News March 8, 2025

పోసానికి రిమాండ్.. అన్ని ప్రాంతాలకు తిప్పుతున్నారని ఆవేదన

image

AP: పోసాని కృష్ణమురళికి విజయవాడ చీఫ్ మెట్రో పాలిటన్ కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. తనపై అక్రమంగా కేసు పెట్టారని పోసాని న్యాయాధికారికి చెప్పారు. ఒకే రకమైన కేసులతో అన్ని ప్రాంతాలకు తిప్పుతున్నారని, తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని తెలిపారు. కాగా ఈ ఉదయం పీటీ వారెంట్‌తో పోసానిని కర్నూలు నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. తాజాగా రిమాండ్ విధించడంతో ఆయనను తిరిగి కర్నూలు జైలుకు తరలించనున్నారు.

News March 8, 2025

CBI ఎంట్రీ.. స్మగ్లర్ నటికి మరిన్ని చిక్కులు!

image

విదేశాల నుంచి విమానాశ్రయాల ద్వారా బంగారం తరలిస్తున్న స్మగ్లర్లపై CBI FIR నమోదు చేసింది. కన్నడ నటి రన్యా రావ్ అరెస్టు నేపథ్యంలో మొత్తం నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే బెంగళూరు, ముంబై ఎయిర్‌పోర్టులకు వెళ్లిన CBI బృందాలు DRI సహకారంతో దర్యాప్తు ఆరంభించాయి. గ్లోబల్ గోల్డ్ స్మగ్లింగులో రన్యాను భాగస్వామిగా అనుమానిస్తున్న సంస్థలు ఆమె నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.

News March 8, 2025

వేసవిలో వణికిస్తున్న చలి!

image

తెలుగు రాష్ట్రాల్లో చలి విజృంభిస్తోంది. మార్చి మొదటి నుంచి ఎండలు దంచికొడతాయని వాతావరణ శాఖ చెప్పినా ఏపీ, టీజీలో భిన్న వాతావరణం నెలకొంది. పగలు ఎండ కొడుతుండగా రాత్రి అయిందంటే విపరీతమైన చలి ఉంటోంది. ముఖ్యంగా గ్రామాల్లో ఉదయం వరకు చల్లటి వాతావరణం ఉండటంతో ప్రజలు స్వెటర్లు ధరించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎండలు పెరగడం అటుంచితే చలికాలం ఇంకా అయిపోలేదని అర్థమవుతోంది.

News March 8, 2025

మహిళలకు ప్రతినెల రూ.2,500.. ఎక్కడంటే?

image

మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రజలకు సీఎం రేఖాగుప్తా శుభవార్త తెలిపారు. ‘మహిళా సమృద్ధి యోజన’ పథకాన్ని క్యాబినెట్ ఆమోదించినట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రతినెల స్త్రీలకు రూ.2,500 ఇవ్వనున్నారు. వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల వరకు ఉన్న 18-60 ఏళ్ల మహిళలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. దీనిద్వారా ఏటా రూ.5,100 కోట్ల భారం పడనుంది త్వరలోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించి, ప్రత్యేక పోర్టల్ తీసుకురానున్నారు.

News March 8, 2025

ఆ బాలీవుడ్ హీరోలకు వినియోగదారుల ఫోరం నోటీసులు

image

విమల్ పాన్ మసాలా యాడ్‌లో నటించిన షారుఖ్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌కు జైపూర్‌లోని జిల్లా వినియోగదారుల సమస్యల పరిష్కార ఫోరం నోటీసులు జారీ చేసింది. ఆ యాడ్‌లో ప్రతి గింజలో కుంకుమ పువ్వు బలం అని ప్రచారం చేసే సంగతి తెలిసిందే. ఇది తప్పుడు ప్రచారమని, కుంకుమపువ్వు లేనేలేదని ఆరోపిస్తూ యోగేంద్ర సింగ్ అనే వ్యక్తి ఫోరంను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే మార్చి 19న తమ ముందు హాజరుకావాలని ఫోరం వారిని ఆదేశించింది.

News March 8, 2025

మహిళలు ఒక మర్డర్ చేసేందుకు ఇమ్యూనిటీ కల్పించండి: NCP SP

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు NCP SP మహిళా విభాగం చేసిన విజ్ఞప్తి చర్చనీయాంశంగా మారింది. ఒక హత్య చేసినా మహిళలకు శిక్ష పడకుండా రక్షణ కల్పించాలని ఆ శాఖ ప్రెసిడెంట్ రోహిణి ఖడ్సే కోరారు. ‘స్త్రీలందరి తరఫున మేం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఒక మర్డర్ చేసేందుకు మాకు ఇమ్యూనిటీ కల్పించండి. అణచివేత వైఖరి, రేపిస్టు మైండ్‌సెట్, చైతన్యం లేని శాంతిభద్రతల పరిస్థితిని స్త్రీలు చంపాలని భావిస్తున్నారు’ అని లేఖ రాశారు.

News March 8, 2025

15వ రోజు.. ఇప్పటికీ లభించని ఆచూకీ

image

SLBC టన్నెల్‌లో 8 మంది కార్మికులు చిక్కుకొని ఇవాళ్టికి 15 రోజులు అవుతోంది. అత్యంత కఠిన పరిస్థితుల మధ్య శతవిధాలా ప్రయత్నిస్తున్నా ఇప్పటివరకు వారి ఆచూకీ లభించలేదు. నిన్నటి నుంచి కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్‌ను రంగంలోకి దించారు. బెల్జియన్ మాలినోస్ జాతికి చెందిన ఈ శునకాలు 15మీటర్ల లోతులో ఉన్న మానవ అవశేషాలను కూడా గుర్తించగలవు. దీంతో అధికారులు ఆశలన్నీ వీటిపైనే పెట్టుకున్నారు.

News March 8, 2025

CT ఫైనల్‌లో భారత్ టాస్ గెలవకూడదు: అశ్విన్

image

రేపు న్యూజిలాండ్‌తో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ టాస్ గెలవకూడదని మాజీ స్పిన్నర్ అశ్విన్ వ్యాఖ్యానించారు. ‘భారత్ వరసగా 11 మ్యాచుల్లో టాస్ ఓడింది. అయినప్పటికీ చక్కటి ప్రదర్శన కొనసాగిస్తోంది. మొదట బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా బాగా ఆడుతోంది. రేపు కూడా టాస్ ఓడి న్యూజిలాండ్‌ను ఏది కావాలంటే అది తీసుకోనివ్వాలి. మ్యాచ్‌లో భారత్ గెలిచేందుకు 54శాతం ఛాన్స్ ఉందని భావిస్తున్నా’ అని పేర్కొన్నారు.

News March 8, 2025

నటుడి భార్యను చంపిన హంటావైరస్.. ఏంటిది?

image

హాలీవుడ్ యాక్టర్ జీన్ హ్యాక్‌మన్ భార్య బెట్సీ అర్కావా <<15598233>>మరణానికి<<>> కారణమైన హంటావైరస్‌పై చర్చ జరుగుతోంది. ఇది ఇన్ఫెక్టైన ఎలుకలు స్రవించిన ద్రవాలతో సోకుతుంది. వాటి నుంచి మనిషికి వస్తుందే కానీ అంటువ్యాధి కాదు. అలసట, జ్వరం, కండరాల నొప్పి, దగ్గు, శ్వాస తగ్గడం, లంగ్స్‌లో నీరుచేరడం దీని లక్షణాలు. ప్రతి ముగ్గురు రోగుల్లో ఒకరు బతకడం కష్టం. అందుకే నివాస ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

News March 8, 2025

ప్రపంచం KL రాహుల్ వెంటే పడుతుంది: కుంబ్లే

image

అక్షర్ పటేల్ కన్నా ముందు KL రాహుల్ బ్యాటింగ్‌కు రావాలని టీమ్ఇండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే సూచించారు. టాప్‌ఆర్డర్ కుప్పకూలినా, ఛేజింగ్‌లో అతడు 30+ స్కోర్ చేస్తే జట్టును గెలిపించి తీరుతాడని అన్నారు. ‘రాహుల్‌పై విపరీతంగా ప్రెజర్ ఉంటుంది. బాగా ఆడితే సరి. లేదా ఒక్క ఇన్నింగ్సులో విఫలమైనా ప్రపంచమంతా అతడి వెంటే పడుతుంది. కీపింగ్ చేస్తూనే ఆసీస్ మ్యాచులో తన ప్రతిభేంటో చూపించారు’ అని ప్రశంసించారు.