News February 21, 2025

శంభాజీపై అభ్యంతర కంటెంట్: వికిపీడియా ఎడిటర్లపై కేసు?

image

కనీసం నలుగురు వికిపీడియా ఎడిటర్లపై మహారాష్ట్ర సైబర్ సెల్ కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ఛత్రపతి శంభాజీ మహారాజ్‌పై అభ్యంతరకర కంటెంటును తొలగించాలని కోరినా చర్యలు తీసుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. 10+ Emails పంపితే ఆటోమేటిక్ రిప్లై వచ్చింది గానీ కంటెంట్ డిలీట్ చేయలేదు. దీంతో CM దేవేంద్ర ఫడణవీస్ యాక్షన్ తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ‘ఛావా’ తర్వాత వికీ కంటెంటుపై ఫిర్యాదులు పెరిగాయి.

News February 21, 2025

OTTలోకి కంగనా ‘ఎమర్జెన్సీ’.. ఎప్పుడంటే?

image

కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా త్వరలో ఓటీటీలోకి రానుంది. మార్చి 17 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు కంగనా ఇన్‌స్టా స్టోరీలో వెల్లడించారు. ఇందులో ఆమె మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించారు. 1975-77 మధ్య ఎమర్జెన్సీ ప్రకటించిన సమయంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. గత నెల 17న రిలీజైన ఈ మూవీ రూ.22 కోట్ల వసూళ్లు రాబట్టింది.

News February 21, 2025

సంకల్పంతో కళ్లు లేకున్నా కలెక్టర్‌గా..!

image

మహారాష్ట్రకు చెందిన ప్రాంజల్ పాటిల్ ఇండియాలో మొట్ట మొదటి దృష్టిలోపం ఉన్న మహిళా IAS. చిన్నప్పుడే చూపు కోల్పోయినా బ్రెయిలీ, స్క్రీన్ రీడింగ్ టెక్నాలజీతో చదువుకున్నారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో పీజీ చేసి UPSCకి ప్రిపేర్ అయ్యారు. తొలి ప్రయత్నంలోనే 2016లో రైల్వే(IRAS)లో ఉద్యోగం సాధించినప్పటికీ వైకల్యం కారణంగా తిరస్కరణకు గురయ్యారు. 2017లో 124వ ర్యాంకు సాధించి IASకు ఎంపికై ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు.

News February 21, 2025

అఫ్గానిస్థాన్ టార్గెట్ ఎంతంటే?

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సౌతాఫ్రికా అఫ్గానిస్థాన్ ముందు 316 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ప్రొటీస్ ఓపెనర్ రికెల్‌టన్(103) సెంచరీతో అదరగొట్టారు. కెప్టెన్ బవుమా, డుసెన్, మార్క్‌రమ్ అర్ధసెంచరీలతో రాణించడంతో 6 వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది. అఫ్గాన్ బౌలర్లలో నబీ 2, ఫరూఖీ, అజ్మతుల్లా, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు.

News February 21, 2025

ఇండియాలో లెజెండరీ రాపర్ ఎమినెం కన్సర్ట్?

image

కోల్డ్‌ప్లేతో పాటు ఎడ్ షీరన్‌లు ఇప్పటికే ఇండియాలో కన్సర్ట్స్ నిర్వహించి ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణాలను అందించారు. తాజాగా లెజెండరీ రాపర్ ఎమినెం ఈ ఏడాది ఇండియాలో ప్రదర్శన ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి. ముంబైలో ఆయన కన్సర్ట్ ఉంటుందని సమాచారం. దీంతో సంగీత ప్రియులు ఈ ప్రదర్శన కోసం వెయిటింగ్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

News February 21, 2025

చాహల్ రూ.60కోట్ల భరణం.. ధనశ్రీ ఫ్యామిలీ ఖండన

image

చాహల్- ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారని, రూ.60 కోట్ల భరణం ఇచ్చేందుకు చాహల్ ఒప్పుకున్నారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. వీటిని ధనశ్రీ కుటుంబ సభ్యులు ఖండించడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చాహల్‌ను డబ్బు డిమాండ్ చేయలేదని, అలాంటి ఆఫర్ కూడా రాలేదని స్పష్టం చేశారు. అవాస్తవాలను ప్రచారం చేసి వారి ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరారు. అయితే విడాకులపై మాత్రం వారు క్లారిటీ ఇవ్వలేదు.

News February 21, 2025

ఓటీటీలో ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’.. మీరు చూశారా?

image

వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల నటించిన కామెడీ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ ఓటీటీ ప్రేక్షకులను మెప్పిస్తోంది. డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతూ ఇండియాలో టాప్-6లో నిలిచింది. రైటర్ మోహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మరి మీరు ఈ మూవీ చూశారా?

News February 21, 2025

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ నర్గీస్ ఫఖ్రీ?

image

బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫఖ్రీ రహస్యంగా తన ప్రియుడు టోనీ బేగ్‌ను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరి వివాహం కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్ హోటల్‌లో జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరూ హనీమూన్ కోసం న్యూజిలాండ్‌ వెళ్లినట్లు టాక్. దీనిని నర్గీస్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా నర్గీస్ నటించిన ‘అమావాస్య’ అనే హిందీ మూవీ తెలుగులోనూ విడుదలైన విషయం తెలిసిందే.

News February 21, 2025

కిస్, రొమాంటిక్ సీన్లు అందుకే చేయను: హీరో

image

అన్ని వయసుల వారు చూసేలా సినిమాలు చేయడమే తన ఉద్దేశమని మలయాళ హీరో ఉన్ని ముకుందన్ తెలిపారు. అందుకే ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు చేయొద్దని తాను రూల్ పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. ఇంటిమేట్ సీన్లలో నటించమని దర్శకులు, నిర్మాతలు ఒత్తిడి చేసినా తాను ఈ నిర్ణయాన్ని మార్చుకోలేదని చెప్పారు. ఆయన నటించిన ‘మార్కో’ సినిమా ఇటీవల విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

News February 21, 2025

గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్

image

AP: రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు రాయనున్న అభ్యర్థులను APPSC అలర్ట్ చేసింది. మరోసారి పోస్ట్, జోనల్ ప్రిఫరెన్స్ ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. పరీక్షల అనంతరం అర్హత సాధించిన అభ్యర్థులు ఫైనల్ సెలక్షన్ కోసం సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలోనూ కచ్చితంగా మరోసారి పోస్ట్, జోనల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎల్లుండి 92,250మంది మెయిన్స్ పరీక్ష రాయనున్నారు.