India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పారాలింపిక్స్‌లో స్వర్ణం కొల్లగొట్టిన అవనీ లేఖరను మనూ భాకర్ ప్రశంసించారు. ఆమె ప్రయాణం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ‘షూటింగ్‌లో ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకం. ఇతర పారాలింపియన్స్ సైతం ఎంతో ప్రేరణనిస్తారు. వాళ్లు సవాళ్లను అధిగమించి దేశానికి పతకాలు తెస్తున్నారు. మనమంతా వాళ్ల నుంచి నేర్చుకోవాలి. వాళ్లను చూసి గర్విస్తున్నాను. అవనికి శుభాకాంక్షలు’ అని తెలిపారు. టోక్యోలోనూ అవని 2 పతకాలు గెలవడం విశేషం.
TG: తన సోదరుడు ఆనంద్‌కు చెందిన స్పోర్ట్స్ విలేజ్‌ను అక్రమంగా కూల్చివేశారని కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అనుమతులతో 7 ఎకరాలు లీజుకు తీసుకొని OROను ఏర్పాటు చేశామన్నారు. 2015 నుంచే ఇది నిర్వహణలో ఉందని, ఎలాంటి నోటీసులు లేకుండా హైడ్రా కూల్చివేయడం బాధించిందని Xలో రాసుకొచ్చారు. ప్రజా జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా పనిచేసిన తమపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమన్నారు.
టెలికం కంపెనీలకు ట్రాయ్ ఊరట కల్పించింది. సందేశాలు, కాల్‌బ్యాక్ నంబర్ల <<13931728>>వైట్‌లిస్టింగ్<<>> గడువును ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 30కి పొడగించింది. తమ సిస్టమ్స్ అప్‌డేట్ చేయాలని, లేదంటే దేశవ్యాప్తంగా యూజర్లు సందేశాల ఔటేజ్ ఎదుర్కొనే ప్రమాదం ఉందన్న ఆపరేటర్ల మొరను ఆలకించింది. స్పామ్ నిరోధానికి URL, APKs, OTT లింక్స్, కాల్‌బ్యాక్ నంబర్ల సందేశాలను రిజిస్టర్ చేయాలని కంపెనీలను ట్రాయ్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
సినీనటుడు బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానం వేడుకలు రేపు జరగనున్నాయి. ఈ ఈవెంట్‌కు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, సిద్ధు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ వంటి స్టార్లు రానున్నారు. కానీ ఎన్టీఆర్ రాకపై మాత్రం స్పష్టత లేదు. ఆయనకు ఆహ్వానం అందలేదని కొందరు, అందినా రారని మరికొందరు అంటున్నారు. Sr.ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకూ ఆయన హాజరు కాలేదని కొందరు గుర్తు చేస్తున్నారు.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శనివారం ధర్నా చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులు ఆందోళన చేపట్టాలని టీఎంసీ శ్రేణులకూ పిలుపునిచ్చారు. ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచార దోషులకు మరణ దండన విధించాలని, రేప్ కేసుల్లో కఠినశిక్షలు పడేలా కేంద్ర చట్టాలను సవరించాలన్న డిమాండ్లతో ఆమె ఈ నిరసన చేపడుతున్నారు. మరోవైపు విద్యార్థులపై ఆమె నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా బీజేపీ ఏడు రోజుల ధర్నాకు పిలుపునివ్వడం గమనార్హం.
TG: ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సభ్యత్వాలను రద్దు చేసేలా ఈసీకి ఆదేశాలివ్వాలని KA పాల్ హైకోర్టులో పిల్ వేశారు. ఇప్పటికే ఈ పిటిషన్‌లు పెండింగ్‌లో ఉండగా మరోసారి ఎందుకని కోర్టు ప్రశ్నించింది. అవి రాజకీయ ప్రయోజనాలతో దాఖలయ్యాయని, ఇది ప్రజాప్రయోజనాలకు సంబంధించినది పాల్ సమాధానమిచ్చారు. ఇదే విషయమై అఫిడవిట్ సమర్పిస్తే పరిశీలిస్తామని ఎల్లుండికి విచారణను వాయిదా వేసింది.
AP: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో CM చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలు ఉన్న జిల్లాల విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని సూచించారు. వర్షాలపై ప్రజలకు అలర్ట్ మెసేజ్‌లు పంపాలని, మ్యాన్ హోల్స్ వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు. వాగులు, వంకల వద్ద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాయి. తాజాగా గుంటూరు, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ, అల్లూరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. కాకినాడ జిల్లాలో విద్యార్థులకు నేడు నిర్వహించాల్సిన పరీక్షను సెలవు కారణంగా సెప్టెంబర్ 6న జరుపుతామని కలెక్టర్ తెలిపారు.
మలయాళ సినీ ఇండస్ట్రీపై హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో తమిళ బుల్లితెర నటి కుట్టి పద్మిని స్పందించారు. తాను బాలనటిగా ఉన్నప్పుడు వేధింపులకు గురైనట్లు వెల్లడించారు. ఆ విషయం తన తల్లికి చెప్పడంతో తనను ఆ ప్రాజెక్ట్ నుంచి తొలగించారని తెలిపారు. ఇక లైంగిక వేధింపులకు బుల్లితెర నటీమణులేం అతీతం కాదని ఆమె అన్నారు. కొందరు ఆ ఘటనలపై ఫిర్యాదులను నిరూపించుకోలేక, బయటికి చెబితే అవకాశాలు రావని భయపడుతున్నారని చెప్పారు.
కోల్‌కతా పోలీస్ కమిషనర్‌కు NHRC నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 27న ‘నబన్నా అభిజన్’ ర్యాలీలో ప్రజలపై అతి, కఠోర బలప్రయోగాన్ని ప్రశ్నించింది. ఆ రోజు ఎలాంటి చర్యలు తీసుకున్నారో 2 వారాల్లో రిపోర్టు ఇవ్వాలంది. BHIM ప్రతినిధి OP వ్యాస్ ఫిర్యాదుపై స్పందించింది. ‘200 మంది విద్యార్థులపై భౌతికదాడి చేశారు. చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది శాంతియుతంగా గుమిగూడే హక్కును ఉల్లఘించడమే’ అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.