News March 4, 2025

ICC నాకౌట్స్ అంటే హెడ్‌కు పూనకాలే!

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య సెమీస్ జరగనుంది. ఇందులో ఆసీస్ విధ్వంసకర ప్లేయర్ ట్రావిస్ హెడ్ బరిలోకి దిగుతున్నారు. ఆయనకు ఐసీసీ టోర్నీల్లో ఘనమైన రికార్డు ఉంది. భారత్‌తో జరిగిన ODI WC సెమీస్‌లో 62, ఫైనల్లో 137, WTC ఫైనల్లో 163 బాదారు. ఈ మూడు మ్యాచుల్లోనూ ఆయన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నారు. ఇవాళ భారత్‌తో మ్యాచ్ కాబట్టి హెడ్ చెలరేగే ఆస్కారం ఉంది.

News March 4, 2025

ప్రభాస్ ‘ఫౌజీ’లో విలన్‌గా సన్నీ డియోల్?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’ మూవీపై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని టాక్. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరో హీరోయిన్‌గా సాయిపల్లవి నటిస్తారని సమాచారం. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News March 4, 2025

అత్యంత పేదరిక జిల్లాగా కర్నూలు

image

AP: సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు (42 శాతం) అత్యంత పేద జిల్లాగా నిలిచింది. అలాగే అతి తక్కువ పేదరికం ఉన్న జిల్లాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉంది. ఆ తర్వాత కడప, గుంటూరు, కృష్ణ జిల్లాలు నిలిచాయి. గిరిజనులు నివసించే అన్ని ప్రాంతాల్లో పేదరికం ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం ఉన్నాయి.

News March 4, 2025

నేడు మంగళగిరికి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై పార్టీ ముఖ్యనేతలతో ఆయన చర్చించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. పార్టీ కార్యకర్తలను ప్రోత్సహించేందుకు మరిన్ని కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా MLC అభ్యర్థులపైనా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News March 4, 2025

చికెన్ 65కు ఆ పేరు ఎలా వచ్చిందంటే?

image

చికెన్ 65 రెసిపీకి చాలా క్రేజ్ ఉంది. కానీ దీనికి ఆ పేరు ఎలా వచ్చిందని అందరికీ డౌట్ ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఎంఎం బుహారి అనే చెఫ్ చెన్నైలో ఓ రెస్టారెంట్ స్థాపించారు. అందులో బ్రిటీష్ వారికి సరికొత్త మాంసాహారం అందించేవారు. ఓ సైనికుడు భాష సమస్య కారణంగా మెనూ కార్డులో 65వ నంబర్‌లో ఉండే చికెన్ వంటకం తెమ్మనేవాడు. మిగతా కస్టమర్లు కూడా అలానే చెప్పేవారు. అది కాస్త చికెన్ 65గా స్థిరపడింది.

News March 4, 2025

సెమీస్‌లో ఎదురే లేని టీమ్ ఇండియా

image

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్‌లో టీమ్ ఇండియాకు అద్భుత రికార్డు ఉంది. గత 27 ఏళ్లుగా ఈ టోర్నీలో జరిగిన సెమీస్‌లో భారత్ ఓడిపోలేదు. సెమీస్‌కు వెళ్లిన ప్రతీసారి గెలిచి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. 2000, 2002, 2013, 2017 సెమీ ఫైనళ్లలో విజయాలు నమోదు చేసి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇవాళ ఆసీస్‌తో జరగబోయే సెమీ ఫైనల్లోనూ అదే రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News March 4, 2025

మార్చి 04: చరిత్రలో ఈ రోజు

image

1886: స్వాతంత్ర్య సమరయోధుడు బులుసు సాంబమూర్తి జననం
1961: భారత మొదటి విమాన వాహక నౌక ఐ.ఎన్.ఎస్.విక్రాంత్ ప్రారంభం
1966: భారత జాతీయ భద్రతా దినోత్సవం
1973: డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి జననం
1980: టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న జననం
1984: సినీ నటి కమలినీ ముఖర్జీ జననం
1987: నటి శ్రద్ధా దాస్ జననం

News March 4, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 4, 2025

యుద్ధం ముగింపు ఇప్పట్లో లేనట్లే: జెలెన్‌స్కీ

image

రష్యాతో యుద్ధ ముగింపు ఇప్పట్లో కనిపించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. అగ్రరాజ్యం అమెరికా నుంచి తమకు మద్ధతు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘యూఎస్‌తో మా బంధం ఇప్పటిది కాదు. అందుకే మా సంబంధం కొనసాగుతుందని భావిస్తున్నా. అమెరికాతో డీల్‌కు మేం సిద్ధం. ఉక్రెయిన్ ప్రజలు ఎల్లప్పుడూ అమెరికాకు రుణపడి ఉంటారు. ఇందులో సందేహమే లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News March 4, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

మార్చి 4, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 5.20 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.32 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.24 గంటలకు
ఇష: రాత్రి 7.36 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.