ఇందులో డ్రగ్స్ కూడా వాడినట్లు తేలడంతో పార్టీలో పాల్గొన్న వారందరికీ టెస్టులు నిర్వహించారు. అందులో 86 మందికి పాజిటివ్‌గా తేలింది. వారిలో హేమ కూడా ఉండటంతో తాజాగా ఆమెను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు.

News June 3, 2024

అరుదైన వ్యాధి.. మహిళ ప్రేగుల్లో ఆల్కహాల్ ఉత్పత్తి

image

కెనడాలో ‘ఆటో-బ్రూవరీ సిండ్రోమ్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ(50)కు వైద్యులు చికిత్స అందించారు. ఈ వ్యాధి ఉన్నవారి ప్రేగుల్లో శిలీంధ్రాలు కిణ్వ ప్రక్రియతో ఆల్కహాల్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల వారు అస్పష్టంగా మాట్లాడుతూ, పగలు నిద్రపోతూ ఉంటారు. UTI సమస్యలకు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల ఈ సిండ్రోమ్ వస్తుందట. యాంటీ ఫంగల్ ఔషధాలు, లో కార్బోహైడ్రేట్ ఆహారంతో ఆమెకు చికిత్స చేశారు.

News June 3, 2024

కాకతీయ కళాతోరణంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: సీతక్క

image

TG: రాష్ట్రీయ గీతాన్ని వివాదం చేయడం తగదని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళాతోరణం కొనసాగింపు లేదా తొలగింపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మెజారిటీ ప్రజల ఇష్టం మేరకే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాలు గెలుస్తామన్న విశ్వాసం ఉన్నట్లు పేర్కొన్నారు.