News June 2, 2024

మేలో ₹20.45L Cr యూపీఐ లావాదేవీలు

image

UPI లావాదేవీల్లో సరికొత్త రికార్డు నమోదైంది. మేలో ₹20.45L Cr విలువైన 14.4 బిలియన్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఏప్రిల్‌లో అత్యధికంగా ₹19.64L Cr విలువైన 13.3 బిలియన్ల లావాదేవీలు జరగగా, ఇప్పుడు ఆ రికార్డు బ్రేకయ్యింది. ఏప్రిల్‌లో ప్రతి రోజూ ₹65,482 కోట్ల విలువైన 443 మిలియన్ల ట్రాన్సాక్షన్స్ జరగగా, మేలో ₹65,966 కోట్ల విలువైన 453 మిలియన్ల లావాదేవీలు నమోదయ్యాయి.

News June 2, 2024

ముగిసిన గడువు.. ఇవాళ జైలుకి కేజ్రీవాల్

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ జైల్లో లొంగిపోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తిహార్ జైలుకు వెళ్తారు. లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కేజ్రీవాల్‌ లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆ గడువు ఇవాళ్టితో ముగిసింది. మరోవైపు ఢిల్లీ కోర్టులో ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పు జూన్ 5న రానుంది.

News June 2, 2024

‘SSMB 29’లో మహేశ్ సరసన జాన్వీ?

image

మహేశ్ బాబు హీరోగా ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ రాజమౌళి జాన్వీ కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మహేశ్ సరసన జాన్వీనే కరెక్ట్ జోడీ అని ఆయన భావిస్తున్నట్లు టాక్. ఈ మూవీలో మరో హీరోయిన్‌గా చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.

News June 2, 2024

దేశానికి తెలంగాణ దిక్సూచిగా కొనసాగాలి: KTR

image

TG: స్వరాష్ట్ర కలను సాకారం చేసుకొని దశాబ్దం గడిచిన సందర్భం ఇదని KTR ట్వీట్ చేశారు. ‘బక్కపలచని, ఉక్కు సంకల్పం కలిగిన KCR పోరాట ఫలితమిది. అమరవీరుల ప్రాణత్యాగాల పునాదులపై ఏర్పడిన కొత్త రాష్ట్రం మనది. పాలన చేతకాదంటూ వెక్కిరించిన వాళ్లే మనసు నిండా ప్రశంసించిన దశాబ్దమిది. నాడు కరవు. నేడు సుభిక్షమైన కోటి రతనాల వీణ. ఇదే సంకల్పంతో దేశానికి తెలంగాణ దిక్సూచిగా కొనసాగాలని కాంక్షిస్తున్నా’ అని రాసుకొచ్చారు.

News June 2, 2024

హైదరాబాద్‌తో తెగిపోయిన ఏపీ బంధం 1/2

image

AP: రాష్ట్ర విభజన జరిగి ఇవాళ్టికి పదేళ్లు గడిచాయి. 2 తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌తో AP బంధం ముగిసింది. ఇక హైదరాబాద్ పూర్తిగా తెలంగాణకే సొంతం కానుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన ఆస్తులన్నింటినీ తెలంగాణకు అప్పగించారు. కానీ ఇప్పటికీ విభజన సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. కృష్ణ, గోదావరి జలాలు, ఆస్తుల పంపిణీ వివాదాలు, ఉద్యోగుల కేటాయింపు వంటి సమస్యలు ఉన్నాయి.

News June 2, 2024

హైదరాబాద్‌తో తెగిపోయిన ఏపీ బంధం 2/2

image

AP: 2014లో రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించింది. కానీ ఏపీ మాత్రం 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించుకుంది. అప్పటి సీఎం చంద్రబాబు హైదరాబాద్ విడిచిపెట్టి వెళ్లారు. తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. కానీ మరో పదేళ్లు హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు.

News June 2, 2024

ఏపీలో జగనే మళ్లీ సీఎం: మంత్రి కోమటిరెడ్డి

image

TG: ఏపీ CMగా జగన్ రెండోసారి పదవి చేపట్టడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఆ రాష్ట్రంలోని తన స్నేహితులు, బంధువుల సమాచారం మేరకు జగన్‌కే అవకాశం ఉందన్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే చెబుతున్నాయని పేర్కొన్నారు. డిచ్‌పల్లిలో మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల్లో BRSకు ఒక్క సీటూ రాదని జోస్యం చెప్పారు. కాగా ఈసారి AP ఓటర్ల నాడి తెలియట్లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

News June 2, 2024

అదిరే ఆరంభం.. కెనడా భారీ స్కోర్

image

టీ20 వరల్డ్ కప్‌కు కెనడా జట్టు చక్కటి శుభారంభాన్నిచ్చింది. అమెరికాతో జరుగుతున్న టోర్నీ తొలి మ్యాచ్‌లో కెనడా 194/5 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు ప్లేయర్లు అద్భుతమైన షాట్లతో అభిమానులను అలరించారు. నవ్‌నీత్ ధాలీవాల్(61), నికోలస్ కిర్టన్(51) హాఫ్ సెంచరీలతో మెరిశారు. శ్రేయస్ మొవ్వ(32*), జాన్సన్(23) పర్వాలేదనిపించారు. అటు USA బౌలర్లలో అలీఖాన్, హర్మీత్ సింగ్, కోరీ అండర్సన్ తలో వికెట్ తీశారు.

News June 2, 2024

క్షణికావేశం.. కుమారుడిని కాల్చేసిన కానిస్టేబుల్

image

AP: ఓ కానిస్టేబుల్ క్షణికావేశంలో కన్నబిడ్డనే కాల్చేసిన ఘటన ఒంగోలులో జరిగింది. APSP కానిస్టేబుల్ కొదముల ప్రసాద్‌ EVM గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు శేష్ కమల్(20) నిన్న రాత్రి తండ్రిని బైక్‌పై తీసుకెళ్లి గోడౌన్ వద్ద వదిలాడు. అనంతరం జీతం డబ్బుల్లో నుంచి రూ.20వేలు ఇవ్వాలని కొడుకు అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రసాద్ తుపాకీతో కాల్చడంతో కొడుకు స్పాట్‌లోనే మరణించాడు.

News June 2, 2024

ODI క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌ అవార్డు అందుకున్న కోహ్లీ

image

ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌ 2023 అవార్డును టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ట్రోఫీ, క్యాప్‌ను ICC ఆయనకు బహూకరించింది. కాగా కోహ్లీ 2023లో వన్డేల్లో అదరగొట్టారు. 27 మ్యాచ్‌లు ఆడి 72.47 యావరేజ్‌తో 1,377 పరుగులు చేశారు. ఇందులో 6 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆ ఏడాదిలో కోహ్లీ అత్యుత్తమ స్కోరు 166*. వన్డే WCలో ఏకంగా 11 మ్యాచుల్లోనే 765 పరుగులు బాదారు.