News August 21, 2024

హైడ్రా కూల్చివేతల తీరుపై హైకోర్టు ప్రశ్నలు

image

TG: అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న హైడ్రా పరిధిపై <<13906009>>హైకోర్టు<<>> ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీని విధివిధానాలు చెప్పాలని AAGని ఆదేశించింది. ఇదొక ఇండిపెండెంట్ బాడీ అని, చెరువుల పరిరక్షణ కోసమే ఏర్పాటైందని AAG కోర్టుకు వివరించారు. స్థానిక సంస్థల అనుమతితో చేపట్టిన నిర్మాణాలు అక్రమమని 15-20 ఏళ్ల తర్వాత కూల్చేస్తే ఎలా అంటూ.. తదుపరి విచారణను కోర్టు మ.2.15కు వాయిదా వేసింది.

News August 21, 2024

ఇ-కామర్స్ వృద్ధికి గర్వమేల: పీయూష్ గోయల్

image

రాబోయే పదేళ్లలో మన మార్కెట్లో సగం ఇ-కామర్స్ నెట్‌వర్క్‌లో భాగమవ్వడం గర్వించే విషయం కాదని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిజానికిది ఆందోళనకరమని చెప్పారు. ఇది ప్రిడేటరీ ప్రైసింగ్‌కు దారితీస్తుందని, సామాజిక అంతరాలు ఏర్పడొచ్చని హెచ్చరించారు. కొద్దిమందే ఆన్‌లైన్లో గ్రాసరీస్ కొనడం కొంత ఉపశమనం అన్నారు. అమెజాన్ వంటి సంస్థల పెట్టుబళ్లతో ఎకానమీకి ఏమీ ఒరగదని, దాంతో రిటైల్ స్టోర్లు మూతపడొచ్చన్నారు.

News August 21, 2024

డిజిటల్ ఫార్మాట్లో వార్తలకే ఓటు: స్టడీ

image

వార్తలను చదివేందుకు యాప్‌లు, వెబ్ వంటి డిజిటల్ ఫార్మాట్లనే రీడర్లు ఇష్టపడుతున్నారని హ్యూమనిఫై స్టడీ తెలిపింది. పత్రికలతో పోలిస్తే 84% మంది దీనికే ఓటేశారంది. అరచేతిలో మొబైల్ ఉండటం, ఎక్కడికెళ్లినా సులభంగా సమాచారం తెలుసుకొనేందుకు వీలవ్వడమే ఇందుకు కారణాలు. లోకల్ వార్తలకు రీడర్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని సర్వే పేర్కొంది.

News August 21, 2024

కాళేశ్వరంపై కొనసాగుతున్న విచారణ

image

TG: BRK భవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ ప్రారంభించింది. రిటైర్డ్ ENC మురళీధర్‌ను జస్టిస్ పీసీ(పినాకీ చంద్ర) ఘోష్ ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇచ్చిన అఫిడవిట్ ఆధారంగా విచారణ జరుగుతోంది. తమ ముందు అఫిడవిట్లు దాఖలు చేసిన 57 మందిలో రోజుకు ఒకరు లేదా ఇద్దరిని కమిషన్ విచారించనుంది.

News August 21, 2024

లేటరల్ ఎంట్రీ: రాహుల్‌ ఒకలా.. థరూర్ మరోలా

image

రాహుల్, ఖర్గే వ్యతిరేకించిన లేటరల్ ఎంట్రీ విధానానికి శశి థరూర్ మద్దతివ్వడం ఆశ్చర్యపరిచింది. సివిల్ సర్వీసెస్‌లో రిజర్వేషన్లకు పాతరేయడమే ప్రభుత్వ ఉద్దేశమని మొదటి ఇద్దరూ విమర్శించారు. అడ్మినిస్ట్రేషన్‌లో అంశాల వారీగా నెలకొన్న నిపుణుల కొరతను పూడ్చాలంటే ఈ విధానమే శరణ్యమని శశి తేల్చేశారు. భవిష్యత్తులో మాత్రం రిజర్వేషన్లు, అమల్లో ఉన్న రూల్స్ ప్రకారం నియమించుకొని సివిల్స్ అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు.

News August 21, 2024

జగన్ విదేశీ పర్యటనకు అనుమతిపై విచారణ.. తీర్పు వాయిదా

image

యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న మాజీ సీఎం జగన్ పిటిషన్‌పై హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జగన్‌ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోర్టుని కోరింది. దీనిపై ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. ఈ నెల 27కు తీర్పుని కోర్టు వాయిదా వేసింది.

News August 21, 2024

రేపు చేవెళ్లలో కేటీఆర్ ధర్నా

image

TG: ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ అమలు చేయాలని BRS పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇదే నినాదంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా మండల, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు మాజీ మంత్రి కేటీఆర్ చేవెళ్లలో రైతులతో కలిసి ధర్నా చేయనున్నారు.

News August 21, 2024

ఈనెల 26న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ తెలుగు ట్రైలర్!

image

‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రానికి సంబంధించిన టైటిల్ రోల్‌‌కు సూపర్ స్టార్ మహేశ్‌బాబు వాయిస్ అందిస్తున్నారు. ఇప్పటికే వాయిస్ ఓవర్ పూర్తయిందని, ఈనెల 26న ఉదయం 11.07 గంటలకు ట్రైలర్ రిలీజ్ కానుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 20న ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. హిందీ వెర్షన్‌కు షారుఖ్ ఖాన్ తన కుమారులు ఆర్యన్ ఖాన్, ఖాన్‌తో కలిసి డబ్బింగ్ చెప్పారు.

News August 21, 2024

భారీగా పెరిగిన బంగారం ధర

image

హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.550 పెరిగి రూ.73,200కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల గోల్డ్ రూ.500 పెరిగి రూ.67,100 పలుకుతోంది.

News August 21, 2024

వివేకా హత్య కేసు: ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్

image

వైఎస్ వివేకానంద హత్య కేసులో నిందితుడిగా ఉన్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతడు సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని, బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కోర్టును కోరింది. అయినా న్యాయస్థానం తాజాగా బెయిల్ ఇచ్చింది. కాగా, ఇదే కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.