News June 2, 2024

జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రొవిజినల్ కీ విడుదల

image

IIT, NITల్లో ప్రవేశాల కోసం మే 26న జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రొవిజినల్ ఆన్సర్ కీని IIT మద్రాస్ విడుదల చేసింది. విద్యార్థులు <>jeeadv.ac.in<<>> నుంచి ఆన్సర్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏవైనా అభ్యంతరాలుంటే రేపు సాయంత్రం 5 గంటల్లోపు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి. కాగా అడ్వాన్స్‌డ్ ఫలితాలు ఈ నెల 9న రిలీజవుతాయి. ఈ పరీక్షకు దాదాపు 2 లక్షల మంది హాజరైన విషయం తెలిసిందే.

News June 2, 2024

BREAKING: సిక్కింలో SKM విజయం

image

సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సిక్కిం క్రాంతికారీ మోర్చా(SKM) ఘన విజయం సాధించింది. 32 సీట్లకుగాను ఆ పార్టీ ఇప్పటికే 18 చోట్ల గెలిచి మేజిక్(17) ఫిగర్‌ను దాటేసింది. మరో 13 స్థానాల్లో లీడింగులో ఉంది. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ ఒక్క స్థానానికే పరిమితమైంది. BJP, కాంగ్రెస్ అభ్యర్థులు ఖాతా తెరవలేదు. SKM అధినేత ప్రేమ్ సింగ్ తమాంగ్ మరోసారి సీఎం పదవి చేపట్టడం ఖాయమైంది.

News June 2, 2024

ఇప్పుడు ఎన్నికలొస్తే BRSకు 105 సీట్లు వస్తాయంటున్నారు: KCR

image

TG: బీఆర్ఎస్‌ను మహావృక్షం, మహాసముద్రంగా ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ అభివర్ణించారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు సహజంగా నైరాశ్యం వస్తుంది. కానీ తర్వాత నేను బస్సు యాత్ర మొదలుపెడితే మళ్లీ అదే గర్జన కనిపించింది. ఇటీవల ఓ వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎన్నికలొస్తే 105 సీట్లు గెలుస్తామని చెప్పాడు. మనం డంబాచారాలు చెప్పలేదు. PR స్టంట్లు చేయలేదు. మళ్లీ గెలిచేది బీఆర్ఎస్సే’ అని KCR తెలిపారు.

News June 2, 2024

BREAKING: అరుణాచల్‌లో బీజేపీ ఘన విజయం

image

అరుణాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తిరుగులేని మెజార్టీ దిశగా సాగుతోంది. అక్కడ 60 స్థానాలు ఉండగా, ఇప్పటికే మేజిక్ ఫిగర్(31) సీట్లను గెలుచుకుంది. మరో 14 స్థానాల్లో లీడింగులో ఉంది. దీంతో కమలం పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. NPP రెండు, PPA, ఇండిపెండెంట్ చెరో స్థానంలో విజయం సాధించారు. కాగా పోలింగ్‌కు ముందే 10 మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.

News June 2, 2024

ఆరా మస్తాన్ మరో లగడపాటి కాబోతున్నారా?

image

AP: అసెంబ్లీ ఎన్నికల్లో YCP గెలవబోతోందని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. 2 శాతం ఓట్ల ఆధిక్యంతో TDP కంటే YCP 20-25 సీట్లు ఎక్కువగా సాధించబోతోందని మస్తాన్ ప్రకటించారు. కానీ ఈ సర్వే పట్ల రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్ని సర్వేలూ కూటమి విజయం సాధిస్తుందని చెప్పగా మస్తాన్ ఒక్కరే YCPకి అనుకూలంగా ప్రకటించారు. దీంతో మస్తాన్ మరో లగడపాటి కాబోతున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News June 2, 2024

పెళ్లి చేసుకున్న క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్

image

టీమ్ ఇండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ ఓ ఇంటి వాడయ్యారు. తన స్నేహితురాలు – శృతి రంగనాథన్‌ను ఆయన వివాహమాడారు. బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. కాగా వెంకటేశ్ అయ్యర్ భారత్ తరఫున 9 టీ20లు, 2 వన్డేలు ఆడారు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇప్పటివరకు 50 మ్యాచులు ఆడి 1326 పరుగులు బాదారు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది.

News June 2, 2024

చరిత్ర సృష్టించిన అమెరికా క్రికెటర్

image

USA ఆటగాడు అరోన్ జోన్స్ టీ20 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించారు. టీ20 WCలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా జోన్స్ (10) రికార్డు నెలకొల్పారు. కెనడాతో జరిగిన మ్యాచులో ఆయన ఈ ఘనత సాధించారు. ఈ క్రమంలో విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (10 vs SA) సరసన నిలిచారు. అలాగే WC హిస్టరీలో సక్సెస్‌ఫుల్ ఛేజింగ్‌లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్ ఓపెనర్‌గా జోన్స్ (94*) నిలిచారు.

News June 2, 2024

జయశంకర్‌ను స్మరించుకోకుండా ఉండలేం: KCR

image

TG: ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణవాది అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ‘తెలంగాణ ఆవిర్భావం రోజు ఆయనను స్మరించుకోకుండా ఉండలేం. జయశంకర్ లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఆయన రాజీలేని పోరాటం చేశారు. ఏనాటికైనా కేసీఆర్ లాంటి నాయకుడు రాబోడా అనే ఆశతోనే ఉండేవాళ్లమని ఆయన తరచూ చెప్పేవారు. జయశంకర్ నా వెన్నంటే ఉండేవారు’ అంటూ ఆయనతో ఉన్న జ్ఞాపకాలను మాజీ సీఎం పంచుకున్నారు.

News June 2, 2024

ఇవాళ వరుస మీటింగ్స్‌తో మోదీ బిజీ

image

ఎన్నికలు ముగియడంతో PM మోదీ పాలనపై దృష్టిసారించారు. ఇవాళ మంత్రులు, అధికారులతో వరుస సమావేశాల్లో పాల్గొననున్నారు. తొలుత బెంగాల్‌లో రెమాల్ తుఫాను ప్రభావంపై సమీక్షిస్తారు. ఆ తర్వాత దేశంలో వడగాలులు, ప్రపంచ పర్యావరణ దినోత్సవ(జూన్ 5) సన్నాహాలు, ప్రభుత్వ 100 రోజుల కార్యక్రమాలపై రివ్యూ చేస్తారు. కొత్త ప్రభుత్వంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలపై ఆరా తీస్తారు.

News June 2, 2024

కఠిన సమయాల్లో పారిపోను.. ఎదుర్కొంటా: హార్దిక్ పాండ్య

image

IPLలో కెప్టెన్‌గా, ప్లేయర్‌గా పేలవ ప్రదర్శనపై హార్దిక్ పాండ్య స్పందించారు. T20WC ప్రాక్టీస్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచిన తర్వాత ఆయన మాట్లాడారు. ‘మనం ఎప్పుడూ యుద్ధం చేస్తూనే ఉండాలి. సాధించిన విజయాలను నేను సీరియస్‌గా తీసుకోను. వెంటనే మర్చిపోయి ముందుకెళ్తాను. అలాగే కఠిన పరిస్థితుల్లో పారిపోను. తలఎత్తుకుని వాటిని ఎదుర్కొంటాను. నా దృష్టి ఎప్పుడూ ఆటపైనే ఉంటుంది’ అని పేర్కొన్నారు.