News June 2, 2024

లోకల్ సర్వేలు మాకే అనుకూలం: సజ్జల

image

AP: ఎగ్జిట్ పోల్స్‌లో లోకల్ సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నేషనల్ సర్వేలు మాత్రమే కూటమికి ఆధిక్యం చూపిస్తున్నాయన్నారు. ‘ఎగ్జిల్ పోల్స్ గందరగోళానికి గురి చేస్తున్నాయి. మాకు సైలెంట్ ఓట్లు పడ్డాయి. ప్రజలంతా YCP వెంటే ఉన్నారు. కూటమి నేతలు కౌంటింగ్‌లో అవకతవకలకు పాల్పడే అవకాశం ఉంది. ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.

News June 2, 2024

విపక్షంలో కూర్చున్నా KCRకు జ్ఞానోదయం కలగలేదు: నారాయణ

image

తెలంగాణ సాధనలో ఎంతో మంది పాత్ర ఉన్నప్పటికీ పేటెంట్ రైట్స్ KCRకే దక్కాయని CPI జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గన్‌పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘పదేళ్లు పాలించిన KCR నీరు, నిధులు, నియామకాలు అందించడంలో విఫలమయ్యారు. రాష్ట్రాన్ని కాకుండా కుటుంబసభ్యులను అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు విపక్షంలో కూర్చున్నా ఆయనకు జ్ఞానోదయం కలగలేదు’ అని ఫైరయ్యారు.

News June 2, 2024

YouTubeలో మిస్టర్ బీస్ట్‌ రికార్డ్

image

అమెరికన్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్‌ (జిమ్మీ డొనాల్డ్‌సన్) అరుదైన ఘనత సాధించారు. 267M సబ్‌స్క్రైబర్‌లతో ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లున్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. T-సిరీస్ 266M సబ్‌స్క్రైబర్‌లతో 2వ స్థానంలో ఉంది. 2012లో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన మిస్టర్ బీస్ట్ వినూత్న వీడియోలు చేస్తూ ఆదరణ పొందారు. అతడి వీడియోలను కోట్లాది మంది వీక్షిస్తుండటంతో యూట్యూబ్​ ద్వారా రూ.వేల కోట్లు సంపాదిస్తున్నారు.

News June 2, 2024

రవితేజ, శ్రీలీల కాంబోలో మరో సినిమా?

image

రవితేజ, శ్రీలీల కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని భాను భోగవరపు డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం. భీమ్స్ మ్యూజిక్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈ నెల 11న జరగనున్నట్లు టాక్. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారట. రవితేజ, శ్రీలీల కలిసి ‘ధమాకా’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైనే కలెక్షన్లు రాబట్టింది.

News June 2, 2024

పవన్‌దే గెలుపన్న సర్వేలు.. ముద్రగడపై ట్రోలింగ్

image

AP: పిఠాపురంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని సర్వే సంస్థలు అంచనా వేయడంతో వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంపై ట్రోలింగ్ జరుగుతోంది. పవన్‌ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానంటూ గతంలో ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ జనసైనికులు పోస్టులు పెడుతున్నారు. ‘పెద్దాయన పేరు మరికొన్ని గంటల్లో పద్మనాభ రెడ్డిగా మారబోతుంది’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

News June 2, 2024

ఆకాంక్షలు నెరవేర్చేందుకే తెలంగాణ ఏర్పాటు: రాహుల్

image

TG: రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ హయాంలో లక్షలాది మంది ఆకాంక్షలను నెరవేర్చేలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాం. ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారికి నా నివాళులు. అందరికీ న్యాయం, సమానత్వం, సాధికారతను చేకూర్చాలనే ‘ప్రజా తెలంగాణ’ దార్శనికతకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది’ అని ఆయన ట్వీట్ చేశారు.

News June 2, 2024

మీ టైమ్ వృథా చేసుకోవద్దు: ప్రశాంత్ కిశోర్

image

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తన అంచనాల మేరకు వెలువడటంతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తొలిసారి Xలో స్పందించారు. ‘ఎన్నికలు, రాజకీయాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నప్పుడు నకిలీ జర్నలిస్టులు, స్వయం ప్రకటిత మేధావులు, నేతల పనికిమాలిన విశ్లేషణలు చూస్తూ మీ టైమ్ వేస్ట్ చేసుకోవద్దు’ అని రాసుకొచ్చారు. ఎన్నికల్లో BJPకి 300+ సీట్లు ఖాయమని, APలో కూటమిదే అధికారమని ఆయన పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.

News June 2, 2024

ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించిన KCR

image

TG: లోక్‌సభ ఫలితాల్లో BRSకు ఎన్ని సీట్లయినా రావొచ్చని ఆ పార్టీ అధినేత KCR అన్నారు. ‘ఇవాళ CM సొంత జిల్లాలోనే గెలిచాం. రాకేశ్ రెడ్డి కూడా గెలవబోతున్నారు. లోక్‌సభ సీట్లలో ఎన్ని వస్తాయో చూద్దాం. ఒకడు మనకు 11 వస్తాయన్నాడు. ఇంకొకడు ఒకటే వస్తదన్నాడు. మరొకడు 2-4 అన్నాడు. ఇదో పెద్ద గ్యాంబ్లింగ్ అయిపోయింది. మంచి ఫలితాలు వస్తాయని ఆశిద్దాం. 11 వస్తే పొంగిపోయేది లేదు. 2 వస్తే కుంగిపోయేది లేదు’ అని తెలిపారు.

News June 2, 2024

జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రొవిజినల్ కీ విడుదల

image

IIT, NITల్లో ప్రవేశాల కోసం మే 26న జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రొవిజినల్ ఆన్సర్ కీని IIT మద్రాస్ విడుదల చేసింది. విద్యార్థులు <>jeeadv.ac.in<<>> నుంచి ఆన్సర్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏవైనా అభ్యంతరాలుంటే రేపు సాయంత్రం 5 గంటల్లోపు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి. కాగా అడ్వాన్స్‌డ్ ఫలితాలు ఈ నెల 9న రిలీజవుతాయి. ఈ పరీక్షకు దాదాపు 2 లక్షల మంది హాజరైన విషయం తెలిసిందే.

News June 2, 2024

BREAKING: సిక్కింలో SKM విజయం

image

సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సిక్కిం క్రాంతికారీ మోర్చా(SKM) ఘన విజయం సాధించింది. 32 సీట్లకుగాను ఆ పార్టీ ఇప్పటికే 18 చోట్ల గెలిచి మేజిక్(17) ఫిగర్‌ను దాటేసింది. మరో 13 స్థానాల్లో లీడింగులో ఉంది. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ ఒక్క స్థానానికే పరిమితమైంది. BJP, కాంగ్రెస్ అభ్యర్థులు ఖాతా తెరవలేదు. SKM అధినేత ప్రేమ్ సింగ్ తమాంగ్ మరోసారి సీఎం పదవి చేపట్టడం ఖాయమైంది.