News May 30, 2024

స్కూళ్లలో స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్

image

AP: రాష్ట్రంలోని 352 KGBVలు, 50 రెసిడెన్షియల్ స్కూళ్లలో 9వ తరగతి విద్యార్థులకు ‘స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌’ను విద్యాశాఖ అమలు చేయనుంది. ఇందులో భాగంగా విద్యార్థులను వివిధ ప్రాంతాల్లోని స్కూళ్లకు కొద్దిరోజులు పంపుతుంది. కొత్త విద్యార్థులతో మాట్లాడటం, విద్యావిధానాలను తెలుసుకోవడం ద్వారా వారి ఆలోచనా పరిధి పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌కు జూన్ 15 నుంచి దరఖాస్తులు మొదలవుతాయి.

News May 30, 2024

మోదీ ధ్యానం ఎన్నికల కోడ్ ఉల్లంఘనే: విపక్షాలు

image

కన్యాకుమారిలో ప్రధాని <<13340790>>మోదీ<<>> ధ్యానం ‘ఎన్నికల కోడ్’ ఉల్లంఘనే అని విపక్షాలు ఆరోపించాయి. చివరి దశ పోలింగ్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉందని మండిపడ్డాయి. ఈ కార్యక్రమాన్ని టీవీలు, ఇతర మాధ్యమాల్లో ప్రసారం కాకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు ఈసీని కోరాయి. కావాలంటే జూన్ 1న సాయంత్రం నుంచి ధ్యానం చేసుకోవాలన్నాయి. ప్రధాని కార్యక్రమంపై ఎలాంటి నిషేధం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

News May 30, 2024

T20 WC: టాప్-5 రన్ స్కోరర్స్

image

☛ విరాట్ కోహ్లీ (ఇండియా) -1141 (25 ఇన్నింగ్స్)
☛ జయవర్దనే (శ్రీలంక) -1016 (31 ఇన్నింగ్స్)
☛ క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 965 (31 ఇన్నింగ్స్)
☛ రోహిత్ శర్మ(ఇండియా) – 963 (36 ఇన్నింగ్స్)
☛ దిల్షాన్ (శ్రీలంక) – 897 (34 ఇన్నింగ్స్)

News May 30, 2024

నేడు కేరళకు నైరుతి రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణకు ఎప్పుడంటే?

image

నైరుతి రుతుపవనాలు నేడు కేరళను తాకుతాయని IMD అంచనా వేసింది. రాబోయే 3, 4 రోజుల్లో AP, TGలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. APలో ఇవాళ పొడి వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, పల్నాడు, NLR, ప్రకాశం, నంద్యాల, YSR, అన్నమయ్య, TPT, శ్రీ సత్యసాయి, అల్లూరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News May 30, 2024

PHOTO: వృద్ధురాలికి పాదాభివందనం చేసిన మోదీ

image

ఒడిశాలోని కేంద్రపరాలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఓ వృద్ధురాలికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఫొటోను బీజేపీ ట్వీట్ చేస్తూ.. ‘నేను మీ సేవకుడ్ని, మీ కుమారుడిని’ అని పోస్ట్ చేసింది. దేశం మొత్తం మూడోసారి మోదీ సర్కార్‌ను తీసుకొచ్చేందుకు నిర్ణయించిందని పేర్కొంది.

News May 30, 2024

యుద్ధం మరో ఏడు నెలలు కొనసాగవచ్చు: ఇజ్రాయెల్

image

హమాస్ లక్ష్యంగా గాజాలో చేస్తున్న దాడులు మరో ఏడు నెలలు కొనసాగవచ్చని ఇజ్రాయెల్ హెచ్చరించింది. హమాస్ మిలిటరీనీ, వారి ప్రభుత్వ సామర్థ్యాన్ని ధ్వంసం చేయాలనే లక్ష్యాన్ని అందుకుంటామని పేర్కొంది. ఇప్పటికే రఫాపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. మరోవైపు యుద్ధం ఆపాలని ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతుండగా నిన్న రఫాలో ఇజ్రాయెల్ ట్యాంకర్లు కనిపించడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది.

News May 30, 2024

హాలీవుడ్ ‘గాడ్ ఫాదర్’ నిర్మాత కన్నుమూత

image

హాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఆల్బర్ట్ S.రడ్డీ(94) లాస్ ఏంజెలిస్‌లో కన్నుమూశారు. 1965లో వైల్డ్ సీడ్ సినిమాతో ఆయన నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 1972లో ఐకానిక్ ఫిల్మ్ ‘గాడ్‌ఫాదర్’తో ఆల్బర్ట్ పేరు మారుమోగింది. ఉత్తమ చిత్రం విభాగంలో అది ఆస్కార్ అవార్డును అందుకుంది. అలాగే 2004లో విడుదలైన ఆస్కార్ విన్నింగ్ మూవీ ‘మిలియన్ డాలర్ బేబీ’కి కూడా ఆయన ఓ నిర్మాత. అనేక టీవీ సిరీస్‌లు, మూవీలను ఆయన నిర్మించారు.

News May 30, 2024

నేటితో ముగియనున్న ప్రచారపర్వం

image

లోక్‌సభ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఇప్పటికే ఆరు దశల పోలింగ్ పూర్తవ్వగా, ఏడో దశ జూన్ 1న జరగనుంది. చివరి దశలోనే ప్రధాని మోదీ పోటీ చేసే వారణాసి ఉండటం గమనార్హం. నేడు ఒడిశాలోని భద్రలోక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, TG డిప్యూటీ సీఎం భట్టి ప్రచారం నిర్వహించనున్నారు. జూన్ 1న పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్ సర్వేలు వెలువడే అవకాశం ఉంది. 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

News May 30, 2024

కోతల్లేకుండా విద్యుత్ సరఫరా: డిస్కంల సీఎండీ

image

AP: ఫీడర్లలో సాంకేతిక సమస్యతో పలుచోట్ల గంటల తరబడి విద్యుత్ సరఫరా <<13335123>>నిలిచిపోయిందంటూ<<>> వచ్చిన వార్తలను 2 డిస్కంల CMD సంతోషరావు ఖండించారు. డిమాండ్ పెరిగినప్పటికీ నిరంతరాయంగా విద్యుత్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడటం, సబ్ స్టేషన్లపై పిడుగుల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి పలు చోట్ల 23-45 నిమిషాలే సరఫరా నిలిపివేశామన్నారు.

News May 30, 2024

నేడు ఐసెట్, ఈసెట్ ఫలితాలు

image

AP: నేడు ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉ.11 గంటలకు అనంతపురం JNTUలో రిజల్ట్స్ విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ సెకండియర్‌లో ప్రవేశానికి ఈసెట్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్లకు ఐసెట్ నిర్వహిస్తారు. మే 6 ఐసెట్, 8న ఈసెట్ నిర్వహించారు.