News January 11, 2025

ప్రధాని మోదీ యూట్యూబ్ సంపాదన ఎంతంటే?

image

ప్రధాని నరేంద్ర మోదీకి అధికారిక యూట్యూబ్‌ ఛానల్ ఉంది. ఆయన చేపట్టే అన్ని ప్రారంభోత్సవాలు, అధికారిక కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు ఇందులో ప్రసారమవుతాయి. ఈ ఛానల్‌కు 26 మిలియన్లకుపైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పటివరకు ఆయన 29,272 వీడియోలు పోస్ట్ చేశారు. వీటికి మొత్తంగా 636 కోట్లకుపైగా వ్యూస్ వచ్చాయి. ఓ నివేదిక ప్రకారం ఈ ఛానల్ ద్వారా మోదీకి నెలకు రూ.1.62 కోట్ల నుంచి రూ.4.88 కోట్ల ఆదాయం వస్తోంది.

News January 11, 2025

ఆ వ్యూహాత్మ‌క ప్రాంతాల్లో సైన్యం బలోపేతమే లక్ష్యం.. భారత్ కీలక నిర్ణయాలు

image

లద్దాక్ ప్రాంతంలో చైనా స‌రిహ‌ద్దుల్లో ఉన్న వ్యూహాత్మ‌క ప్రాంతాల్లో భారత సైన్యం మరింత బలోపేతం కానుంది. అక్కడ ర‌క్ష‌ణ సామ‌ర్థ్యాల‌ను మెరుగుప‌ర‌చ‌డానికి నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ (NBWL) 11 కీలక ప్రాజెక్టులను ఆమోదించింది. టెలికం నెట్‌వర్క్ ఏర్పాటు, మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రాలు, ఇన్‌ఫ్యాంట్రీ బెటాలియన్ శిబిరాలు, ఆర్టిలరీ రెజిమెంట్ పోస్టుల ఏర్పాటు తదితర ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపింది.

News January 11, 2025

కూల్ డ్రింక్స్ తాగడం వల్ల 3.4 లక్షల మంది మృతి!

image

శీతలపానీయాలు (Sugar-Sweetened Beverages) తాగడం ఎంతో ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. SSBల వల్ల అధిక బరువు, షుగర్ వస్తుందని, కొలెస్ట్రాల్& బీపీ పెరిగి గుండె జబ్బులొస్తాయని తెలిపారు. అనారోగ్యం పాలై 2020లో 3.4 లక్షల మంది చనిపోయారన్నారు. పట్టణ యువత, చదువుకున్నవారే ఇవి అధికంగా సేవిస్తున్నారు. శుద్ధమైన నీరు అందుబాటులో ఉంటే శీతలపానీయాలను తాగొద్దని సూచించారు. SHARE IT

News January 11, 2025

ఐటీ తర్వాత గ్రీన్ ఎనర్జీకే చంద్రబాబు ప్రోత్సాహం: పవన్ కళ్యాణ్

image

AP: సీఎం చంద్రబాబు ఐటీ తర్వాత గ్రీన్ ఎనర్జీనే ఎక్కువగా ప్రోత్సహించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. అందుకే గ్రీన్ కో ప్రతినిధులు సరైన ప్రణాళికతో రాగానే అనుమతులు ఇచ్చారన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో విస్తరించిన పిన్నాపురం ప్రాజెక్టుకు 2,800 ఎకరాలు ఇవ్వగా కొంత భూమిపై రెవెన్యూ, అటవీ శాఖ మధ్య వివాదం వచ్చిందని పేర్కొన్నారు. దీన్ని పరిష్కరించాలని కేంద్రాన్ని విన్నవించామని తెలిపారు.

News January 11, 2025

రమేశ్ బిధూరీ BJP CM అభ్యర్థి.. కొత్త నేరేటివ్ బిల్డ్ చేస్తున్న కేజ్రీవాల్

image

BJP CM అభ్యర్థి ఎవ‌రంటూ ఇన్నాళ్లు ప్ర‌శ్నించిన కేజ్రీవాల్, ప్ర‌ధాన విప‌క్షాన్ని ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. BJP నేత ర‌మేశ్ బిధూరీ ఆ పార్టీ CM అభ్య‌ర్థి కానున్నార‌ని, ఈ మేర‌కు స‌మాచారం ఉంద‌న్నారు. బిధూరీ ఇటీవ‌ల‌ CM ఆతిశీ, ప్రియాంకా గాంధీల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో నిలిచారు. దీంతో ‘ఇలాంటి వ్య‌క్తి BJP CM అభ్య‌ర్థి’ అనే నేరేటివ్‌ను ఆప్‌ బిల్డ్ చేస్తున్న‌ట్టు స్పష్టమవుతోంది.

News January 11, 2025

గేమ్‌ఛేంజర్: తైవాన్ బేఫికర్.. చైనాకు టెన్షన్!

image

పక్కలో బల్లెంగా మారిన చైనాకు తైవాన్ చుక్కలు చూపించే రోజు వచ్చేసింది! తన సరికొత్త Qingtian హైపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్‌ను ఆవిష్కరించింది. ఇది మాక్ 6 స్పీడ్‌తో 2000KM ప్రయాణించి దాడిచేయగలదు. చైనా సిటీస్, మిలిటరీ బేస్‌లను టార్గెట్ చేయగలదు. దీనిని కూల్చేయడం ఈజీ కాదు. 2024 ఆఖర్లో తైవాన్ వీటి మాస్ ప్రొడక్షన్‌ను ఆరంభించింది. ఈ టెక్నాలజీ అందించేందుకు రష్యాతో పాటు ఓ మిత్రదేశం సాయం చేసినట్టు సమాచారం.

News January 11, 2025

పాపం.. 10 ఒలింపిక్ మెడల్స్ కోల్పోయారు!

image

లాస్ ఏంజెలిస్‌లో ఏర్పడిన కార్చిచ్చు భారీ నష్టంతో పాటు వేలాది మందిని నిరాశ్రయులను చేసింది. అందులో మాజీ US ఒలింపిక్ స్విమ్మర్ గ్యారీ హాల్ జూనియర్ కూడా ఒకరు. మంటలు చుట్టుముట్టడంతో ఆయన తన ఇంటిని విడిచి ఉత్త చేతులతో వచ్చేసినట్లు పేర్కొన్నారు. తాను ఎంతో కష్టపడి సంపాదించిన 10 ఒలింపిక్ మెడల్స్ అందులోనే ఉండిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన 3 వేర్వేరు ఒలింపిక్ ఎడిషన్‌లలో 10 పతకాలు గెలుచుకున్నారు.

News January 11, 2025

ఏపీలో గ్రీన్‌కో రూ.35వేల కోట్ల పెట్టుబడులు: పవన్ కళ్యాణ్

image

AP: గ్రీన్ కో కంపెనీ దేశవ్యాప్తంగా ₹లక్షన్నర కోట్ల పెట్టుబడి పెడుతోందని Dy.CM పవన్ చెప్పారు. అందులో ₹35వేల కోట్లు రాష్ట్రానికే వస్తున్నాయని తెలిపారు. కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న సోలార్ పార్క్‌ను సందర్శించిన తర్వాత ఆయన మాట్లాడారు. ‘2,800 ఎకరాల్లోని ఈ ప్రాజెక్టు దేశంలో మరోచోట లేదు. దీనివల్ల లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. భవిష్యత్తులో ఈ ప్రాంతం పర్యాటక కేంద్రం కానుంది’ అని చెప్పారు.

News January 11, 2025

ఆయన అరెస్టుకు ఆధారాలిస్తే రూ.215 కోట్ల రివార్డు: US

image

ఎన్నికల్లో ఓట్లను తారుమారుచేసి వెనిజులా అధ్యక్షుడిగా నికోలస్ మదురో ఎన్నికయ్యారని అమెరికా కొన్ని నెలలుగా ఆరోపిస్తోంది. ఆయన మోసాన్ని నిర్ధారిస్తూ అరెస్టు చేసేందుకు కచ్చితమైన ఆధారాలను సమర్పించినవారికి $25 మిలియన్లు(రూ.215 కోట్లు) రివార్డుగా ఇస్తామని తాజాగా ప్రకటించింది. మదురో రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని, మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని అక్కడి విపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి.

News January 11, 2025

చైనా మాంజా.. IPSకు తప్పిన ప్రమాదం!

image

చైనా మాంజా వినియోగించడం వల్ల వాహనదారులకు గాయాలవుతున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన IPS అధికారి రమేశ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ‘దేవరా! ఇది నాకు చుట్టమల్లే చుట్టేయలేదు. శత్రువల్లే కాటేయబోయింది. ఈ రోజు ఉదయం నాకు తృటిలో ప్రమాదం తప్పింది. కాలికి మెడకు ఒకే సమయంలో చుట్టేసే మాంజా సమయానికి నా కంటబడింది. పతంగుల పండుగ సందర్భంగా తెగిన గాలి పటాల తాలూకు దారం మీ కంటపడగానే, చుట్టేయండి’ అని సూచించారు.