News September 2, 2024

TODAY HEADLINES

image

✒ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. 20 మందికి పైగా మృతి
✒ విజయవాడ మీదుగా వెళ్లే 132 రైళ్లు రద్దు
✒ రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన
✒ HYD-VJA జాతీయరహదారిపై రాకపోకలు బంద్
✒ వరద బాధితులకు 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు: CM చంద్రబాబు
✒ అధికారులు సెలవులు పెట్టొద్దు: సీఎం రేవంత్
✒ తెలుగు సీఎంలకు మోదీ ఫోన్.. సాయం అందిస్తామని హామీ

News September 1, 2024

తీవ్ర విషాదం: 11 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు మృతి

image

ఝార్ఖండ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎక్సైజ్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ఫిజికల్ టెస్టుల్లో పాల్గొన్న అభ్యర్థుల్లో 11 మంది మృతి చెందారు. ఆగస్టు 22 నుంచి 30 మధ్య పలు జిల్లాల్లో ఈ ఘటనలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. వీటిని అసహజ మరణాలుగా పేర్కొంటూ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. నిర్వహణ లోపం వల్లే ఈ మరణాలు సంభవించాయని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.

News September 1, 2024

పవన్ కళ్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్

image

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా OG మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్, పోస్టర్‌ను రిలీజ్ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు ప్రకటించారు. త్వరలో మరింత పెద్దగా వేడుక జరుపుకుందామని పిలుపునిచ్చారు. నిర్మాతల నిర్ణయంతో పవర్ స్టార్ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

News September 1, 2024

కుక్కల్ని పెంచుకుంటున్నారా.. ఈ జాతి కుక్కలతో జాగ్రత్త!

image

పెంపుడు కుక్క‌ల‌కు చుట్టూ ఉన్న ప‌రిస్థితులు అనుకూలంగా లేక‌పోతే వాటి స్వ‌భావంలో వ‌చ్చే మార్పులు మ‌న‌కి, పిల్ల‌ల‌కు మంచివి కాద‌ని వెట‌ర్న‌రీ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అలాంటి బ్రీడ్‌ల‌ను పెంచుకోవ‌ద్దని సూచిస్తున్నారు. అందులో ప్ర‌ధానంగా రోట్వీలర్, చౌ చౌ, జాక్ రస్సెల్ టెర్రియర్, చివావా, అకితా, పెకింగీస్, షి త్జు, బుల్‌మాస్టిఫ్, డాబర్‌మాన్, గ్రేహౌండ్ వంటి జాతులకు దూరంగా ఉండాల‌ని సూచిస్తున్నారు.

News September 1, 2024

ధోనీని ఎప్పటికీ క్షమించను: యూవీ తండ్రి

image

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీపై యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమారుడి కెరీర్‌ను అతను నాశనం చేశాడని, నాలుగేళ్ల ఆటను తగ్గించాడని మండిపడ్డారు. ‘ధోనీ గొప్ప క్రికెటరే. అందుకు సెల్యూట్ చేస్తా. కానీ నా కుమారుడి విషయంలో మాత్రమే ఎప్పటికీ క్షమించను’ అని వ్యాఖ్యానించారు. భారత క్రికెట్‌కు యూవీ చేసిన సేవలకుగాను భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.

News September 1, 2024

CMలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్

image

తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల జరిగిన నష్టాన్ని ప్రధాని మోదీ TG CM రేవంత్, AP CM చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. ఇద్దరితో ఫోన్లో మాట్లాడారు. ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించినందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలను మోదీ అభినందించారు. హెలికాప్టర్లను పంపిస్తామని హామీ ఇచ్చారు.

News September 1, 2024

నాలుగో అంతస్తు నుంచి పడి జర్నలిస్ట్ దుర్మరణం

image

ప్రముఖ జర్నలిస్ట్ ఉమేశ్ ఉపాధ్యాయ్(64) కన్నుమూశారు. ఢిల్లీలో నిర్మాణంలో ఓ బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు సెకండ్ ఫ్లోర్‌లో పడిపోవడంతో మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈయన మృతిపట్ల ప్రధాని మోదీ Xలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 25 ఏళ్ల కెరీర్‌లో ఉమేశ్ జన్‌మత్ టీవీ, జీన్యూస్, దూరదర్శన్, PTI, ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు.

News September 1, 2024

ALERT: వర్షాల్లో ఇవి అస్సలు చేయొద్దు: CS

image

TG: రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రజలకు పలు సూచనలు చేశారు. వాగులు, నదులు పొంగి పొర్లుతుంటే వంతెనలు ఎక్కి చూడడం చేయవద్దన్నారు. ఆ సమయంలో ఎక్కడైనా బ్రిడ్జి, వంతెన కొట్టుకుపోతే జరిగే ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందని, వాగులు, చెరువులు, నదుల వద్దకు వెళ్లి సెల్ఫీలు, ఫొటోగ్రాఫ్‌లు తీసుకోవద్దని ఆమె కోరారు.

News September 1, 2024

‘బిగ్‌బాస్8’ కంటెస్టెంట్స్ వీళ్లే

image

‘బిగ్‌బాస్‌తెలుగు 8’ ఈరోజు ప్రారంభమైంది. విష్ణుప్రియ(యాంకర్), ఆదిత్య ఓం(లాహిరి లాహిరి లాహిరిలో సినిమా), అభయ్ నవీన్(పెళ్లి చూపులు), కిర్రాక్ సీత(7arts), యష్మీగౌడ(స్వాతి చినుకులు), నిఖిల్ మలియక్కల్(గోరింటాకు సీరియల్), ప్రేరణ(కృష్ణ ముకుంద మురారీ), సోనియా(నటి), శేఖర్ భాషా(RJ), నాగమణికంఠ(యాక్టర్), పృథ్వీరాజ్(నటుడు), నైనిక(డాన్సర్), ఇన్‌ఫ్లూయెన్సర్స్ బెజవాడ బేబక్క, నబీల్ అఫ్రీది కంటెస్టెంట్స్.

News September 1, 2024

హాస్టల్‌లో మృతి చెందిన IPS అధికారి కూతురు

image

లక్నోలోని రామ్‌మనోహర్ లోహియా నేషనల్ లా వర్సిటీలో చదువుతున్న IPS అధికారి కుమార్తె అకస్మాత్తుగా మరణించడం కలకలం రేపింది. LLB థర్డ్ ఇయర్ చదువుతున్న అనికా రస్తోగీ(19) హాస్టల్ గదిలో అపస్మారక స్థితిలో పడిఉండగా, సహచర విద్యార్థులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆమె తండ్రి సంతోష్ రస్తోగీ NIAలో IG హోదాలో పనిచేస్తున్నారు. అనికా మృతిపై దర్యాప్తు జరుగుతోంది.