India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: బుడమేరు వాగుకు 1903 నుంచే వరదలు వస్తున్నాయి. ఈ ముప్పు నుంచి విజయవాడను కాపాడేందుకు 1960లో వెలగలేరు వద్ద 11 అడుగుల ఎత్తులో రెగ్యులేటర్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వరద విజయవాడవైపు వెళ్లకుండా కొండపల్లి, ఇబ్రహీంపట్నం మీదుగా కృష్ణాలో కలిపేందుకు డైవర్షన్ ఛానల్ ఏర్పాటు చేశారు. పోలవరం కుడికాలువ, థర్మల్ ప్రాజెక్టు నీళ్లు కూడా ఇందులోనే కలుస్తాయి. దీని కెపాసిటీ పెంచితే బెజవాడకు వరదలు తగ్గే అవకాశముంది.
AP: తిరుపతిలోని శేషాచలం అడవుల్లో బంగారు బల్లి(గోల్డెన్ గెకో)ని వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు గుర్తించి ఫొటోలు తీశారు. అరుదైన జాతికి చెందిన ఈ జీవులు చీకటి ప్రదేశాలు, రాతి బండల్లో మాత్రమే నివసిస్తాయి. ఇవి ఒకేసారి 40-150 గుడ్లను పెట్టగలవు. ఇటీవల కాలంలో ఈ బల్లులు అంతరించే దశకు చేరుకున్నాయి. గత ఏడాది పాపికొండల అభయారణ్యం, కళ్యాణిడ్యాం పరిధిలో వీటిని గుర్తించారు.
AP: విజయవాడలో వేలాది వాహనాలు రిపేర్లకొచ్చాయి. మూడు రోజులు నీటిలో నానడంతో బైకులు స్టార్ట్ అవ్వడం లేదు. దీంతో సింగ్ నగర్, జక్కంపూడి, రాజరాజేశ్వరిపేట, ఏలూరు రోడ్డు, గుణదల తదితర ప్రాంతాల్లోని మెకానిక్ షెడ్లు రద్దీగా మారాయి. అర్జెంట్ అంటే కుదరదని టైమ్ పడుతుందని మెకానిక్‌లు వాహనదారులకు చెబుతున్నారు. ఇంజిన్‌లోకి నీరు చేరడం, వైరింగ్ సిస్టమ్ పాడవడం లాంటి సమస్యలకు భారీగా ఖర్చవుతోంది.
వరదల్లో బైక్ ఇంజిన్ మునిగిపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ స్టార్ట్ చేయొద్దని టెక్నీషియన్లు సూచిస్తున్నారు. త్రీవీలర్ సాయంతో షోరూమ్ లేదా మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లాలని, వెంటనే స్టార్ట్ చేస్తే బైక్ బోర్‌కు వస్తుందని చెబుతున్నారు. బైక్ ఇంజిన్ వరకు మునిగితే ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్ మార్చుకుంటే చాలని, పెట్రోల్ ట్యాంక్ కూడా మునిగితే ఎక్కువ ఖర్చు అవుతుందని వివరిస్తున్నారు.
SHARE IT
TG: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సురేందర్ రెడ్డి(52) అనే రైతు అగ్రికల్చర్ ఆఫీస్ ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలానికి చెందిన ఈయనకు రుణమాఫీ కాలేదని, ఆ బాధతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రిలయన్స్ జియో 8వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 5 నుంచి 10వ తేదీల మధ్య కొన్ని రీఛార్జ్ ప్లాన్లపై స్పెషల్ ఆఫర్లు ప్రకటించింది. రూ.899(90 రోజులు), రూ.999(98 రోజులు), రూ.3,599(365 రోజులు)తో రీఛార్జ్ చేసుకుంటే రూ.700 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో 10 OTTలు, 3 నెలల జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్, 28 రోజుల వ్యాలిడిటీతో రూ.175 విలువైన 10GB డేటా వోచర్ పొందొచ్చు.
TG: బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని అమలు చేయాలని TGSRTC నిర్ణయించింది. త్వరలో పల్లె వెలుగు సహా అన్నింటిలోనూ దీనిని అమలు చేయనుంది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్‌ను రూపొందించింది. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్(AFCS)ను అందుబాటులోకి తీసుకురానుంది. 13వేల కొత్త మెషీన్లకు ఆర్డర్ ఇచ్చింది. అలాగే బస్సు పాసుల స్థానంలో డిజిటల్ కార్డులను ఇవ్వనుంది.
‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అని పెద్దలంటుంటారు. మనం చేసే సాయం ఎంత చిన్నదైనా ఆ ఆలోచన రావడం ఎంతో గొప్పది. హైదరాబాద్‌కు చెందిన సాయి అనే రాపిడో బైక్ నడిపే వ్యక్తి తాను రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బులను విరాళమిచ్చి మంచిమనసు చాటారు. వరద బాధితుల కోసం రూ.780ను తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు డొనేట్ చేసినట్లు ట్వీట్ చేశారు. సాయిని అంతా అభినందిస్తున్నారు. మీరూ <<14018795>>ఇలా విరాళం<<>> ఇవ్వొచ్చు.
బాలీవుడ్‌లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘కిల్’ అర్ధరాత్రి నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. లక్ష్ లల్వానీ, తాన్య కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం జులై 5న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులోని యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోవడంతో ‘జాన్ విక్’ ఫేమ్ ఛార్లెస్ ఈ మూవీ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. టొరంటో ఇంటర్నేషనల్, ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రదర్శితమైంది.
ట్రంప్, కమల పోటీలో ఎవరు గెలిచినా భారత్, అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని USISPF సీఈవో ముకేశ్ అఘి అన్నారు. US జియో పొలిటికల్ లక్ష్యాలు, చైనా దూకుడు నియంత్రణకు భారతే కీలకం అన్నారు. ‘నిజమే, చైనా సమీపంలో వియత్నాం, కాంబోడియా, థాయ్‌లాండ్ ఉన్నాయి. కానీ భారత్ చేకూర్చే ప్రయోజనం మరెక్కడా దొరకదు. సరఫరా గొలుసు అంతరాయాలు ఉండొద్దంటే వారే కీలకం. పైగా చాలా కంపెనీలకు అదే మార్కెట్‌గా మారింది’ అని ఆయన వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.