India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 1,130 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. SEP 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ పూర్తై, 18 నుంచి 23 ఏళ్లలోపు వయసు ఉన్న వారు అర్హులు. PET, PST, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫీజు రూ.100. APలో 27, TGలో 19 ఖాళీలున్నాయి. పే స్కేల్ రూ.21,700-69,100 ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పైనుంచి వస్తున్న 5,67,360 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. నదీ పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
భారీ వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అటు హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. స్థానిక పరిస్థితులను బట్టి రేపు సెలవు ప్రకటించడంపై అధికారులు ఇవాళ సాయంత్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
APలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కృష్ణా: 08672-252572, గుంటూరు:0863-2234014, అనకాపల్లి:08924-226599, కోనసీమ:08856-293104, తూ.గో:8977935609, ప.గో: 08816-299219 ఏలూరు: 18002331077, ఎన్టీఆర్:0866-2575833, శ్రీకాకుళం:08942-240557, మన్యం:08963-293046, విజయనగరం:08922-236947, బాపట్ల-8712655881 నంబర్లను ఏర్పాటు చేశారు.
TG: HYD పరిధిలో చెరువుల సమీపంలోని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారిని గుర్తించడంపై హైడ్రా దృష్టి పెట్టింది. ప్రభుత్వ స్థలాలను విక్రయించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రతి చెరువుకు సంబంధించి రెవెన్యూ ఫైల్స్ తెప్పించి, గూగుల్ మ్యాప్ ఆధారంగా సర్వే చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీని ఆధారంగా ఆక్రమణదారులను గుర్తించి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
APలో భారీ వర్షాలు పలు చోట్ల విషాదం నింపాయి. నిన్న విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మేఘన, లక్ష్మి, అన్నపూర్ణ, లాలూ పుర్కాయిత్, సంతోష్ ఉన్నారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది. గుంటూరు(D) ఉప్పలపాడులో వరద ఉద్ధృతికి కారు కొట్టుకుపోవడంతో టీచర్ రాఘవేంద్ర, విద్యార్థులు మాన్విక్, సౌరిశ్ మృతిచెందారు. మంగళగిరి గండాలయపేటలో కొండచరియలు విరిగిపడి నాగరత్నమ్మ చనిపోయింది.
TG: టీపీసీసీ చీఫ్‌గా ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్‌ను నియమిస్తూ ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన నియామకానికి ఆమోదం తెలుపుతూ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సంతకం కూడా చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఏ క్షణమైనా అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. కాగా బీసీ సామాజికవర్గం నుంచి ఈ పదవికి మధుయాష్కీ గౌడ్ పోటీపడినా మహేశ్ వైపే అగ్ర నేత సోనియా గాంధీ మొగ్గు చూపినట్లు సమాచారం.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో అర్ధరాత్రి 12.30-2.30 మధ్య తీరాన్ని దాటింది. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, నంద్యాల, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. లోతట్టు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
గాజాపై దాడులకు ఇజ్రాయెల్ తాత్కాలిక విరామం ఇచ్చింది. గాజాలో పాతికేళ్ల తర్వాత పోలియో కేసు నమోదు కావడంతో WHO టీకా డ్రైవ్ నిర్వహిస్తోంది. 6.50 లక్షల పాలస్తీనా చిన్నారులకు టీకా వేయనున్నారు. నిన్నటి నుంచే చిన్నారులకు వైద్య సిబ్బంది టీకా వేస్తూ కనిపించారు. 3 రోజుల పాటు ఈ డ్రైవ్ కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి హమాస్-ఇజ్రాయెల్ కూడా అంగీకరించాయి.
ఎస్సీ వర్గీకరణ అవసరమే అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన <<13751609>>తీర్పుపై <<>>రివ్యూ పిటిషన్ దాఖలైంది. ఈ తీర్పును పున:పరిశీలించాలని కోరుతూ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య పిటిషన్ వేశారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కి వ్యతిరేకమని ఆయన తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టుకు అధికారం లేదని, పార్లమెంట్‌లో చట్టం చేయాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Sorry, no posts matched your criteria.