India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. 19న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కాగా నెలాఖరు వరకు సమావేశాలు సాగే అవకాశం ఉంది. ఇందులోనే బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై చర్చించనున్నారు. ఇవాళ బీఆర్ఎస్ చీఫ్ KCR సభకు హాజరుకానున్నారు.

WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆడిన మూడు సీజన్లలోనూ ఫైనల్ చేరిన ఏకైక జట్టుగా నిలిచింది. గత రెండు సీజన్లలో ఫైనల్ చేరినా విజేతగా నిలవడంలో విఫలమైంది. దీంతో ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలని ఆ జట్టు ఉవ్విళ్లూరుతోంది. తొలి సీజన్లో ముంబై, రెండో సీజన్లో బెంగళూరు విజేతలుగా నిలిచాయి. రేపు ముంబై, గుజరాత్ మధ్య జరిగే ఎలిమినేటర్‌లో విజేతతో ఢిల్లీ ఈ నెల 15న అమీతుమీ తేల్చుకోనుంది.

AP: రాష్ట్రంలోని 19 మండలాల్లో నేడు తీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఉంగుటూరు, ఉయ్యూరు, పార్వతీపురం, బలిజపేట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి, జియమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, పాలకొండ, కురుపాం, సీతంపేట, వీరఘట్టం, బూర్జ , లక్ష్మీనరసుపేట, హీరా, బొబ్బిలి, వంగర మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే 180 మండలాల్లో వడగాలులు వీస్తాయని వెల్లడించింది.

TG: జూనియర్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లుగా ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రవీంద్రభారతిలో నియామక పత్రాలు అందజేయనున్నారు. జేఎల్ పోస్టుల భర్తీకి 2023లో పరీక్షలు నిర్వహించగా గత ఏడాది ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టులకు 2023లోనే పరీక్షలు నిర్వహించారు. JLగా 1,290, పాలిటెక్నిక్ లెక్చరర్లుగా 240 మంది ఎంపికైనట్లు అధికారులు తెలిపారు.

డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే అరుదైన మైలురాయిని చేరుకుంది. ఏకంగా 60 కోట్ల వినియోగదారులు రిజిస్టర్ అయినట్లు సంస్థ తెలిపింది. ఐపీఓకు రానున్న సమయంలో ఈ మైలురాయిని చేరుకోవడం గర్వంగా ఉందని ఫోన్‌పే కో-ఫౌండర్, సీఈవో సమీర్ నిగమ్ తెలిపారు. ఎప్పటికప్పుడూ వినియోగదారుల అవసరాలను తీర్చడానికి పనిచేస్తామని ఆయన చెప్పారు. కాగా ఫోన్‌పేను 2016లో లాంచ్ చేశారు.

ప్రస్తుతం టీమ్ ఇండియా అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉందని, ప్రపంచ క్రికెట్ మొత్తం ఒక జట్టుగా ఏర్పడినా ఆ టీమ్‌ను ఓడించలేరని పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది అన్నారు. ‘భారత జట్టు నిండా మ్యాచ్ విన్నర్లే. జట్టులోని ప్రతి ఒక్కరూ టాప్ ఫామ్‌లో ఉన్నారు. ప్రస్తుతం టీమ్ ఇండియాను ఓడించడం ఏ జట్టుకైనా పెద్ద సవాలే. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడానికి వారు పూర్తి అర్హులే. భారత్‌కు నా శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.

TG: అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ హామీల అమలుపై బీజేపీ ప్రశ్నిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలైనా 6 గ్యారంటీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. కొత్త ప్రాజెక్టులకు రూ.1.5 లక్షల కోట్లు కావాలని కేంద్రానికి లేఖ రాయడం నవ్వులాటగా ఉందన్నారు. ఆర్థిక వనరులకు అనుగుణంగా కార్యాచరణ ఉండాలని సూచించారు.

* 1930: దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ ఘట్టమైన దండి యాత్ర ప్రారంభం
* 1962: ఉమ్మడి ఏపీ మూడవ ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి ప్రమాణ స్వీకారం
* 1993: ముంబైలో వరుస బాంబు పేలుళ్లు, 257 మంది దుర్మరణం
* 2011: YSR కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం
* 1968: మారిషస్ స్వాతంత్ర్య దినోత్సవం

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

నితిన్, శ్రీలీల జంటగా నటించిన ‘రాబిన్‌హుడ్’ మూవీపై ఆ చిత్ర డైరెక్టర్ వెంకీ కుడుముల ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ప్రమోషన్లకు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ హాజరవుతారని తెలిపారు. ‘ఈ సినిమా టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. త్వరలో ట్రైలర్ కూడా విడుదల చేస్తాం. ఇందులో గెస్ట్ రోల్ పోషించేందుకు ముందుకొచ్చిన వార్నర్‌కు కృతజ్ఞతలు’ అని చెప్పుకొచ్చారు.
Sorry, no posts matched your criteria.