News September 1, 2024

ఆదుకుంటాం.. ఆందోళన వద్దు: సీఎం

image

AP: భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘తక్షణ సాయం అందించేందుకు మంత్రులు, ఉన్నతాధికారులు సిద్ధంగా ఉన్నారు. ముంపు ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బాధితుల కష్టాలు తెలుసుకునేందుకు విజయవాడ సింగ్‌నగర్‌లోని బుడమేరు వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించా. సమస్య పరిష్కారమయ్యే వరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఉండి పనిచేస్తా’ అని ట్వీట్ చేశారు.

News September 1, 2024

ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు ₹1.75 లక్షల కోట్లు

image

గతేడాది ఆగస్టులో ₹1.59 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదవగా, ఈ ఏడాది అదే నెలలో ₹1.75 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. మొత్తంగా 10% వృద్ధి నమోదైనట్లు తెలిపింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ₹9.13 లక్షల కోట్లు వచ్చినట్లు పేర్కొంది. ఆగస్టులో డొమెస్టిక్ రెవెన్యూ 9.2% వృద్ధితో ₹1.25 లక్షల కోట్లు, దిగుమతుల ద్వారా 12.1% వృద్ధితో ₹49,976 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రకటించింది.

News September 1, 2024

తెలంగాణ వర్సిటీ పరిధిలో ఎగ్జామ్స్ వాయిదా

image

TG: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో రేపు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. తదుపరి తేదీని త్వరలో వెల్లడిస్తామని రిజిస్ట్రార్ యాదగిరి వెల్లడించారు. కాగా హైద‌రాబాద్‌ JNTU ప‌రిధిలో జరగాల్సిన పరీక్షలను కూడా <<13994789>>పోస్ట్‌పోన్<<>> చేసిన విషయం తెలిసిందే.

News September 1, 2024

వేధింపుల వెనుక ఆ పార్టీ నేత‌లు: న‌డ్డా

image

హేమ కమిటీ నివేదిక ద్వారా మాలీవుడ్‌లో వెలుగుచూసిన వేధింపుల బాధితుల‌కు న్యాయం చేయడంలో కేర‌ళ ప్ర‌భుత్వం ఎందుకు ఆల‌స్యం చేస్తోంద‌ని BJP జాతీయ అధ్య‌క్షుడు JP న‌డ్డా ప్ర‌శ్నించారు. కేర‌ళ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న మాట్లాడుతూ వేధింపుల వెనుక కమ్యూనిస్ట్ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ విష‌యాన్ని నివేదిక స్ప‌ష్టం చేసింద‌ని, పార్టీ నేత‌ల‌ను రక్షిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై CM స్పందించాలని డిమాండ్ చేశారు.

News September 1, 2024

రాబందుల వ‌ల్ల ఉప‌యోగాలు తెలుసా?

image

నేచ‌ర్ శానిటేష‌న్ వ‌ర్క‌ర్స్‌గా ప‌రిగ‌ణించే రాబందులు జంతువుల కళేబరాలను తింటూ ఆంత్రాక్స్, రేబిస్ వంటి వ్యాధుల వ్యాప్తిని నివారిస్తాయి. జంతువుల‌ మృతదేహాలు కుళ్లిపోవడానికి ఎక్కువ టైం పడుతుంది. రాబందులు లేక‌పోతే వాటి స్థానాన్ని కుక్క‌లు ఆక్ర‌మించి స‌మాజంలో వ్యాధుల‌ను వ్యాప్తి చేస్తాయి. అందుకే అంటారు When Vultures Die, We Die అని. ఈ నేపథ్యంలోనే రాబందుల సంర‌క్ష‌ణ‌కు WWF-INDIA శ్రీకారం చుట్టింది.

News September 1, 2024

OFFICIAL: తెలుగు రాష్ట్రాల్లో రేపు స్కూళ్లకు సెలవు

image

కుండపోత వర్షాలు, వరదలకు తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్కూళ్లకు సెలవు ప్రకటించాయి. తొలుత ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ఇవ్వగా, తాజాగా సీఎంలు చంద్రబాబు, రేవంత్ అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News September 1, 2024

సినీ ఇండస్ట్రీలలో మార్పు అవసరం: సమంత

image

నటీమణులపై లైంగిక వేధింపుల ఘటనల గురించి సమంత మరోసారి గొంతు విప్పారు. ఈ మేరకు ఇన్‌స్టాలో వరుస పోస్టులు చేశారు. ‘మార్పు అవసరం. మన పని ప్రదేశాన్ని పునర్నిర్మించుకుందాం. కేరళలో హేమ కమిటీ రిపోర్టు తర్వాత మహిళలు సైలెన్స్‌ను బ్రేక్ చేసి వర్క్‌ప్లేస్‌లో లింగ వివక్ష, లైంగిక వేధింపులను చెబుతున్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, సినీ ఆర్గనైజేషన్లు ఏకతాటిపైకి వచ్చి బాధ్యతగా వ్యవహరించాలి’ అని పేర్కొన్నారు.

News September 1, 2024

ఘోరం: ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

image

TG: సంగారెడ్డి జిల్లా రుద్రారంలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. గోరు ముద్దలు తినిపించాల్సిన చేతితోనే ఆ మాతృమూర్తి పిల్లలకు తొలుత విషమిచ్చింది. ఆ తర్వాత తాను ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక కష్టాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

News September 1, 2024

హైదరాబాద్ JNTU పరిధిలో పరీక్షలు వాయిదా

image

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో హైద‌రాబాద్‌ JNTU ప‌రిధిలో సోమ‌వారం జ‌ర‌గాల్సిన ప‌లు ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. బీటెక్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్ట‌ర్ ఆర్‌18, 16, 15, 13 – బీఫార్మ‌సీ మూడో ఏడాది మొద‌టి సెమిస్ట‌ర్ ఆర్‌17, 15, 13 స‌ప్లిమెంట‌రీ, అలాగే ఎంబీఏ మొద‌టి ఏడాది ఫ‌స్ట్ సెమిస్ట‌ర్ ఆర్‌22, 19 స‌ప్లిమెంట‌రీ పరీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. సెప్టెంబ‌ర్ 2న జ‌ర‌గాల్సిన ఈ ప‌రీక్ష‌లు Sep 5వ తేదీకి వాయిదా ప‌డ్డాయి.

News September 1, 2024

PHOTO: జూనియర్ ఎన్టీఆర్ ట్రెడిషనల్ లుక్

image

జూనియర్ ఎన్టీఆర్ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. కర్ణాటకలోని ఉడిపి, కొల్లూరు ఆలయాలను సందర్శించుకున్న ఎన్టీఆర్.. పంచెకట్టులో కనిపించారు. ఈ ఫొటోను దేవర సినిమా టీమ్ ట్వీట్ చేసింది. ‘దేవర మౌనమే.. సవరణ లేని హెచ్చరిక’ అని క్యాప్షన్ పెట్టింది. తారక్ ట్రెడిషనల్ లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.