News January 11, 2025

భక్తుల మృతికి సీఎం బాధ్యుడు కాదా పవన్?: అంబటి

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ‘కలవని కల్తీ లడ్డుకు అప్పటి ముఖ్యమంత్రి బాధ్యుడా? ఆరుగురు భక్తుల మృతికి ఇప్పటి సీఎం బాధ్యుడు కాదా పవన్ కళ్యాణ్?’ అని Xలో ప్రశ్నించారు. ఈ ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అంబటి తాజాగా ఆరోపించిన విషయం తెలిసిందే.

News January 11, 2025

మరో పేషెంట్‌లో న్యూరాలింక్ చిప్ అమరిక విజయవంతం

image

ఎలాన్ మస్క్ సంస్థ న్యూరాలింక్ తయారుచేసిన చిప్‌ను మరో రోగి మెదడులో వైద్యులు విజయవంతంగా అమర్చగలిగారు. మస్క్ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘ఇప్పటి వరకూ ముగ్గురిలో చిప్‌ను విజయవంతంగా అమర్చాం. అందరిలోనూ చిప్స్ బాగా పనిచేస్తున్నాయి’ అని పేర్కొన్నారు. శరీరంపై నియంత్రణ కోల్పోయిన వారి మెదడులో చిప్ అమర్చి, దాని సాయంతో వారు ఎలక్ట్రానిక్ పరికరాలను నియంత్రించగలిగేలా న్యూరాలింక్ చిప్ పనిచేస్తుంది.

News January 11, 2025

దేశవ్యాప్తంగా 930 మందిని డిజిటల్ అరెస్ట్ చేసిన మాస్టర్‌మైండ్ అరెస్ట్!

image

డిజిటల్ అరెస్టు స్కామ్‌ మాస్టర్‌మైండ్స్‌లో ఒకరైన చిరాగ్ కపూర్‌ను కోల్‌కతా పోలీసులు బెంగళూరులో అరెస్టు చేసినట్టు NEWS18 తెలిపింది. అతడికి 930 కేసులతో సంబంధం ఉంది. మోసపోయిన దేబశ్రీ దత్తా Rs7.4L బదిలీ చేసిన JSFB A/C ద్వారా కూపీ లాగారు. ఆనంద్‌పూర్, పటౌలి, నరేంద్రపురి ప్రాంతాల్లో ఆఫీసులను గుర్తించి 104 passbooks, 61mobiles, 33 debit cards, 2QR code machines, 140sims, 40 seals స్వాధీనం చేసుకున్నారు.

News January 11, 2025

కొండపోచమ్మ సాగర్ ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

image

TG: <<15126886>>కొండపోచమ్మ సాగర్ ఘటనపై<<>> సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు గల్లంతవడంపై ఆయన అధికారులకు ఫోన్ చేసి కనుక్కున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకోవాలని, గజ ఈతగాళ్లను రంగంలోకి దించి మృతదేహాలను వెలికి తీయాలని ఆదేశించినట్లు సమాచారం. ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని సీఎం స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలంటున్నాయి.

News January 11, 2025

APPLY NOW: బ్యాంకులో 1,267 ఉద్యోగాలు

image

బ్యాంక్ ఆఫ్ బరోడాలోని పలు విభాగాల్లో 1,267 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 17 చివరితేదీ. ఆయా పోస్టులను బట్టి డిగ్రీ, PG, MBA, MCA, బీటెక్ చేసిన వారు అర్హులు. జనరల్, EWS, OBCలకు అప్లికేషన్ ఫీజు రూ.600, మిగతా వారికి రూ.100. ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం <>ఇక్కడ క్లిక్<<>> చేయండి.
వెబ్‌సైట్: https://www.bankofbaroda.in/

News January 11, 2025

బీఆర్ఎస్ రైతు మహాధర్నా వాయిదా

image

TG: BRS పార్టీ చేపట్టిన రైతు మహాధర్నా కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజల ప్రయాణాలు, తమ ధర్నాతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో ఈ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసింది. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు నల్గొండలో జరిగే కార్యక్రమంలో KTR సహా కీలక నేతలు పాల్గొనాల్సి ఉంది. పండుగ తర్వాత కొత్త తేదీని ఆ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది.

News January 11, 2025

27న తెలంగాణకు రాహుల్, ఖర్గే

image

TG: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ నెల 27న రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘సంవిధాన్ బచావో’ కార్యక్రమంలో వారు పాల్గొంటారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ తదితర కార్యక్రమాలను కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే.

News January 11, 2025

‘ఇన్ఫోసిస్‌కు రాజీనామా చేశా.. కారణాలు ఇవే’

image

Infosys పుణే క్యాంప‌స్‌లో సిస్టం ఇంజినీర్‌గా ప‌నిచేసే భూపేంద్ర ఉద్యోగానికి రిజైన్ చేయ‌డానికి చెప్పిన కార‌ణాలు వైర‌లవుతున్నాయి. *హైక్ లేని ప్ర‌మోష‌న్‌ *హైరింగ్ జ‌ర‌ప‌కుండా ఉన్న ఉద్యోగుల‌పైనే అధిక వ‌ర్క్‌లోడ్‌ *కెరీర్ గ్రోత్ లేక‌పోవ‌డం *టాక్సిక్ క్లైంట్ కల్చర్ *పని విషయంలో సీనియ‌ర్లు ప్రశంసించినా జీతాలు పెరగకపోవడం* ఆన్‌సైట్ పంపేవారిని మెరిట్ ఆధారంగా కాకుండా మాట్లాడే భాషా ప్రామాణికంగా ఎంపిక చేయడం.

News January 11, 2025

BREAKING: సంక్రాంతి రద్దీ.. సీఎం కీలక ఆదేశాలు

image

AP: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్సులు, రైళ్లు రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో రవాణాశాఖ అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు ప్రయాణికులను చేరవేసేందుకు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆయా బస్సులకు ముందుగా ఫిట్‌నెస్ టెస్టులను చేయాలన్నారు. ఎక్కడా ప్రయాణికులు ఇబ్బంది పడొద్దని స్పష్టం చేశారు.

News January 11, 2025

వెంకటేశ్‌గారితో 10, 12 సినిమాలు చేస్తానేమో: అనిల్ రావిపూడి

image

వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన 3వ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ నెల 14న రానున్న ఈ మూవీ ప్రమోషన్ల సందర్భంగా అనిల్ పలు విషయాలు పంచుకున్నారు. ‘ఇద్దరు లేడీస్ మధ్య వెంకటేశ్‌గారు ఇబ్బంది పడితే ఆ సినిమా పక్కా సూపర్ హిట్. మా సినిమాకు, సంక్రాంతికి సంబంధం ఉంది. అందుకే ఆ పేరు పెట్టాం. వెంకటేశ్‌గారితో నాకు మంచి అనుబంధం ఉంది. మున్ముందు ఓ 10, 12 సినిమాలు ఆయనతో చేస్తానేమో’ అని పేర్కొన్నారు.