News September 8, 2024

ధోని రికార్డును సమం చేసిన ధ్రువ్ జురెల్

image

టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ దిగ్గజ ప్లేయర్ ధోని రికార్డును సమం చేశారు. దులీప్ ట్రోఫీలో ఇండియా-Bతో జరుగుతున్న మ్యాచులో ఒకే ఇన్నింగ్సులో జురెల్ ఏడు క్యాచులు అందుకున్నారు. 2004-05లో ఈ దేశవాళీ టోర్నీలో ధోని 7 క్యాచులు అందుకున్నారు. కాగా ఆ తర్వాతి స్థానాల్లో బెంజమిన్, విశ్వనాథ్ ఆరేసి క్యాచులతో ఉన్నారు.

News September 8, 2024

ఖమ్మంలో కిషన్ రెడ్డి పర్యటన.. బాధితులకు పరామర్శ

image

TG: ఖమ్మం నగరంలో మున్నేరు నది వరదతో నష్టపోయిన బాధితులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వరదలో కొట్టుకుపోయిన ఇళ్లను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ఓదార్చారు. పునరావాస కార్యక్రమాలను పరిశీలించారు. కిషన్ రెడ్డి వెంట మంత్రి పొంగులేటి, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారు.

News September 8, 2024

న‌ల్గొండకు జాతీయ అవార్డు.. గాలి నాణ్యత మెరుగుదలకు గుర్తింపు

image

దేశంలో 3 ల‌క్ష‌లు అంత‌కంటే త‌క్కువ జ‌నాభా గ‌ల న‌గ‌రాల్లో గాలి నాణ్య‌త మెరుగుద‌లలో రాయ్‌బ‌రేలీ మొద‌టి స్థానంలో నిల‌వ‌గా న‌ల్గొండ 2వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో 10 ల‌క్ష‌లపైన జ‌నాభా న‌గరాల్లో సూర‌త్ మొద‌టి స్థానంలో, ఫిరోజాబాద్‌, అమ‌రావ‌తి(మ‌హారాష్ట్ర‌) త‌రువాతి స్థానాల్లో నిలిచాయి. వాయుకాలుష్యంలో PM10 స్థాయి తగ్గుదలకు గుర్తింపుగా కేంద్రం స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డులను ప్ర‌దానం చేసింది.

News September 8, 2024

పెరుగుతున్న మృతుల సంఖ్య

image

UP లక్నోలోని ట్రాన్స్‌పోర్ట్ న‌గ‌ర్‌లో మూడంత‌స్తుల భ‌వ‌నం కూలిన ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య 8కి చేరింది. శ‌నివారం సాయంత్రం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురి మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కి తీశారు. సహాయ‌క చ‌ర్య‌లు జ‌రుగుతున్న‌ప్పుడు శిథిలాల కింద‌ మ‌రో ముగ్గురి మృత‌దేహాల‌ను గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో 28 మంది గాయ‌ప‌డిన‌ట్టు అధికారులు తెలిపారు. వర్షం కురుస్తుండగా గోడళ్లో పగుళ్లు వచ్చి భవనం కూలినట్లు బాధితులు తెలిపారు.

News September 8, 2024

అలాంటి వారిని సమాజం స్వీకరించదు: అజిత్ పవార్

image

కుటుంబంలో విభేదాలు సృష్టించేవారిని సమాజం ఇష్టపడదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ధర్మేంద్ర బాబాపై ఆయన కూతురు భాగ్యశ్రీ(NCP శరద్ వర్గం) పోటీ చేస్తారనే ప్రచారంపై అజిత్ స్పందించారు. కూతురు కన్నా తండ్రిని ఎక్కువగా ఎవరూ ప్రేమించలేరని, తండ్రిపైనే పోటీ సరికాదని హితవు పలికారు. కాగా శరద్ పవార్‌తో తెగదెంపులు చేసుకొని షిండేతో అజిత్ పవార్ పొత్తు కలిసిన సంగతి తెలిసిందే.

News September 8, 2024

బంగాళాఖాతంలో వాయుగుండం.. విస్తారంగా వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరంవైపు కదులుతోంది. రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో ఇప్పటికే విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, మన్యం, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.

News September 8, 2024

రియల్ హీరో.. వందల మందిని కాపాడాడు

image

మహాదేవ అనే ట్రాక్‌మ్యాన్ తెగువ ఘోర రైలు ప్రమాదాన్ని ఆపింది. అతను కేరళలోని కుమ్టా, హొన్నావర్‌ల మధ్య ఓ చోట పట్టాల వెల్డింగ్ సరిగా లేనట్లు గుర్తించారు. ఆ రూట్‌లో తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ వస్తోంది. వెంటనే కుమ్టా స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా అప్పటికే రైలు ముందుకొచ్చేసింది. దీంతో పట్టాల వెంట 5 నిమిషాల్లో అర కిలోమీటర్ పరిగెత్తి రైలును ఆపారు. వందల మంది ప్రాణాలను కాపాడి రియల్ హీరోగా నిలిచారు.

News September 8, 2024

హైడ్రా నోటీసులపై మురళీమోహన్ ఏమన్నారంటే?

image

TG: హైడ్రా <<14048767>>నోటీసులపై<<>> సీనియర్ నటుడు మురళీమోహన్ స్పందించారు. తాను 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని, ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని క్లారిటీ ఇచ్చారు. బఫర్ జోన్‌లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారన్నారు. ఆ షెడ్డును తామే తొలగిస్తామని చెప్పారు. కాగా స్థానికుల ఫిర్యాదుతో అధికారులు వచ్చారని పేర్కొన్నారు.

News September 8, 2024

వింటేజ్ చిరును గుర్తు చేశాడుగా..

image

‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఓ యాడ్‌లో మెరిశారు. ‘అన్నయ్య’ సినిమాలో పాత్రను పోలిన క్యారెక్టర్‌తో తనదైన స్టైల్‌లో అదరగొట్టారు. ఈ యాడ్‌కు హరీశ్ శంకర్ దర్శకత్వం వహించడం గమనార్హం. మాస్ లుక్‌లో వింటేజ్ చిరును గుర్తు చేస్తున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

News September 8, 2024

రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్

image

ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ‘నేను దేశం తరఫున ఎన్నో ఏళ్లు క్రికెట్ ఆడా. యువకులకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చింది’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలీ ఇప్పటికే 2సార్లు రిటైర్మెంట్ ప్రకటించి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇకపై అలాంటి ప్రయత్నం చేయబోనని ఆయన స్పష్టం చేశారు. అలీ ENG తరఫున 68 టెస్టులు, 138 ODIలు, 92 T20లు, లీగ్‌లలో 352 మ్యాచ్‌లు ఆడారు.

error: Content is protected !!