News February 21, 2025

కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

image

వన్డేల్లో అత్యధిక క్యాచులు అందుకున్న భారత ప్లేయర్‌గా అజహరుద్దీన్ (156) పేరిట ఉన్న రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశారు. బంగ్లాదేశ్‌తో మ్యాచులో ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా ఈ లిస్టులో జయవర్ధనే (218), పాంటింగ్ (160) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. మూడో స్థానంలో అజహరుద్దీన్, కోహ్లీ ఉన్నారు. విరాట్ 295 ఇన్నింగ్స్‌లలో, అజహరుద్దీన్ 332 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ అందుకున్నారు.

News February 21, 2025

గాజాను నియంత్రించాలన్న ఆసక్తి మాకు లేదు: ఇజ్రాయెల్

image

గాజా భూభాగాన్ని నియంత్రించాలన్న ఆలోచన తమకు లేదని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ తెలిపారు. ఆ ఆలోచనే ఉంటే తమ బలగాలు గాజాలోకి చొచ్చుకెళ్లిన తర్వాత అక్కడే ఉండిపోయేవని వివరించారు. ‘హమాస్ గుప్పిట్లో మా దేశస్థులు 59మంది బందీలుగా ఉన్నారు. వారు బతికున్నారని మేం భావించడం లేదు’ అని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లోనే ఆ బందీలు మరణించారన్న హమాస్ ఆరోపణల్ని ఆయన ఖండించారు.

News February 21, 2025

పబ్లిక్ ఇష్యూకు రానున్న ఫోన్ పే

image

పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు తాము సన్నాహాలు ప్రారంభించినట్లు డిజిటల్ చెల్లింపు సేవల సంస్థ ఫోన్ పే ప్రకటించింది. ‘మా సంస్థ సేవలు ప్రారంభమై ఈ ఏడాదికి పదేళ్లు పూర్తవుతోంది. 12 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువకు చేరుకున్నాం. ఈ సందర్భంగా ఐపీఓకు రావడం మా సంస్థ చరిత్రలో ఓ మైలురాయి’ అని పేర్కొంది. దేశంలో డిజిటల్ చెల్లింపు యాప్‌లలో ఫోన్ పే ఏకంగా 48శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండటం గమనార్హం.

News February 21, 2025

రాత్రిపూట లైట్ ఆన్ చేసుకునే నిద్రపోతున్నారా?

image

చాలామందికి రాత్రి లైట్ ఆన్ చేసుకుని నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు ఉన్న వారికి అనారోగ్య ముప్పు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చీకటిలో నిద్రపోయే వారి కంటే వెలుగులో నిద్రపోయేవారికి ఊబకాయం ముప్పు ఎక్కువగా ఉంటుంది. అలాగే చిరాకు, మానసిక కల్లోలం, డిప్రెషన్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. రక్తంలో చక్కెర స్థాయులు పెరిగి మధుమేహం రావచ్చు. అధిక రక్తపోటు, గుండె జబ్బులూ వచ్చే అవకాశం ఉంది.

News February 21, 2025

14 ఏళ్లకే ఆరు ప్రపంచ రికార్డులు!

image

మహారాష్ట్రకు చెందిన 14 ఏళ్ల ఆర్యన్ శుక్లా కాలిక్యులేటర్ కంటే వేగంగా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా ఇతడు 6 ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. వంద 4-అంకెల సంఖ్యలను కేవలం 30.9 సెకన్లలో, రెండు వందల 4 అంకెల సంఖ్యలను 1.9 నిమిషాల్లో, యాబై 5 అంకెల సంఖ్యలను 18.71 సెకండ్లలో యాడ్ చేశాడు. వీటితో పాటు డివిజన్, మల్టిప్లికేషన్స్‌లో మరో మూడు రికార్డులు సృష్టించాడు.

News February 21, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 21, 2025

ఫిబ్రవరి 21: చరిత్రలో ఈరోజు

image

1894: శాస్త్రవేత్త శాంతి స్వరూప్ భట్నాగర్ జననం (ఫొటోలో)
1941: ఇన్సులిన్ సహ ఆవిష్కర్త ఫ్రెడరిక్ బాంటింగ్ మరణం
1976: సినీ గాయకుడు విజయ ప్రకాశ్ జననం
1977: సినీ గాయకుడు రంజిత్ జననం
1988: నటి వేదిక జననం
2013: దిల్‌సుఖ్ నగర్‌లో బాంబు పేలుళ్లు.. 18 మంది మృతి
* అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

News February 21, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: ఫిబ్రవరి 21, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 5.27 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.39 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
అసర్: సాయంత్రం 4.43 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.20 గంటలకు
ఇష: రాత్రి 7.33 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 21, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 21, 2025

శుభ ముహూర్తం (శుక్రవారం, 21-02-2025)

image

తిథి: ఉ.8.20 వరకు అష్టమి, తదుపరి నవమి
నక్షత్రం: జ్యేష్ట (మ.12.46 నుంచి)
రాహుకాలం: ఉ.10.30 నుంచి మ.12.00 వరకు
యమగండం: మ.3.00 నుంచి మ.4.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.24- ఉ.9.12, మ.12.24-మ.1.12
వర్జ్యం: సా.6.46 నుంచి రా.8.28 వరకు
అమృత ఘడియలు: తె.5.04 ల