News August 31, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 31, 2024

విద్యాసాగర్ నాపై కక్ష కట్టారు: నటి జెత్వాని

image

AP: వేధింపుల <<13969654>>కేసులో<<>> విచారణకు హాజరైన నటి జెత్వాని మీడియా ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. తనపై అక్రమ కేసులు పెట్టారని, అనేక రకాలుగా వేధించారని చెప్పారు. విద్యాసాగర్ తనపై కక్ష కట్టారని, తనతో పాటు కుటుంబసభ్యులు ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. 2015లో విద్యాసాగర్ ప్రవర్తనతో పెళ్లికి నిరాకరించానని తెలిపారు. పోలీసులకు అన్ని సాక్ష్యాలు, ఆధారాలు సమర్పించానన్నారు.

News August 31, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: ఆగస్టు 31, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 4:48 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:02 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:16 గంటలకు
అసర్: సాయంత్రం 4:42 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:30 గంటలకు
ఇష: రాత్రి 7.44 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు

News August 31, 2024

హర్ష భోగ్లే ఆల్‌టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ లెవెన్ ఇదే

image

ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే తన ఆల్‌టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ లెవెన్ ప్రకటించారు. ఇందులో రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, మ్యాక్స్‌వెల్, పొలార్డ్ వంటి ప్లేయర్లకు చోటివ్వలేదు. కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీని ఎంపిక చేశారు. జట్టు: క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్, ధోనీ (C/WK), హార్దిక్ పాండ్య, ఆండ్రీ రస్సెల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, లసిత్ మలింగా.

News August 31, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి

News August 31, 2024

శుభ ముహూర్తం

image

తేది: ఆగస్టు 31, శనివారం
త్రయోదశి: రాత్రి 3.41 గంటలకు
పుష్యమి: రాత్రి 7.39 గంటలకు
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉదయం 5.55-6.44 గంటల వరకు

News August 31, 2024

TODAY HEADLINES

image

✒ నాలుగోసారి కూడా అధికారం మాదే: మోదీ ✒ PARALYMPICS: భారత్‌కు ఇవాళ 4 పతకాలు ✒ AP: గుడ్లవల్లేరు కాలేజీ బాత్‌రూమ్స్‌లో కెమెరాల కలకలం ✒ AP: విద్యార్థినుల ఆందోళన.. విచారణకు ప్రభుత్వం ఆదేశం ✒ AP: ముగ్గురు IPSలపై జెత్వానీ ఫిర్యాదు ✒ AP: ప్రతి ఒక్కరూ ఏటా 2 మొక్కలు నాటాలి: CBN ✒ TG: మీసేవలో మరో 9 రకాల సర్టిఫికెట్లు ✒ TG: వెయ్యి ఎకరాల్లో కొత్త జూ పార్క్: CM ✒ TG: 2026 మార్చికి దేవాదుల పూర్తి: ఉత్తమ్

News August 31, 2024

ఆ రెండు సందర్భాల్లో తీపి వద్దు

image

స్వీట్స్ అమితంగా ఇష్టపడే వారు వాటిని తినే సమయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలని న్యూట్రీషియన్స్ సలహా ఇస్తున్నారు. ఉదయం లేవగానే, రాత్రి పడుకొనే ముందు శుద్ధి చేసిన చక్కెర తీసుకోవడం వల్ల హార్మోన్ల పనితీరులో అంతరాయం ఏర్పడి కచ్చితంగా బరువు పెరుగుతారని హెచ్చరిస్తున్నారు. ఈ రెండు సందర్భాల్లో తీపికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లతో రోజును ప్రారంభించవచ్చని సలహా ఇస్తున్నారు.

News August 30, 2024

చంద్రబాబు కర్నూలు పర్యటనలో మార్పు

image

AP: సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో మార్పు చోటు చేసుకుంది. రేపు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి పుచ్చకాయలమడలో పర్యటించాల్సి ఉండగా ఓర్వకల్లులో పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

News August 30, 2024

గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్ వీడియోల కేసు.. UPDATE

image

AP: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ <<13972426>>కాలేజీ<<>> కేసులో విచారణ ముమ్మరంగా జరుగుతోందని ఎస్పీ గంగాధర్ రావు తెలిపారు. బాధ్యులైన విద్యార్థిని, విద్యార్థి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను సీజ్ చేసి ప్రతి చిత్రాన్ని, డాక్యుమెంట్‌ను పరిశీలిస్తున్నామన్నారు. ఏ చిన్న మెటీరియల్, వీడియో గాని ఉన్నా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవైనా వీడియో రికార్డింగ్స్ ఫోన్లలో ట్రాన్స్‌ఫర్ అయ్యాయా అనే కోణంలోనూ విచారణ జరుగుతోందన్నారు.