India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పహల్గామ్ ఉగ్రదాడికి కేంద్రం ఘాటుగా బదులిస్తుందనే నమ్మకముందని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. బాధితుల్ని మతం పేరు అడిగి చంపారు, అదే హిందువులైతే ఇలా చేసి ఉండేవారు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. మనమంతా ఐక్యంగా ఉంటే మనల్ని చూడడానికే ఎవరూ ధైర్యం చేయరు అని తేల్చిచెప్పారు. రావణుడికి కూడా బుద్ధి మార్చుకోమని రాముడు అవకాశమిచ్చారు. తీరు మార్చుకోకపోవడంతో సంహరించాల్సి వచ్చిందని అన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబాకు చెందిన క్రియాశీల శిబిరం ఉందని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్ర శిబిరం నుంచి విదేశీ ఉగ్రవాదులు పహల్గామ్ దాడికి వచ్చారని, వీరికి స్థానిక మిలిటెంట్లు సాయంగా నిలిచారని పేర్కొన్నాయి. ఆ ఉగ్ర మాడ్యూల్‌కు లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, అతడి డిప్యూటీ సైఫుల్లా సూత్రధారులుగా ఉన్నట్లు సమాచారం. పాకిస్థాన్ నుంచి వారు దాన్ని ఆపరేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిట్ అయిన విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ స్టార్లు సైఫ్ అలీఖాన్, జైదీప్ అహ్లావత్ నటించిన ‘జ్యువెల్ థీఫ్’ మూవీ నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.
అదానీ గ్రూప్‌ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హిండెన్‌బర్గ్ సంస్థతో కలిసి పనిచేశారని స్పుత్నిక్ ఇండియా నివేదిక తెలిపింది. ఆ విషయాన్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ కనిపెట్టిందని పేర్కొంది. ‘2023, మేలో హిండెన్‌బర్గ్‌కు సంబంధించిన వారితో కాలిఫోర్నియాలో రాహుల్ భేటీ అయ్యారు. రాహుల్‌కు సన్నిహితుడైన శామ్ పిట్రోడా ఈ-మెయిల్స్‌ను హ్యాక్ చేయడం ద్వారా మొసాద్ ఈ సంగతి గుర్తించింది’ అని తెలిపింది.
సామాజిక కార్యకర్త మేధాపాట్కర్ను పరువునష్టం కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2000లో ‘నర్మదా బచావో’ ఆందోళనకు వ్యతిరేకంగా ప్రస్తుత LG VK సక్సేనా ప్రకటనలు ప్రచురించారని ఆరోపిస్తూ ఆయనపై పాట్కర్ కేసు వేశారు. అదే సమయంలో ఓ ఇంటర్వ్యూలో తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారని ఆమెపై సక్సేనా సైతం పరువు నష్టం దావా వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఇటీవల ఆమెకు కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
పహల్గామ్ ఉగ్రదాడిపై నటి హీనా ఖాన్ విచారం వ్యక్తం చేశారు. ఓ ముస్లింగా భారతీయులందరికీ క్షమాపణలు తెలియజేశారు. మతం చూసి దాడికి పాల్పడటం హీనమైన చర్య అని ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ నోట్ రాసుకొచ్చారు. ఈ ఘటన తనపై మానసికంగా ప్రభావం చూపించిందని తెలిపారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా కలిసికట్టుగా పోరాడుదామని పేర్కొన్నారు. భారతీయురాలిగా దేశం తరఫున నిలబడతానని చెప్పారు.
పాక్ ఆటగాడు అర్షద్‌ను NC క్లాసిక్ ఈవెంట్‌కు ఆహ్వానించడంపై భారత జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు. ‘అర్షద్‌కు ఆ ఆహ్వానం ఉగ్రదాడులకు ముందు పంపించా. ఆ ఘటన తర్వాత అతడిని పిలిచే ప్రసక్తే లేదు. నాకు నా దేశమే ముఖ్యం. నన్ను, నా కుటుంబాన్ని అకారణంగా లక్ష్యంగా చేసుకున్నారు. ఏడాది క్రితం నా తల్లిని కొనియాడిన అదే నోళ్లు నేడు ఆమెను దారుణంగా తిడుతున్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
బందిపొరా ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా కమాండర్ అల్తాఫ్ లల్లీని భద్రతా దళాలు మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఘటన తర్వాత ఆర్మీ బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపును తీవ్రం చేశాయి. ఈ క్రమంలో బందిపొరాలో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు కూడా గాయపడినట్లు సమాచారం. ఉగ్రవాది మృతిపై సైన్యం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళ్లాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపుతుండటంతో సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ 290 పాయింట్లు నష్టపోయాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు తప్ప మిగతావన్నీ భారీ నష్టాల్లో ఉన్నాయి.
పాక్‌తో సింధు జలాల ఒప్పందం రద్దును స్వాగతించిన MIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. ఆ నీటిని కేంద్రం ఎక్కడ ఉంచుతుందో తెలపాలని కోరారు. ‘బైసరన్ మైదానంలో CRPFజవాన్లను ఎందుకు మోహరించలేదు, ఘటన తర్వాత అక్కడికి చేరుకోవడానికి ఎందుకు ఆలస్యమైంది’ అని ప్రశ్నించారు. ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ చంపారని, ఇవి తీవ్ర మతతత్వ హత్యలని పునరుద్ఘాటించారు. ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యంతోనే ఈ దాడి జరిగిందని ఎంపీ గతంలోనే అన్నారు.
Sorry, no posts matched your criteria.