India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టీమ్ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్ ‘లారెస్ వరల్డ్ కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు నామినేట్ అయ్యారు. 2022లో పంత్ కారు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. 14 నెలల తర్వాత పునరాగమనం చేశారు. పంత్ తిరిగి కోలుకున్న తీరు ఎందరికో ఆదర్శంగా నిలిచిన నేపథ్యంలో నామినేట్ చేశారు. ఏప్రిల్ 21న విజేతలను ప్రకటించి అవార్డును అందజేయనున్నారు. భారత క్రికెటర్లలో పంత్ కంటే ముందు సచిన్ ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి <<15636348>>షామా మహమ్మద్ చేసిన కామెంట్స్ <<>>దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై రోహిత్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. టీమ్ ఇండియాకు చేసిన సేవకు ఇదా మీరు ఇచ్చే గౌరవమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆగ్రహం కాంగ్రెస్ మీదకూ పాకింది. ‘కాంగ్రెస్ కా బాప్ రోహిత్’ అన్న హాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటికే 10.5వేల ట్వీట్లు పడ్డాయి.

AP: ఉత్తరాంధ్ర టీచర్ MLCగా PRTU అభ్యర్థి గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆయన గెలుపొందారు. శ్రీనివాసులు 10,068 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ దాటడంతో విజేతగా ప్రకటించారు. మరోవైపు, వెయ్యికి పైగా ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. విజేతను డిసైడ్ చేసే ప్రక్రియలో 8మందిని ఎలిమినేషన్ చేయాల్సి వచ్చింది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ 11గంటల పాటు సాగింది.

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి నెలరోజుల విరామం ఇచ్చి శాంతిని పాటించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తెలిపారు. లండన్‌లో ఐరోపా దేశాల అధినేతలు ఇటీవల భేటీ అయ్యారు. బ్రిటన్ కూడా శాంతి ఒప్పందం యోచనకే మొగ్గు చూపుతోందని ఆయన పేర్కొన్నారు. ‘రష్యా అధ్యక్షుడు శాంతికి కట్టుబడి ఉంటారో లేదో దీనితో తేలుతుంది. ఆ తర్వాతే అసలైన శాంతి చర్చలు ప్రారంభమవుతాయి’ అని తేల్చిచెప్పారు.

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రానున్న ‘ది ప్యారడైజ్’ మూవీ గ్లింప్స్ తాజాగా విడుదలైంది. అందులో వాడిన పదజాలం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. బూతు పదాన్ని, అందునా తల్లిని కించపరిచే పదాన్ని వాడటమేంటంటూ కొంతమంది విమర్శలు గుప్పిస్తుండగా, సినిమా కథ దృష్ట్యా ఈ పదం వాడి ఉండొచ్చని, మూవీ రిలీజయ్యే వరకూ విమర్శించడం సరికాదని నాని అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. మరి ఈ వాదనపై మీ అభిప్రాయం?

AP: CM చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అసెంబ్లీ హాలు నుంచి ఆయన CM ఛాంబర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా వీరి మధ్య బడ్జెట్, వివిధ శాఖలకు కేటాయింపులపై చర్చ జరిగింది. అభివృద్ధి పనులు, పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు జరిగాయని పవన్ CMతో అన్నారు. మేలో ప్రారంభించనున్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవపై చర్చించారు. అలాగే MLA కోటా MLC అభ్యర్థుల విషయంలోనూ సమావేశంలో చర్చ జరిగింది.

TG: కాంగ్రెస్‌లో నెక్స్ట్ మారేది ముఖ్యమంత్రేనని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకోసమే హైకమాండ్ కొత్త ఇంఛార్జ్‌ని నియమించిందన్నారు. సీఎంను మార్చే బాధ్యత రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజన్‌కు అప్పగించారన్నారు. కాంగ్రెస్ మంత్రులు పార్టీకి నాలుగు స్తంభాలు తామంటే తామని వాదులాడుకుంటున్నారని దుయ్యబట్టారు. మంత్రివర్గంలో కలహాలు కథలుగా నడుస్తున్నాయని విమర్శించారు.

TG: కృష్ణా జలాల మాదిరి గోదావరిపై సమస్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేమని CM రేవంత్ అన్నారు. కేంద్రమంత్రి CR పాటిల్‌తో భేటీ తర్వాత మాట్లాడుతూ.. ‘TGలో గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరగాలి. మా ప్రాజెక్టులపై పెడుతున్న అభ్యంతరాలను AP ఉపసంహరించుకోవాలి. మా ప్రాజెక్టుల పరిస్థితి గందరగోళంగా ఉంటే APలో వరద జలాలపై ప్రాజెక్టులు కడతామంటే TGకు అభ్యంతరం ఉంటుంది’ అని అన్నారు.

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా టాలీవుడ్ అరంగేట్రానికి సిద్ధమవుతున్నారు. సుధీర్ బాబుకు జోడీగా ఆమె ‘జటాధర’ అనే సినిమాలో నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ మార్చి 8 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. గతేడాది తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడిన ఈ భామ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. చివరిసారిగా ఆమె పీరియాడిక్ డ్రామా ‘హీరామండి’, హారర్ కామెడీ ‘కాకుడ’లో కనిపించారు.

BSP చీఫ్ మాయావతి కఠిన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పరిణతి లేదంటూ మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. కాన్షీరాం, అంబేడ్కర్‌ల సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్ మూమెంట్, పార్టీ ప్రయోజనం కోసమే ఈ పని చేశానని తెలిపారు. నెల క్రితం బహిష్కరణకు గురైన అతడి మామ అశోక్ సిద్ధార్థ్ మాటలు ఇప్పటికీ వింటున్నాడని, పార్టీలో వర్గ విబేధాలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. అలాంటి వారికి శిక్ష తప్పదన్నారు.
Sorry, no posts matched your criteria.