News September 6, 2024

కోలీవుడ్‌లో లైంగిక నేరాల నిందితులపై ఐదేళ్ల నిషేధం?

image

తమిళ సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడేవారిపై ఐదేళ్ల నిషేధం విధించాలని నడిగర్ సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాలీవుడ్‌లో లైంగిక వేధింపుల విషయంలో హేమ కమిటీ రిపోర్టు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో సంఘం తాజాగా భేటీ అయింది. ఫిర్యాదు రాగానే పూర్తి దర్యాప్తు చేపట్టి, నిజమని తేలితే నేరస్థులపై నిషేధం విధించాలని ఈ సమావేశంలో ప్రతిపాదించినట్లు సభ్యులు తెలిపారు.

News September 6, 2024

వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి: సీఈవో

image

TG: జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి కోరారు. ప్రస్తుతం ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోందని, OCT 29న ముసాయిదా జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. NOV 28 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, జనవరి 6న ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,33,27,304 మంది ఓటర్లున్నారని చెప్పారు.

News September 6, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: సెప్టెంబర్ 06, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 4:50 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:03 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:14 గంటలకు
అసర్: సాయంత్రం 4:39 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:25 గంటలకు
ఇష: రాత్రి 7.38 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 6, 2024

వరద బాధితులకు పెమ్మసాని రూ.కోటి విరాళం

image

AP: వరద బాధితులకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రూ.కోటి సాయం ప్రకటించారు. అలాగే ఎస్‌బీఐ అమరావతి సర్కిల్ రూ.5.87 కోట్లు, దేవీ సీ ఫుడ్స్ రూ.కోటి, కృష్ణా డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు రూ.50 లక్షల సాయం అందించారు.

News September 6, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 6, 2024

అత్యధిక పన్ను చెల్లించిన మహిళా సెలబ్రిటీగా కరీనా కపూర్

image

FY24లో భారత్‌లో అత్యధిక పన్ను చెల్లించిన మహిళా సినీ సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ నటి కరీనా కపూర్ అగ్రస్థానంలో నిలిచారు. ఆమె రూ.20 కోట్ల పన్ను కట్టగా ఆ తర్వాతి స్థానాల్లో కియారా అద్వానీ(రూ.12 కోట్లు), కత్రినా కైఫ్(రూ.11 కోట్లు) ఉన్నారు. మొత్తంగా సెలబ్రిటీల జాబితాలో షారుఖ్ రూ.92 కోట్ల పన్ను కట్టి అగ్రస్థానంలో నిలిచారు. విజయ్(రూ.80 కోట్లు), సల్మాన్ (రూ.75 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

News September 6, 2024

సెప్టెంబర్ 6: చరిత్రలో ఈరోజు

image

1766: పరమాణు సిద్ధాంతానికి పునాదులు వేసిన బ్రిటిష్ శాస్త్రవేత్త జాన్‌ డాల్టన్ జననం
1936: తెలుగు కవి అద్దేపల్లి రామమోహన రావు జననం
1949: బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు రాకేశ్ రోషన్ జననం
1950: సుప్రసిద్ధ అవధాని గండ్లూరి దత్తాత్రేయశర్మ జననం
2012: రచయిత, దర్శకుడు చెరుకూరి సుమన్ మరణం

News September 6, 2024

EV సంస్థలకు స‌బ్సిడీ అవసరం లేదు: గడ్కరీ

image

వినియోగదారులు ఇప్పుడు సొంతంగా EV లేదా CNG వాహనాలను ఎంచుకుంటున్న నేప‌థ్యంలో EV త‌యారీదారుల‌కు ఇక స‌బ్సిడీ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని భావిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. డీజిట్‌, పెట్రోల్ వాహ‌నాల‌ కంటే ఈవీల‌పై జీఎస్టీ త‌క్కువ‌న్నారు. రాయితీ అడ‌గ‌డం ఇక ఎంత‌మాత్ర‌మూ స‌మ‌ర్థ‌నీయ‌ం కాద‌ని పేర్కొన్నారు. హైబ్రిడ్‌, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వాహనాలపై 28%, EVలపై 5% GST ఉందన్నారు.

News September 6, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 6, 2024

శుభ ముహూర్తం

image

తేది: సెప్టెంబర్ 06, శుక్రవారం
తదియ: మ.3.01 గంటలకు
హస్త: ఉ.9.25 గంటలకు
వర్జ్యం: సా.6.28-సా.8.16 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉ.8.23-ఉ.9.13 గంటల వరకు
(2) మ.12.30-మ.1.19 గంటల వరకు
రాహుకాలం: ఉ.10.30-మ.12.00 గంటల వరకు