News June 2, 2024

T20WC: భారత్ చేతిలో బంగ్లా చిత్తు

image

టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన టీమ్ఇండియా 8 వికెట్లు పడగొట్టి బంగ్లా‌ను 122 పరుగులకే కట్టడి చేసింది. బ్యాటర్లలో పంత్ 53(32), SKY 31(18), హార్దిక్ 40*(23) రాణించారు. అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే చెరో రెండు వికెట్లు పడగొట్టగా బూమ్రా, అక్షర్, హార్దిక్, సిరాజ్ చెరొక వికెట్ తీశారు.

News June 2, 2024

మే నెలలో రూ.1.73 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

image

మే నెలలో జీఎస్టీ వసూళ్లు భారీగా నమోదయ్యాయి. రూ.1.73 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. గతేడాదితో పోలిస్తే ఇది 10 శాతం అధికం. మే నెలలో దిగుమతులు క్షీణించినా దేశీయంగా లావాదేవీలు 15.3 శాతం పెరగడం కలిసొచ్చాయి. మొత్తం వసూళ్లలో సీజీఎస్టీ వాటా రూ.32409 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ.40,265 కోట్లు, ఐజీఎస్టీ రూ.87,781 కోట్లు కాగా సెస్సుల రూపంలో రూ.12,284 కోట్లు వచ్చింది.

News June 1, 2024

ప‘వార్’లో సుప్రియాదే పైచేయి!

image

మహారాష్ట్రలోని బారామతిలో సుప్రియా సూలే తన వదిన సునేత్రా పవార్‌పై గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. శరద్ పవార్ వర్గంలోని NCP నుంచి సుప్రియ పోటీ చేయగా.. అజిత్ పవార్ నేతృత్వంలోని NCP నుంచి సునేత్రా బరిలోకి దిగారు. గతంలో శరద్ పవార్ చేతుల్లో ఉన్న NCPని అజిత్ పవార్ హస్తగతం చేసుకోగా.. ఎన్నికల సంఘం కూడా అజిత్‌కే మద్దతిచ్చింది. దీంతో సుప్రియా, సునేత్రా మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.

News June 1, 2024

కూటమిదే అధికారం: బిగ్ టీవీ సర్వే

image

ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని తెలుగు మీడియా సంస్థ బిగ్ టీవీ అంచనా వేసింది. 175 అసెంబ్లీ స్థానాల్లో NDA కూటమి 106-119 చోట్ల విజయం సాధిస్తుందని, వైసీపీ 56-69 సీట్లకే పరిమితం అవుతుందని ప్రకటించింది. ఇక లోక్‌సభ సీట్లలో కూటమి 17-18, YCP 7-8 స్థానాల్లో గెలుస్తాయని వెల్లడించింది.

News June 1, 2024

INDIA TODAY: కేంద్రపాలిత ప్రాంతాల్లో అంచనాలు ఇలా..

image

జమ్ము-కశ్మీర్(5సీట్లు): ఎన్డీఏ-2, నేషనల్ కాన్ఫరెన్స్-3, ఇండియా-0
లడక్(ఒక సీటు): ఇండియా కూటమి-1
దాద్రా నగర్ హవేలి&డామన్ డయ్యూ(2 సీట్లు): ఎన్డీఏ: 2, ఇండియా కూటమి: 0
అండమాన్ నికోబార్(1సీటు): ఎన్డీఏ- 1
లక్షద్వీప్(ఒక సీటు): కాంగ్రెస్-1
పుదుచ్చేరి(ఒక సీటు): ఇండియా కూటమి-1

News June 1, 2024

టెన్షన్ పెడుతున్న ఏపీ ఎగ్జిట్ పోల్స్

image

ఏపీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఓటర్లను మరింత ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. కొన్ని సర్వేలు TDPకి, మరికొన్ని YCPకి అధికారం దక్కుతుందని అంచనా వేశాయి. ఇరు పక్షాల మధ్య కొన్ని సర్వేల్లో 2శాతం ఓటింగ్ మాత్రమే తేడా ఉండటంతో అధికారం ఎవరికి దక్కుతుందనే టెన్షన్ పార్టీలు, ప్రజల్లో నెలకొంది. విజయం ఎవరిదనేది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాలి. రౌండ్ రౌండ్‌కు టెన్షన్ పెంచేలా కౌంటింగ్ ఉండొచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా.

News June 1, 2024

కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్

image

TG: రాష్ట్ర అవతరణ దినోత్సవంపై కేసీఆర్‌కు <<13357281>>గౌరవం<<>> లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘అమరవీరుల విషయంలో కమిటీ వేసి న్యాయం చేస్తాం. అమరులను గుర్తించేందుకు సమాచారం తెప్పిస్తున్నాం. వాళ్ల ఆనవాళ్లంటే కేసీఆర్‌కు ఎందుకంత ద్వేషం?’ అని ప్రశ్నించారు. సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తామని వెల్లడించారు.

News June 1, 2024

ICUలో చేరిన D.శ్రీనివాస్

image

TG: కాంగ్రెస్ సీనియర్ లీడర్ డి.శ్రీనివాస్ అనారోగ్యంతో ICUలో చేరారు. ఆయనను మూత్ర సంబంధిత సమస్య వల్ల ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆయన తనయుడు, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వెల్లడించారు. తన తండ్రి కోసం ప్రార్థించాలని సోషల్ మీడియా వేదికగా అనుచరులను కోరారు. ఇటీవల కొంతకాలంగా శ్రీనివాస్‌ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

News June 1, 2024

T20 వరల్డ్‌కప్‌లో భారత్ మ్యాచ్‌లు

image

☞ జూన్ 5- భారత్* ఐర్లాండ్
☞ జూన్ 9- భారత్* పాకిస్థాన్
☞ జూన్ 12- భారత్* USA
☞ జూన్ 15- భారత్* కెనడా
☞ ☞ అన్ని మ్యాచ్‌లు భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతాయి.

News June 1, 2024

రేపటి నుంచే T20 వరల్డ్‌కప్

image

T20 వరల్డ్‌కప్ జూన్ 2 నుంచి USA, వెస్టిండీస్ వేదికగా ప్రారంభం కానుంది. 4 గ్రూపుల్లో ఉన్న 20 జట్లలో ఒక్కో గ్రూపు నుంచి టాప్-2 జట్లు సూపర్-8కు చేరుకుంటాయి. 8 జట్లు 4 చొప్పున 2 గ్రూపులుగా తలపడతాయి. ఆ గ్రూపుల్లోని టాప్-2 జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి. జూన్ 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రేపు తొలి మ్యాచ్ USA, కెనడా మధ్య రాత్రి 6కి స్టార్ట్ అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానల్, డిస్నీ+హాట్‌స్టార్‌లో చూడొచ్చు.