News June 2, 2024

BREAKING: అరుణాచల్‌లో బీజేపీ ఘన విజయం

image

అరుణాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తిరుగులేని మెజార్టీ దిశగా సాగుతోంది. అక్కడ 60 స్థానాలు ఉండగా, ఇప్పటికే మేజిక్ ఫిగర్(31) సీట్లను గెలుచుకుంది. మరో 14 స్థానాల్లో లీడింగులో ఉంది. దీంతో కమలం పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. NPP రెండు, PPA, ఇండిపెండెంట్ చెరో స్థానంలో విజయం సాధించారు. కాగా పోలింగ్‌కు ముందే 10 మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.

News June 2, 2024

ఆరా మస్తాన్ మరో లగడపాటి కాబోతున్నారా?

image

AP: అసెంబ్లీ ఎన్నికల్లో YCP గెలవబోతోందని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. 2 శాతం ఓట్ల ఆధిక్యంతో TDP కంటే YCP 20-25 సీట్లు ఎక్కువగా సాధించబోతోందని మస్తాన్ ప్రకటించారు. కానీ ఈ సర్వే పట్ల రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్ని సర్వేలూ కూటమి విజయం సాధిస్తుందని చెప్పగా మస్తాన్ ఒక్కరే YCPకి అనుకూలంగా ప్రకటించారు. దీంతో మస్తాన్ మరో లగడపాటి కాబోతున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News June 2, 2024

పెళ్లి చేసుకున్న క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్

image

టీమ్ ఇండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ ఓ ఇంటి వాడయ్యారు. తన స్నేహితురాలు – శృతి రంగనాథన్‌ను ఆయన వివాహమాడారు. బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. కాగా వెంకటేశ్ అయ్యర్ భారత్ తరఫున 9 టీ20లు, 2 వన్డేలు ఆడారు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇప్పటివరకు 50 మ్యాచులు ఆడి 1326 పరుగులు బాదారు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది.

News June 2, 2024

చరిత్ర సృష్టించిన అమెరికా క్రికెటర్

image

USA ఆటగాడు అరోన్ జోన్స్ టీ20 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించారు. టీ20 WCలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా జోన్స్ (10) రికార్డు నెలకొల్పారు. కెనడాతో జరిగిన మ్యాచులో ఆయన ఈ ఘనత సాధించారు. ఈ క్రమంలో విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (10 vs SA) సరసన నిలిచారు. అలాగే WC హిస్టరీలో సక్సెస్‌ఫుల్ ఛేజింగ్‌లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్ ఓపెనర్‌గా జోన్స్ (94*) నిలిచారు.

News June 2, 2024

జయశంకర్‌ను స్మరించుకోకుండా ఉండలేం: KCR

image

TG: ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణవాది అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ‘తెలంగాణ ఆవిర్భావం రోజు ఆయనను స్మరించుకోకుండా ఉండలేం. జయశంకర్ లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఆయన రాజీలేని పోరాటం చేశారు. ఏనాటికైనా కేసీఆర్ లాంటి నాయకుడు రాబోడా అనే ఆశతోనే ఉండేవాళ్లమని ఆయన తరచూ చెప్పేవారు. జయశంకర్ నా వెన్నంటే ఉండేవారు’ అంటూ ఆయనతో ఉన్న జ్ఞాపకాలను మాజీ సీఎం పంచుకున్నారు.

News June 2, 2024

ఇవాళ వరుస మీటింగ్స్‌తో మోదీ బిజీ

image

ఎన్నికలు ముగియడంతో PM మోదీ పాలనపై దృష్టిసారించారు. ఇవాళ మంత్రులు, అధికారులతో వరుస సమావేశాల్లో పాల్గొననున్నారు. తొలుత బెంగాల్‌లో రెమాల్ తుఫాను ప్రభావంపై సమీక్షిస్తారు. ఆ తర్వాత దేశంలో వడగాలులు, ప్రపంచ పర్యావరణ దినోత్సవ(జూన్ 5) సన్నాహాలు, ప్రభుత్వ 100 రోజుల కార్యక్రమాలపై రివ్యూ చేస్తారు. కొత్త ప్రభుత్వంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలపై ఆరా తీస్తారు.

News June 2, 2024

కఠిన సమయాల్లో పారిపోను.. ఎదుర్కొంటా: హార్దిక్ పాండ్య

image

IPLలో కెప్టెన్‌గా, ప్లేయర్‌గా పేలవ ప్రదర్శనపై హార్దిక్ పాండ్య స్పందించారు. T20WC ప్రాక్టీస్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచిన తర్వాత ఆయన మాట్లాడారు. ‘మనం ఎప్పుడూ యుద్ధం చేస్తూనే ఉండాలి. సాధించిన విజయాలను నేను సీరియస్‌గా తీసుకోను. వెంటనే మర్చిపోయి ముందుకెళ్తాను. అలాగే కఠిన పరిస్థితుల్లో పారిపోను. తలఎత్తుకుని వాటిని ఎదుర్కొంటాను. నా దృష్టి ఎప్పుడూ ఆటపైనే ఉంటుంది’ అని పేర్కొన్నారు.

News June 2, 2024

రాష్ట్ర ఏర్పాటులో వారి పాత్రలు ప్రముఖం: రేవంత్

image

తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ, మీరా కుమార్, సుష్మా స్వరాజ్‌ పాత్రలు ప్రముఖమైనవని దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘రాష్ట్రం ఏర్పడిందంటే మొట్టమొదటి త్యాగం అప్పటి UPA ఛైర్‌పర్సన్ సోనియా గాంధీది. లోక్‌సభ స్పీకర్‌గా మీరాకుమార్ సహకారం అందించారు. అప్పటి బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ లోక్‌సభలో సంపూర్ణ మద్దతు ఇచ్చి తెలంగాణ బిల్లు ఆమోదింపజేశారు’ అని రేవంత్ వివరించారు.

News June 2, 2024

ఎల్లుండి వైన్ షాపులు బంద్

image

TG: ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఈ నెల 4న రాష్ట్రంలో మద్యం షాపులు మూసివేయనున్నారు. 4న ఉదయం 6 గంటల నుంచి 5న ఉదయం 6 గంటల వరకు వైన్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు అధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మరోవైపు ఏపీలో కూడా ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఈ నెల 3, 4, 5 తేదీల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించనున్నారు.

News June 2, 2024

సర్వజ్ఞానులం అనే భ్రమలు మాకు లేవు: రేవంత్

image

TG: తమ పాలనలో తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘సర్వజ్ఞానులం అనే భ్రమలు మాకు లేవు. అందరి సలహాలు స్వీకరించి, చర్చించి ముందుకెళ్తాం. ప్రతిపక్షాలకు గౌరవం ఇచ్చాం. మా నిర్ణయాలు, లోటుపాట్ల సమీక్షకు అవకాశమిస్తున్నాం. పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగింది. ప్రజల సంపద గుప్పెడు మంది చేతుల్లోకి వెళ్లింది’ అని రేవంత్ వివరించారు.