India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: చేనేత కార్మికులకు త్వరలోనే రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. వచ్చే నెలలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని 190 చేనేత సంఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని తనను కలిసిన చేనేత కార్మిక సంఘాల నాయకులకు వివరించారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి సంక్షేమ మండలిని ఏర్పాటు చేయడం, పొదుపు పథకంలో నిధుల జమపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

AP: ప్రభుత్వ స్కూళ్లలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కొత్త మెనూను 4 జోన్లవారీగా ఈ రెండు నెలలు ప్రయోగాత్మకంగా అమలుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఉత్తరాంధ్ర జోన్-1, ఉ.గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు జోన్-2, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జోన్-3, రాయలసీమను జోన్-4 విభజించింది. ఆయా ప్రాంతాల్లోని స్థానిక వంటలు, అభిరుచులు, పోషకాలను పరిగణనలోకి తీసుకుని ఆహారం అందించాలని విద్యాశాఖ ఆదేశించింది.

జోన్-1: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, గుడ్డు కూర, రసం, రాగిజావ, వెజ్ పలావ్, ఆలూ కూర్మా, చిక్కీ, సాంబారు, పులిహోర, స్వీట్ పొంగలి రోజుకో రకం ఇస్తారు.
జోన్-2: రెగ్యులర్ ఫుడ్‌తోపాటు అదనంగా ప్రైడ్ ఎగ్, మిక్స్‌డ్ వెజిటబుల్ కూర.
జోన్-3: రోజువారీ ఆహారంతోపాటు అదనంగా టమాటా పప్పు, టమాటా/పుదీనా చట్నీ.
జోన్-4: అదనంగా పులగం, వేరుశనగ చట్నీ, ఉప్పు కారంతో గుడ్డు, కందిపప్పు చారు, బెల్లం పొంగలి.

జీతూ జోసెఫ్ డైరెక్షన్‌లో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘దృశ్యం-1, 2’ సినిమాలకు ప్రత్యేక ఫాన్ ఫాలోయింగ్ ఉంది. దాదాపు అన్ని భాషల్లో ఈ చిత్రాలు రీమేక్ అయ్యాయి. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పార్ట్-3 త్వరలోనే పట్టాలెక్కనుందని మోహన్ లాల్ అధికారికంగా ప్రకటించారు. ‘గతం ఎప్పుడూ సైలెంట్‌గా ఉండదు. దృశ్యం-3 పక్కా’ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. నిర్మాత ఆంటోనీ, డైరెక్టర్‌తో దిగిన ఫొటోను షేర్ చేశారు.

బంగ్లాతో విజయం అనంతరం భారత కెప్టెన్ రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. 70శాతానికి పైగా సక్సెస్ రేటుతో 100 విజయాలు దక్కించుకున్న కెప్టెన్‌గా పాంటింగ్ రికార్డును ఆయన సమం చేశారు. అన్ని ఫార్మాట్లూ కలిపి 137మ్యాచులకు కెప్టెన్సీ చేసిన రోహిత్ 33మ్యాచుల్లో మాత్రమే ఓటమిని చూశారు. 3 గేమ్స్ డ్రా అయ్యాయి. ఒకటి రద్దయింది. ఇక 30 ఏళ్లు దాటాక కెప్టెన్సీలో 100 విజయాలు సాధించిన ప్లేయర్ రోహిత్ మాత్రమే.

ప్రభుత్వోద్యోగం చేసేవారిలో చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చిన లేదా పుట్టిన బిడ్డ చనిపోయిన తల్లులకు మాతృత్వ సెలవుల్ని 60 రోజుల పాటు ఇవ్వనున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రకటించింది. ఇప్పటికే ఉన్న మెటర్నిటీ లీవ్ నిబంధనలే ఈ సెలవులకూ వర్తిస్తాయని పేర్కొంది. అటు పీజీ చదువుతున్న ఎంబీబీఎస్ వైద్యులకు పూర్తి జీతాన్ని ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది.

AP: దక్షిణ కైలాసంగా పేరొందిన శ్రీకాళహస్తిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి మార్చి 6 వరకు వైభవంగా జరగనున్నాయి. ఇవాళ సాయంత్రం భక్త కన్నప్ప ధ్వజారోహణంతో ఉత్సవాలకు అర్చకులు అంకురార్పణ చేస్తారు. తర్వాత రోజుకొక వాహనాన్ని స్వామివారి సేవలకు వినియోగిస్తారు. ఉత్సవాలకు హాజరుకావాలని పలువురు సీఎంలు, ప్రముఖ హీరోలకు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇప్పటికే ఆహ్వానపత్రికలు అందజేశారు.

AP: మాజీ సీఎం జగన్‌కు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ప్రధాని, హోంమంత్రికి వైసీసీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి లేఖ రాశారు. జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల గుంటూరు పర్యటనలో తీవ్ర భద్రతా వైఫల్యం తలెత్తిందని, ఆయన నివాసం వద్ద కూడా కొన్ని అనుమానాస్పద ఘటనలు జరిగాయన్నారు. వెంటనే ఆయనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు.

విదేశాల్లో వైద్య విద్య అభ్యసించడానికి ముందుగా నీట్ యూజీలో అర్హత సాధించాలన్న నిబంధన సరైనదేనని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. 2018లో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఈ నిబంధనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ నిబంధనను మార్చాలంటూ పలువురు విద్యార్థులు చేసిన విజ్ఞప్తులను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. చట్టంలోని సెక్షన్ 33 ప్రకారం ఆ నిబంధనను అమలు చేసే అధికారం MCIకి ఉందని స్పష్టం చేసింది.

AP: స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ ఇంట్లో విషాదం నెలకొంది. కొడుకుకు ‘ఖేల్‌రత్న’ చూసి మురిసిపోవాల్సిన తండ్రి కాశీ విశ్వనాథం(65) గుండెపోటుతో చనిపోయారు. ఢిల్లీలో అవార్డు ప్రదానోత్సవం కోసం నిన్న అమలాపురం నుంచి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఆయన కుప్పకూలారు. USలో ఉన్న సాత్విక్ సోదరుడు వచ్చాక అంత్యక్రియలు చేస్తారు. 2023కు గాను సాత్విక్ ఖేల్‌రత్నకు ఎంపికవగా పలుకారణాలతో అప్పుడు తీసుకోలేదు.
Sorry, no posts matched your criteria.