India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: విపత్తు సమయంలో తెలంగాణకు తన వంతుగా రూ.కోటి విరాళం ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి తానే స్వయంగా అందజేస్తానని చెప్పారు. కష్టాలు వచ్చినప్పుడు ఒకరికొకరు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నాయకులు కూడా విరాళాలు ఇవ్వాలన్నారు. అంతకుముందు పవన్ ఏపీకి రూ.కోటి విరాళం ప్రకటించారు.
BSNLకు మరో రూ.6వేల కోట్లు కేటాయించేందుకు కేంద్రం సిద్ధమైంది. కస్టమర్లను పోగొట్టుకోకుండా వేగంగా 4G నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లక్ష 4G సైట్లు నెలకొల్పేందుకు కంపెనీ నిరుడు రూ.19వేల కోట్లతో TCS, ITIకి ఆర్డర్లు ఇచ్చింది. రూ.13వేల కోట్లే చెల్లించడంతో మరో రూ.6వేల కోట్లు అవసరం అయ్యాయి. 2019 నుంచి BSNL, MTNLలో కేంద్రం రూ.3.22 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం.
TG: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. నీలోఫర్ కేఫ్‌లో కిచెన్ అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచిన షుగర్ సిరప్, మసాలా దినుసులు వంటి లేబుల్ లేని వస్తువులు చూసి అసహనం వ్యక్తం చేశారు. అమ్మకానికి ఉంచిన కేక్‌లకు కూడా లేబుల్ చేయలేదు. దీంతోపాటు వంటగదిలో ఎక్స్‌పైరీ అయిన అరకిలో చీజ్, మిరప పొడి, 5 కిలోల కాల్చిన వేరుశెనగలు ఉన్నాయి.
సెబీ చీఫ్ మాధబీ బుచ్‌పై ఉద్యోగులు ఫైనాన్స్ మినిస్ట్రీకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఆమె నాయకత్వ శైలి వల్ల పని సంస్కృతి చెడిందని ఆగస్టు 6న లేఖ రాశారని ET రిపోర్టు చేసింది. ‘సమావేశాల్లో మాపై అరుస్తారు. తిడతారు. అందరి ముందూ అవమానిస్తారు. ఆమెపై యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ప్రతి క్షణం మా కదలికలపై నిఘా పెడుతున్నారు’ అని 500 మంది సీనియర్లు సంతకాలు చేసి లేఖను పంపినట్టు తెలిసింది.
నైజీరియా జాతీయ జెండా రూపకర్త ప తైవో మైఖేల్ అకింకున్మీ మరణించిన ఏడాది తర్వాత ఆయన కుటుంబం అంత్యక్రియలు నిర్వహించింది. 1950ల్లో లండన్‌లో చదివేటప్పుడు ఆకుపచ్చ, తెలుపు రంగులతో జాతీయ జెండాను రూపొందించిన మైఖేల్ 87ఏళ్ల వయసులో 2023 Aug 29న మరణించారు. అయితే అప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ అమలు కాలేదు. దీంతో ఏడాది పాటు మృతదేహాన్ని మార్చురీలోనే ఉంచాల్సి వచ్చింది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘బజరంగీ భాయిజాన్’ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను తిరస్కరించిన వారిలో సూపర్ స్టార్ రజినీకాంత్‌తో పాటు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉన్నారన్న విషయం మీకు తెలుసా? వీరు తిరస్కరించడంతో డైరెక్టర్ కబీర్ ఖాన్ కొన్ని నెలలు ఎదురుచూసి సల్మాన్‌తో తీసినట్లు సినీవర్గాలు తెలిపాయి. రిలీజ్ తర్వాత మూవీ పలు అవార్డులు సొంతం చేసుకుంది.
కరెన్సీ నోటు కాస్త చిరిగినా, మరకలు పడ్డా మార్కెట్లో తీసుకునేందుకు వెనకాడతారు. అయితే బ్యాంకులు తీసుకుంటాయి. ఆ చిరిగిన, మరకలు పడ్డ కరెన్సీ నోట్లను బ్యాంకు కౌంటర్లలో మార్చుకోవచ్చు. ఎలాంటి ఫాం నింపకుండానే రోజుకు 20 నోట్లు గరిష్ఠంగా ₹5,000 వరకు మార్చుకోవచ్చు. అంతకు మించితే ఛార్జీలుంటాయి. పాడైపోయిన నోట్లను బ్యాంకు సిబ్బంది స్వీకరించకపోతే బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. > SHARE
AP: వరద బాధితులకు సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్ నంబర్లతో పాటు క్యూఆర్ కోడ్‌లు అందుబాటులోకి తీసుకొచ్చింది. సాయం చేయాలనుకునే వారు పైన ఉన్న క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి తమ వంతు విరాళం అందజేయవచ్చు. ఇవి నేరుగా సీఎం రిలీఫ్ ఫండ్‌లో జమవుతాయి.
రష్యాతో యుద్ధ సంక్షోభం మరింత ముదురుతున్న వేళ ఉక్రెయిన్ ప్రభుత్వంలో పెను మార్పులు జరుగుతున్నాయి. మంత్రివర్గంలో సగానికి పైగా వైదొలగుతారని తెలిసింది. ఇప్పటికే ఆరుగురు రాజీనామా చేశారు. ప్రెసిడెంట్ సలహాదారుపైనా వేటుపడింది. ఆయుధాల ఉత్పత్తి బాధ్యుడు ఒలెక్సాండర్ కమిషిన్‌కు రక్షణ విభాగంలోనే మరో పదవి ఇస్తారని సమాచారం. మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయని జెలెన్‌స్కీ గతవారమే సంకేతాలు ఇవ్వడం గమనార్హం.
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు గేట్లు మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,98,937 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ ప్రస్తుత నీటిమట్టం 586 అడుగులుగా ఉంది. అంతకుముందు శ్రీశైలం గేట్లు మూసివేసిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.