News March 1, 2025

మంచు కొండలు విరిగిపడిన ఘటన.. నలుగురు మృతి

image

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌లో మంచు కొండలు విరిగిపడిన ఘటనలో నలుగురు మరణించారు. నిన్న మంచుచరియల కింద వీరు చిక్కుకోగా రెస్క్యూ సిబ్బంది వెలికితీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఆరుగురి కోసం ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. మొత్తం 57 మంది చిక్కుకోగా 47 మందిని ఆర్మీ రక్షించింది.

News March 1, 2025

పరీక్ష లేకుండా ఉద్యోగాలు.. ఎల్లుండే లాస్ట్ డేట్

image

పోస్టల్ శాఖలో బీపీఎం, ఏబీపీఎం పోస్టులకు దరఖాస్తు గడువు ఈ నెల 3తో ముగియనుంది. మొత్తం 21,413 ఖాళీలకుగాను ఏపీలో 1,215, తెలంగాణలో 519 పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష లేకుండా టెన్త్ క్లాస్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 18-40 ఏళ్ల వారు అర్హులు కాగా రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంది. ఈ నెల 6 నుంచి 8 వరకు తప్పుల సవరణకు పోస్టల్ శాఖ అవకాశం కల్పించింది.
వెబ్‌సైట్: https://indiapostgdsonline.gov.in/

News March 1, 2025

విడాకులు దొరకవనే భయంతో టెకీ ఆత్మహత్య?

image

మానవ్‌శర్మ మృతికి విడాకుల భయమే కారణమని మృతుడి సోదరి తెలిపింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందని తెలిసిన తర్వాత విడిపోదామనుకున్నాడంది. అయితే అదంత సులువు కాదని, చట్టాలన్నీ మహిళల వైపే ఉంటాయని భార్య నికిత బెదిరించేదని చెప్పింది. ఫిబ్రవరి 23న కూడా లీగల్ ప్రొసీడింగ్‌కు వెళ్లాల్సి ఉండగా, మానవ్‌ను ఆగ్రా తీసుకొచ్చి మరోసారి బెదిరించిందని తెలిపింది. భయంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించింది.

News March 1, 2025

‘ఛావా’ తెలుగు ట్రైలర్ ఎప్పుడంటే?

image

మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ సినిమాను తెలుగులోనూ విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్‌ను ఈ నెల 3న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పేర్కొంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్కీ కౌశల్, రష్మిక నటించారు. హిందీలో కలెక్షన్లు కొల్లగొడుతున్న ఈ సినిమా ఈ నెల 7న తెలుగులో రిలీజ్ కానుంది.

News March 1, 2025

BREAKING: జైలులో పోసానికి అస్వస్థత

image

AP: అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలులో ఉన్న పోసాని కృష్ణమురళి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు అతడిని జైలు నుంచి రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఆయనకు కోర్టు నిన్న 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

News March 1, 2025

విరుష్కను ఫాలో అయిన ఆలియా.. ఫొటోలు డిలీట్!

image

తన కుమార్తె రాహా ముఖాన్ని సోషల్ మీడియాలో చూపించకూడదని నటి ఆలియాభట్ నిర్ణయించుకున్నారు. అందుకే ఇన్‌స్టాగ్రామ్ సహా అన్ని హ్యాండిల్స్ నుంచి ఆమె ఫొటోలను డిలీట్ చేశారు. జామ్‌నగర్, పారిస్‌లో తీసుకున్న వాటినీ ఉంచలేదు. రాహా ముఖం కనిపించని ఒకే ఒక్క చిత్రాన్ని మాత్రం అలాగే ఉంచారు. ఆమె తీసుకున్నది సరైన నిర్ణయమేనని నెటిజన్లు అంటున్నారు. విరుష్క జోడీ తమ పిల్లలను ఎప్పట్నుంచో SMకు దూరంగా ఉంచడం తెలిసిందే.

News March 1, 2025

కొవ్వెక్కిన పంది, నీతిమాలిన జెలెన్‌స్కీ: రష్యా ఫైర్

image

డొనాల్డ్ ట్రంప్, జెలెన్‌స్కీ వాగ్వాదంపై రష్యా ఘాటుగా స్పందించింది. ఎవరి మద్దతూ లేకుండా ఒంటరిగా యుద్ధం చేశానన్న జెలెన్‌స్కీ ఓ నీతిమాలిన వాడంటూ రష్యా ఫారిన్ మినిస్ట్రీ ప్రతినిధి మరియా జఖారోవా విమర్శించారు. వైట్‌హౌస్‌లో అతడికి తగిన శాస్తి జరిగిందన్నారు. మాజీ ప్రెసిడెంట్, సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ దిమిత్రి మెద్వెదేవ్ అయితే ఏకంగా ‘కొవ్వెక్కిన పంది’ అని తిట్టారు.

News March 1, 2025

సెమీఫైనల్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్!

image

ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ మాథ్యూ షార్ట్ సెమీస్‌లో ఆడేది అనుమానమేనని కెప్టెన్ స్టీవ్ స్మిత్ చెప్పారు. షార్ట్ గాయంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. అతని స్థానంలో మెక్ గుర్క్, అరోన్, కూపర్‌లలో ఒకరిని తీసుకుంటామని చెప్పారు. నిన్న వర్షం కారణంగా రద్దైన మ్యాచులో షార్ట్ 15 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటయ్యారు.

News March 1, 2025

100 రోజుల్లోపే శిక్ష పడేలా పనిచేయాలి: హోంమంత్రి అనిత

image

AP: నేరం చేసిన వంద రోజుల్లోపే శిక్షలు పడేలా పనిచేయాలని ట్రైనింగ్ పూర్తి చేసుకున్న SIలకు హోంమంత్రి అనిత సూచించారు. నిజాయితీగా ప్రజల రక్షణకు ముందుకెళ్లాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైల పాసింగ్ పరేడ్‌లో ఆమె పాల్గొన్నారు. మొత్తం 395 మంది ఎస్సైలుగా శిక్షణ పూర్తి చేసుకోగా వీరిలో 97 మంది మహిళలు ఉన్నారు. మహిళలు ఇంత సంఖ్యలో ఉండటం గర్వకారణమని అన్నారు. ఈ పరేడ్‌కు డీజీపీ హరీశ్ గుప్తా హాజరయ్యారు.

News March 1, 2025

జెలెన్‌స్కీ కోసం ట్రంప్‌ను ఎదిరించే సీన్ EUకు ఉందా?

image

పీస్‌డీల్ తిరస్కరించిన జెలెన్‌స్కీకి EU మద్దతు ప్రకటించింది. దానికి ట్రంప్‌ను ధిక్కరించే సీనుందా? అంటే కష్టమే అంటున్నారు విశ్లేషకులు. కూటమిలో సగం దేశాలకు యుద్ధమే ఇష్టం లేదు. గ్యాస్, ఆయిల్ కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. జర్మనీలో కల్లోలం, ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్నాయి. UK పరిస్థితి దారుణం. NATO, UN నుంచి వైదొలగుతానన్న ట్రంప్ వేసే టారిఫ్స్‌ను వారు తట్టుకొనే స్థితిలో లేనే లేరన్నది అసలు నిజం.