India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. TGలోని ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, సూర్యాపేట, WGL, ASF, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, గద్వాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. APలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.
AP: ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వరద నష్టంపై అంచనా వేయనున్నారు. ఇందుకోసం 1,400 మంది సిబ్బందిని నియమించారు. విజయవాడలోని 32 డివిజన్లు, 149 సచివాలయాల పరిధిలో నష్టం అంచనా వేస్తారు. ప్రతి రెండు వార్డులకు ఒక ఐఏఎస్ అధికారి పర్యవేక్షణ ఉంటుంది. బాధితుల సమక్షంలోనే మొత్తం నష్టాన్ని యాప్‌లో నిక్షిప్తం చేస్తారు. కాగా ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.6,882 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం భావిస్తోంది.
TG: అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో హైడ్రా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తోంది. వారాంతాల్లో మాత్రమే కూల్చివేతలు చేపడుతోంది. ఆ రోజుల్లో న్యాయస్థానాలకు సెలవులు కావడంతో బాధితులు కోర్టుకు కూడా వెళ్లే అవకాశం లేకుండా పోతోంది. దీంతో కూల్చివేతలకు ఎలాంటి ఆటంకం కలగటం లేదు. కాగా చెరువులు, నాలాలు, కాలువల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా విసురుతున్న సంగతి తెలిసిందే.
ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్ పరువు పోగొట్టుకుంటున్నారు. రివ్యూల విషయంలో ఆయన ఖచ్చితంగా వ్యవహరించలేక నవ్వులపాలవుతున్నారు. ఇప్పటివరకు టెస్టుల్లో ఆయన ఒక్క రివ్యూ కూడా నెగ్గలేదు. 10 సార్లు రివ్యూ తీసుకోగా అన్నిసార్లు తనకు ప్రతికూలంగానే తీర్పు వచ్చింది. ప్రపంచ క్రికెట్‌లో మరే కెప్టెన్ వరుసగా ఇన్ని సార్లు రివ్యూలు కోల్పోలేదు. దీంతో ఆయన టెస్టుల్లో జీరో సక్సెస్ రేటు కలిగి ఉన్నారు.
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. కానీ టీమ్ ఇండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు మొండి చేయి చూపింది. సెలక్టర్లు కనీసం ఆయనను పరిగణనలోకి తీసుకోలేదు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ నుంచి అయ్యర్ అర్ధంతరంగా తప్పుకున్నారు. ఆ తర్వాత ఆయన భారత జట్టులో చోటుతోపాటు సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోయారు.
భారత్, పాకిస్థాన్ జట్లు తరచూ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాలని పాక్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ అభిప్రాయపడ్డారు. ‘ఈ దేశాల మధ్య మ్యాచ్ అంటే ఉండే ఆసక్తి అంతాఇంతా కాదు. ఆఖరికి చంద్రుడిపై జరిగినా ఆ మ్యాచ్ చూసేందుకు జనం ఎగబడతారంటే అతిశయోక్తి లేదు. ఒకరి దేశంలో మరొకరు తరచూ ఆడాలి’ అని అభిలషించారు. భారత్ చివరిగా 2008లో ఆసియా కప్ కోసం పాక్‌లో పర్యటించింది. ఇక 2007 తర్వాత రెండు దేశాల మధ్య టెస్టులే జరగలేదు.
పారిస్ పారాలింపిక్స్ ముగింపు వేడుకలు గ్రాండ్‌గా ముగిశాయి. ఫ్రెంచ్ మ్యుజీషియన్లు, గ్రామీ అవార్డ్ విన్నర్ అండర్సన్ పాక్‌ల ప్రదర్శనతో స్టేడియం హోరెత్తింది. ఈ వేడుకల్లో భారత పతాకధారులుగా ఆర్చర్ హర్వీందర్ సింగ్, అథ్లెట్ ప్రీతి పాల్‌లు వ్యవహరించారు.
త్వరలోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకనున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు భారత్ చొరవ తీసుకుంటోంది. ఇందులో భాగంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ వారంలో రష్యా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మాస్కోలో పుతిన్‌తో ఆయన సమావేశం అవుతారని సమాచారం. కాగా ఇప్పటికే పుతిన్ శాంతి చర్చలకు అంగీకరించారు. ఇందుకు భారత్ మధ్యవర్తిత్వానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
AP: ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద పెరిగింది. ఎగువ నుంచి 4.50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో 70 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి వదిలేస్తున్నారు. పులిచింతల, మున్నేరు, కట్టలేరు నుంచి వస్తున్న ప్రవాహం బ్యారేజీలో కలుస్తోంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 13 అడుగులకుపైగా నీటిమట్టం ఉండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
యూఎస్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విజేతగా ఇటలీ స్టార్ ప్లేయర్ జన్నిక్ సిన్నర్ నిలిచారు. అమెరికాకు చెందిన టేలర్ ఫ్రిట్జ్‌పై 6-3, 6-4, 7-5 ఆధిక్యంతో గెలిచి తొలిసారి యూఎస్ ఓపెన్ ట్రోఫీని ముద్దాడారు. న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఇద్దరి మధ్య రెండు గంటలకుపైగా జరిగింది. కాగా యూఎస్ ఓపెన్ మహిళల విజేతగా అరీనా సబలెంక నిలిచిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.